Venkatesh Biggest Victory In This Sankranthi – 2025 : విక్టరీ వెంకటేష్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే హౌస్‌ఫుల్ షోలు, భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. విక్టరీ హీరోగా, ఫ్యామిలీ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న వెంకటేష్ తన 35 సంవత్సరాల సినీ కెరీర్ లో ఈ సినిమాతో అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇంతటి ఘనవిజయాన్ని అందుకోడానికి కారణాలేమిటి?
ప్రేక్షకులను ఆకట్టుకున్న అంశాలు:
- వెంకటేష్ నటన: వెంకటేష్ తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, సహజమైన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన పాత్రలోని భావోద్వేగాలు, హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి.
- అనిల్ రావిపూడి దర్శకత్వం: అనిల్ రావిపూడి తన ప్రత్యేకమైన కథన శైలితో, వినోదాన్ని, భావోద్వేగాలను సమపాళ్లలో మిళితం చేసి, కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమయ్యారు.
- కథా కథనాలు: కుటుంభ సంబంధాలు, హాస్యం, సెంటిమెంట్లను సమన్వయం చేస్తూ, ప్రేక్షకుల హృదయాలను తాకే విధంగా కథను నడిపించారు.
- సంగీతం: భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని, సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
- సహాయ నటీనటులు: వెంకటేష్ సరసన కథానాయికలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఫ్రెష్ గా కనిపించి మంచి మార్కులు కొట్టేసారు.
కలెక్షన్లు: Venkatesh Biggest Victory In This Sankranthi – 2025
పండగ వాతావరణంలో గట్టి పోటీ మధ్య జనవరి 14 న విడుదల అయిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి, వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్గా నిలిచింది. రెండవ రోజు రూ. 33 కోట్ల గ్రాస్ సాధించింది. మొత్తం రెండు రోజుల్లో రూ. 77 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు, 12 రోజులు పూర్తయ్యే సమయానికి, సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 260 కోట్ల గ్రాస్‌ను దాటిందని ట్రేడ్ టాక్.
విజయానికి కారణాలు :
- సంక్రాంతి విడుదల: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావడం, కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించింది.
- పాజిటివ్ మౌత్ టాక్: సినిమా విడుదలైన వెంటనే పాజిటివ్ రివ్యూలు రావడం, ప్రేక్షకుల మధ్య మౌత్ టాక్ ద్వారా హైప్ పెరగడం కలెక్షన్లపై ప్రభావితం చేసింది.
- ఫ్యామిలీ ఎంటర్టైనర్: కుటుంబ ప్రేక్షకులకు అనుకూలమైన కథ, హాస్యం, భావోద్వేగాలు సమపాళ్లలో ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
- సినిమాటోగ్రఫీ: సినిమాలోని విజువల్స్, సన్నివేశాల చిత్రీకరణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటం కూడా విజయానికి తోడ్పడింది.
హీరో కారెక్టర్ డిజైన్ లో.. డైరెక్టర్ అనిల్ స్టైల్ అదుర్స్
దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమాల్లో హీరో పాత్రను ప్రత్యేకంగా మలచడంలో ఎంతో ప్రతిభ చూపిస్తారు. ప్రత్యేకంగా హీరో క్యారెక్టర్ డిజైన్ విషయంలో ఆయన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటారు. అనిల్ రావిపూడి హీరో పాత్రను ఎప్పుడూ ఎంటర్టైనింగ్గా, హై ఎనర్జీతో ఉండేలా డిజైన్ చేస్తారు. ప్రేక్షకులు ఆయా పాత్రలకు కనెక్ట్ అయ్యేలా ఆయన డైలాగ్‌లు, కామెడీ టచ్, మాస్ మసాలా ఎలిమెంట్స్‌ను జోడిస్తారు.అనిల్ రావిపూడి సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఒకేసారి మాస్ & క్లాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అనిల్ రావిపూడి కామెడీ, మాస్ మాత్రమే కాదు, ఎమోషనల్ కంటెంట్ కూడా బాగా బ్యాలెన్స్ చేస్తారు. హీరో క్యారెక్టర్‌కి అదనపు ఆకర్షణ కలిగించేలా డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ & mannerisms డిజైన్ చేస్తారు. అనిల్ రావిపూడి తన సినిమాల్లో హీరో క్యారెక్టర్ సరదాగా, శక్తివంతంగా ఉండేలా చూస్తారు. అందుకే తన సినిమాల్లోని హీరోలా కారెక్టర్ ప్రేక్షకులు ఈజీ గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఆయన తన మొదటి సినిమా పటాస్ నుండి వరస విజయాలు అందుకుంటూ వస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత, 100% సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడుగా అనిల్ ప్రత్యేకంగా నిలిచారు. ఇప్పటివరకూ అనిల్ రావిపూడి తీసిన 8 సినిమాలు విజయాన్ని అందుకున్నాయి.
