RK Roja Poll On Tirumala Laddu Issue : అందరిలోనూ పరువు పోయిందిగా

RK Roja Poll On Tirumala Laddu Issue : అందరిలోనూ పరువు పోయిందిగా: అధికారంలో ఉన్నంత కాలం నోటికి హద్దు, అదుపూ లేకుండా ప్రత్యర్ధి పార్టీలపైన, నాయకుల పైన అవాకులు, చెవాకులు పేలిన ఆర్కే రోజా మరోసారి ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు. వైసిపీ పార్టీ నాయకులు, అభిమానులు ఫైర్ బ్రాండ్ గా ముద్దుగా పిలుచుకున్న రోజా మంటపెట్టే మాటలకు  ఆ పార్టీనే ఆహుతి అయ్యింది. 151 సీట్లనుంచి 11 సీట్లకు పడిపోయిన ఆ పార్టీ ఘోరపరాజయంలో, అందరి నాయకులకంటే రోజా (R.K Roja) వాటా కాస్త ఎక్కువే అని చెప్పాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పైనా, టిడిపి అధినేతలు చంద్రబాబు(Chandra Babu), లోకేష్(Lokesh)ల పైనా మంచి మర్యాద లేకుండా ఆమె ఎన్నికలకు ముందు పేల్చిన మాటల తూటాలు తిరిగి ఆ పార్టీకే తగిలి కుప్పకూలిపోయింది. ఇంత డ్యామేజ్ జరిగినా ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయినట్టు కనిపించడం లేదు. తిరిగి ఆర్కే రోజాను అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఈమధ్యే ప్రెస్ నోట్ విడుదల చేసారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న రోజా తాజాగా మీడియా ముందుకు వచ్చి, తన స్టైల్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం మొదలెట్టారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తిరుమల లడ్డు.. కల్తీ వ్యవహారంలో తిరుపతి అమ్మాయిగా తిరుమలకి అన్యాయం జరిగితే ఊరుకోనని..వీరవనిత లెవెల్లో కూటమి అధినేత చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఒక వీడియో విడుదల చేసారు. ఆ వీడియో చూసిన నెటిజన్స్ తిరుమలని భ్రస్టు పట్టించిన నువ్వే మళ్లి తిరుమల పవిత్రత గురించి మాట్లాడతావా? నువ్వు తిరుపతి అమ్మయివా? నీ ఏజ్ ఏంటి? నువ్వు అమ్మయివేంటి? ఆంటీ అంటూ రకరకాల కామెంట్స్ తో సోషల్ మీడియాలో విరిచుకుపడుతున్నారు. అయినా ఆమె మాటల్లో గానీ, చేతల్లో ఏమాత్రం మార్పు లేదు. తాజాగా ఈరోజు ఆమె తన సొంత యూట్యూబ్ ఛానల్లో తిరుమల వ్యవహారం పై రెండు ఒపీనియన్ పోల్స్ పెట్టి వైసిపీ పార్టీ పరువును మరోసారి గంగలో కలిపేసింది.RK Roja Poll On

లేపి మరీ తన్నించుకున్న రోజా..Tirumala Laddu Issue : అందరిలోనూ పరువు పోయిందిగా:

