ఇప్పడు మూవీ లవర్స్ అందరి చూపు పుష్పరాజ్ వైపే ..

పుష్ప పార్ట్ 1 లో తన నటనతో మ్యాజిక్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు పార్ట్ 2 తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి దడ పుట్టిస్తున్నాడు.

ఇప్పటి వరకూ వచ్చిన ఇండియన్ సినిమాల్లో పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ లో చరిత్ర సృష్టించింది.

దాదాపు 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బాలీ వుడ్ హీరోలకు బన్నీ వణుకు పుట్టించాడు.

ఆర్య సినిమాతో ప్రారంభమైన బన్నీ, సుకుమార్ జర్నీ పుష్ప ది రూల్ తో ఇప్పడు అంతర్జాతీయ స్థాయికి చేరింది.

డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల, అల్లు అర్జున్ తో  ఐటమ్ సాంగ్ చేసింది. ఇద్దరు తోపు డాన్సర్స్ విశ్వరూపం ఈ చిత్రంలో చూడొచ్చు.

ఐటమ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ చెన్నై లో జరిగింది. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు.

దర్శకుడు రాజమౌళి తో ఒక్క  చిత్రం చేయకుండా  పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ తన ఇమేజ్ తనే పెంచుకున్నాడు.

ఇప్పడు అందరి దృష్టి రేపు డిసెంబర్ 5 న ఐకాన్ స్టార్ క్రియేట్ చేసే కొత్త రికార్డ్స్ పైనే..