హీరోల ఫ్యాన్స్‌ని సంతృప్తిపరచేలా హీరో పాత్ర
అనిల్ రావిపూడి ఏ హీరోతో సినిమా చేసినా, అతని ఫ్యాన్స్ 100% సంతృప్తి చెందేలా కథను మలుస్తారు. మాస్ ఫాన్స్ కోసం యాక్షన్ ఎలివేషన్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం హాస్యం, భావోద్వేగం, కుర్రాళ్ళ కోసం స్టైలిష్ మేనరిజం & క్యాచీ డైలాగ్స్ అనిల్ రావిపూడి సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. హీరో స్టైల్, బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్, ట్రెండ్‌ను అనుసరించి స్క్రిప్ట్ మలుస్తారు.కామెడీ, మాస్, ఎమోషన్ మిక్స్ చేస్తూ హీరో పాత్రను బలంగా నిలబెడతారు.ఫ్యామిలీ & యూత్‌కు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేస్తారు. ఈ స్ట్రాటజీ వల్లే అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమాల్లో హీరో పాత్ర ఎప్పుడూ బలంగా, మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటాయి.
సంక్రాంతికి వస్తున్నాం..వెంకీ పాత్ర వెరీ వెరీ స్పెషల్
విక్టరీ వెంకటేష్ కు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయనకు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్, కామెడీ టైమింగ్, మాస్ అప్పీల్ అన్నింటినీ అనిల్ రావిపూడి తన స్టైల్లో కచ్చితంగా వాడుకున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర మాస్, కామెడీ, ఎమోషన్ మేళవింపు అయింది. తన బాడీ లాంగ్వేజ్ తగ్గ పాత్ర పడటంతో ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ చెలరిగిపోయారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో ఫైట్ చేస్తూ అయన సీరియస్ గా చెప్పిన కామెడీ డైలాగ్స్ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి.
- వెంకటేష్ గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, ఫమిలీ ఎంటర్టైనర్స్ లో చేసిన కామెడీ టైమింగ్ బాగా పాపులర్.
- అనిల్ రావిపూడి తన F2, F3 సినిమాల్లో ఎలా వెంకీ కామెడీ టాలెంట్‌ని హైలైట్ చేసాడో, ఈ చిత్రంలో కూడా అదే ఫార్మాట్ కొనసాగించాడు.
- కొన్ని ఫన్నీ డైలాగ్స్, పంచ్ లైన్స్ సినిమాకే హైలైట్ అయ్యాయి.
- కామెడీ + ఎమోషన్ బలమైన స్క్రిప్ట్ ద్వారా వెంకటేష్ క్యారెక్టర్‌కి స్ఫూర్తిని అందించారు.
- వెంకటేష్ గతంలో గణేష్, ప్రేమించుకుందాం రా, ది బాడీగార్డ్ లాంటి సినిమాల్లో మాస్ అప్పీల్ చూపించారు.
- ఈ సినిమాలో కూడా కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్, ఎమోషనల్ ఫైట్స్ జోడించి వెంకటేష్ పాత్రను చాలా స్ట్రాంగ్‌గా మలిచారు.
ఇద్దరు ముద్దు గుమ్మలతో వెంకీ మామ చేసిన అల్లరి..
వెంకటేష్, ఐష్వర్య రాజేష్ లవ్ ట్రాక్ ప్రేమించిన పెళ్లి కాకుండా, పెళ్లి తర్వాత ప్రేమించే దంపతుల మజాకా అనే తరహాలో సాగింది. వారి మధ్య నవ్వించే సన్నివేశాలు, చిన్న చిన్న గొడవలు, కానీ లోపల ప్రేమ నిండిపోయిన బంధం బాగా వర్కౌట్ అయ్యింది.వెంకటేష్ సరదాగా పంచ్‌లు వేస్తే, ఐష్వర్య సీరియస్‌గా చూసే సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. వెంకటేష్ స్వతహాగా హాస్య ప్రధానమైన సన్నివేశాల్లో నేచురల్‌గా కనిపించగల నటుడు, ఐశ్వర్య కూడా తన కామెడీ టైమింగ్‌తో సినిమాకే హైలైట్ అయ్యింది. ఇక రెండో నాయిక మీనాక్షి పాత్ర సినిమా మొదట్లో చిన్నగా కనిపించినా, కథలో ఓ కీలక మలుపుగా మారింది. వెంకటేష్, మీనాక్షి చౌదరి లవ్ ట్రాక్ యూత్‌ఫుల్ & ఫన్నీ ఎలిమెంట్స్ మేళవించిన విధంగా కనిపిస్తుంది.ముఖ్యంగా ‘యంగ్ వెంకటేష్’ లుక్, 90s లవ్ స్టోరీ వంటివి సినిమాకి స్పెషల్ ఎలిమెంట్‌గా నిలిచాయి. వారి మధ్య కొన్ని క్యూట్ మోమెంట్స్, ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య రాజేష్‌తో కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది, ఎందుకంటే అది పూర్తిగా ఫన్ & ఎమోషనల్ గా ఉంది. మీనాక్షి చౌదరి లవ్ ట్రాక్ చాలా ఫన్నీగా & ఇంట్రెస్టింగ్గా ఉండి, సినిమాకి కొత్త మలుపు ఇచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే.. వెంకటేష్-ఐశ్వర్య రాజేష్ ఫ్యామిలీ డ్రామా & ఫన్ కెమిస్ట్రీ, వెంకటేష్-మీనాక్షి చౌదరి యూత్‌ఫుల్ & మెలో డ్రామా కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.