తాజాగా రోజా చేసిన ఆ అరుదైన ఘనకార్యం ఏంటంటే ‘తిరుమల లడ్డూ కల్తీలో తప్పు ఎవరిది’ అంటూ తన ఛానెల్ లో  ఓ ప్రశ్న సంధించి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వైయస్ జగన్ పేర్లను జత చేసింది. నిన్న పెట్టిన ఆ పోస్ట్ కి ఇప్పటివరకూ దాదాపు 76 వేల ఓట్లకు పైగా వచ్చాయి. అందులో 74% పైగా జనాలు జగన్ మోహన్ రెడ్డి దే తప్పంటూ ఓట్లు వేసారు. 7% మంది పవన్ కళ్యాణ్ అనీ, 19% చంద్రబాబు అనీ ఓటింగ్ వేసారు. అంతేకాక చేయాల్సింది అంతా చేసి ఇలాంటి పిచ్చి పోస్ట్లు పెట్టడానికి సిగ్గు లేదా అంటూ కామెంట్ సెక్షన్లో నానా తిట్లు తిడుతూ రెచ్చిపోయారు. ఇక మరో పోస్ట్ లో ‘తిరుమల ఎవరి పాలనలో బాగుంది’ అంటూ క్వచ్చన్ చేసారు. ఇందులో వైయస్ జగన్, చంద్రబాబు పేర్లను జత చేసారు. దీనికి సమాధానంగా 20% శాతానికి పైగా వైయస్ జగన్ అనీ, 80% పైగా చంద్రబాబు పాలనలోనే బాగుంది అని అభిప్రాయపడ్డారు. ఓటింగ్ వేసిన దాదాపు 30 వేలమంది ఈ జవాబు ఇచ్చారు. ఇక ఇక్కడ కూడా ఓటింగ్ తో సరిపెట్టకుండా నానా తిట్లు తిట్టారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రోజా వైసిపీ పార్టీకి చెందిన నాయకురాలు. ఆమె ఛానెల్ ఫాలో అయ్యేది కూడా ఆ పార్టీ అభిమానులే ఎక్కువ ఉంటారు. ఆ ఛానెల్ ఎవరైతే ఎక్కువగా ఫాలో అవుతారో వాళ్ళకే ఆ పోస్ట్ ఎక్కువగా కనపడేటట్టు యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఓటింగ్ చేసిన వాళ్ళంతా ఎక్కువగా వైసిపీ పార్టీ అభిమానులే. అంటే వాళ్ళకే జగన్ మోహన్ రెడ్డి పాలన, చేసిన పని నచ్చడం లేదు..తిరుమల వ్యవహారంలో జగన్ దే తప్పు అని రోజా పెట్టిన ఈ రెండూ పోస్ట్లు వాళ్ళ పార్టీ అభిమానుల సాక్షిగానే ప్రూవ్ చేసాయి. ఒకరకంగా ఆ పార్టీ నాయకులు తప్పు తెలుసుకోవడానికి, వాళ్ళలో మార్పు రావడానికి రోజా మంచి పనే చేసారని చెప్పవచ్చు. కానీ ఇక్కడ రోజా ఉద్దేశ్యం వేరు. ఆమె ఎదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. ఇక ఈ విషయాన్ని ఖండ ఖండాలుగా ఖండిచటం, వైసిపీ పార్టీ వాళ్ళు చేయకుండా ఉంటే మంచిది. లేదంటే మళ్లి పడుకున్న గుఱ్ఱాన్ని లేపి తన్నించుకున్నట్టు అవుతుంది. 

Pawan Kalyan's own mark in the reign..Does it look like good days have come again for AP? పాలనలో పవన్ కళ్యాణ్ తనదైన మార్క్..ఎపి కి మళ్లి మంచి రోజులు వచ్చినట్టేనా?
Pawan Kalyan’s own mark in the reign..Does it look like good days have come again for AP? పాలనలో పవన్ కళ్యాణ్ తనదైన మార్క్..ఎపి కి మళ్లి మంచి రోజులు వచ్చినట్టేనా?

నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు..