భలే నవ్వించిన..బుల్లిరాజు
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో బుల్లిరాజు పాత్ర ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. చిన్నపిల్లల పాత్రలు సాధారణంగా సినిమాల్లో చిన్న చిన్న ట్రాక్‌లకు మాత్రమే పరిమితం అవుతుంటాయి. కానీ ఈ సినిమాలో బుల్లిరాజు పాత్రను హృద్యంగా, హాస్యంతో, హృదయాన్ని హత్తుకునేలా డిజైన్ చేశారు. భీమవరం పిల్లోడు రేవంత్ బుల్లిరాజు గా చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళను తెగ నవ్వించాడు. సినిమా చూసిన తర్వాత ఎక్కువగా గుర్తు తెచ్చుకునే పాత్రగా ఈ పాత్రను డిజైన్ చేసాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకీ – బుల్లిరాజుల మధ్య వచ్చే ఫన్నీ మూమెంట్స్ తో ప్రతి ఒక్కరూ ఐడెంటిఫై అవ్వుతారు.
బుల్లిరాజు పాత్ర ప్రత్యేకత
- బుల్లిరాజు పాత్ర కేవలం నవ్వించేందుకు మాత్రమే కాదు, సినిమాలో భావోద్వేగాన్ని పెంచేందుకు కూడా ఉపయోగించారు.
- వెంకటేష్, బుల్లిరాజు మధ్య వచ్చే అదిరిపోయే కామెడీ సన్నివేశాలు, ముద్దుగా అనిపించే డైలాగ్‌లు సినిమాకు ప్లస్ అయ్యాయి.
- బుల్లిరాజు పాత్రలో నటించిన ఆ చిన్నారి నటుడు అద్భుతమైన సహజమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
- ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధులను చేశాయి
F2, F3 తో పోల్చితే.. మాస్ & ఫ్యామిలీ బిగ్ హిట్
విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ & మాస్ మసాలా అని అందరికీ తెలుసు.
F2 (2019), F3 (2022) రెండు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ హిట్స్ అయితే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రం వీటన్నింటికన్నా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా మొత్తం వసూళ్లు, ప్రేక్షకాదరణ, క్రిటిక్స్ అప్లాజ్ అన్నింటిలోనూ ముందుంది.
F2, F3 కంటే ఈ సినిమా ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి టాప్ 5 కారణాలు:
F2 & F3 లో పక్కా కామెడీ మిక్స్తోనూ, అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్గా వచ్చాయి. కానీ కథ విషయంలో లోపాలు ఉండటం వల్ల కొన్ని రివ్యూస్ మిశ్రమంగా వచ్చాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో మాత్రం స్ట్రాంగ్ స్టోరీ ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలివేషన్, కామెడీ అన్నీ సమతులంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది. సంక్రాంతి పండుగ నేపథ్యం తో మరింత కనెక్ట్ అయ్యింది. కేవలం కామెడీ మాత్రమే కాదు, కథ కూడా బలంగా ఉండడం సినిమాను పెద్ద విజయంగా మార్చింది. F2, F3 లో వెంకటేష్ పాత్ర చాలా సరదాగా, కొంచెం హాస్యాస్పదంగా ఉండేది. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో ఆయన పాత్రలో మాస్ & ఎమోషన్ ఎక్కువగా ఉన్నాయి. యాక్షన్ & పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఉండటం వల్ల అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఆయనకు కుటుంబ నాయకుడిగా, ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా, అద్భుతమైన కామెడీ, ఇంటెన్స్ ఎమోషన్ కలిపిన రోల్ ఇచ్చారు. సంక్రాంతి రేసులో రామ్ చరణ్, బాల కృష్ణ సినిమాలు కొంచెం వెనకపడటం ఈ సినిమాకు మరింత కలిసి వచ్చి, కలెక్షన్స్ జాతరను గుర్తు చేసింది.