తాము అధికారంలో ఉన్నన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని నేరాలు, హత్యలు, అత్యాచారాలు జరిగినా ఏ ఒక్కసారి స్పందించని రోజా ఇప్పడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తరచూ మీడియా ముందుకు వస్తున్నారు. రాష్ట్రం లో ఎక్కడ ఏం జరిగినా అది చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ అసమర్ధత వల్లే జరిగాయని మీడియా గొట్టాల ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పడు దళితుల పైనే కాకుండా ఎన్నో వర్గాల పైన దాడులు జరిగాయి. ఇక అత్యాచారాలకు లెక్కే లేదు. ఎంతోమంది మహిళలు ఆచూకీ లేకుండా పోయారు. జగన్ మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో అత్యాచారం జరిగినా గడిచిన 5 ఏళ్లలో వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఆ సమయంలో కనీసం వాటి గురించి కనీస ప్రస్తావన తీసుకు రాని రోజా ఇప్పడు మాత్రం ఖండ ఖండాలుగా ఖండిస్తూ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ లేని విధంగా గంజాయి కల్చర్ పెరిగిపోయింది. జగన్ మోహన్ రెడ్డి హయంలో పోలీస్ వ్యవస్థ చేతులు కట్టేయడంతో వైసిపీ నాయకులే స్వయంగా గంజాయి సామ్రాజ్యాన్ని విస్తరించారని ఆరోపణలు ఉన్నాయి. గంజాయి మత్తుకు అలవాటు పడిన యువకులు అనేక నేరాలకు పాల్పడుతూ తమ భ్యవిషత్తుని అంధకారం చేసుకున్నారు. ఇక కల్తీ మద్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బ్రాండెడ్ మద్యాన్ని కాదని తమ సొంత బ్రాండ్స్ మద్యాన్ని జగన్ సర్కార్ విచ్చలవిడిగా అమ్మకం సాగించింది. ఎక్కడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా, డైరెక్ట్ కాష్ రూపంలో ఎంతో అక్రమార్జనకు పాల్పడింది. 2014లో  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బెల్ట్ షాపులపై ఉద్యమించి ఆర్కే రోజా అప్పట్లో చాలా హడావిడి చేసింది. మరి జగన్ సర్కార్ ఇంత నిసిగ్గుగా మధ్యం విధానాన్ని అమలు చేస్తుంటే, ప్రభుత్వం లో మంత్రి పదవి వెలగబెట్టిన ఆమె ఏం చేసినట్టు? తాము చేస్తే సంసారం..మిగతావాళ్ళు చేస్తే అది వేరే అనే విధంగా ప్రతి అంశంపై అడ్డగోలుగా మాట్లాడుతున్న రోజా లాంటి వైసిపీ నాయకులను ప్రజలు చీదరించుకుంటున్నారు.

చెట్టు ఒకటైతే కాయ మరొకటి అవుతుందా?

ఒక రాజకీయ పార్టీ ఐనా, ఒక సంస్థ అయినా విజయవంతంగా ముందుకు సాగాలంటే మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడు వాటికి సారధ్యం వహించాలి. అప్పుడే ఆ పార్టీ ఐనా సంస్థ అయిన పది కాలాలపాటు మనుగడ సాగిస్తుంది. ఇక్కడ ముందునుండీ కూడా వైసిపీ పార్టీకి లేనిది అదే. గడిచిన 5 సంవత్సరాలలో ఆ పార్టీని ఒక రాజకీయ పార్టీలా కాకుండా ఒక వ్యాపార సంస్థలా జగన్ మోహన్ రెడ్డి నడిపించారు. వ్యాపారంలో తమకి పోటీదారులు ఉండకూడదని ఎలా అనుకుంటారో తమకి రాజకీయ ప్రతర్ధులు, ప్రతిపక్ష నేతలు లేకుండా తాము ఒక్కరే ఉండాలని, ఇంకెవరూ కూడా తమ దరిదాపుల్లో ఉండకూడదనే నియంతృత్వ పోకడతో పార్టీ ని నడిపించారు వైఎస్ జగన్. నాయకుడి ఆలోచనలకు తగ్గట్టే మిగతా నాయకులు ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ప్రతిపక్ష నాయకులను రకరకాల కేసుల్లో ఇరికించడమే కాకుండా, వాళ్ళ ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టి సమూలంగా లేకుండా చేయాలని ఎన్నో దారుణాలు చేసారు. ఆ సవాళ్లు అన్నీ తట్టుకుని నిలబడటానికి తెలుగుదేశం, జనసేన నాయకులు కార్యకర్తలు ఎన్నో అవమానాలు పడ్డారు. పాలక పక్షమే ఉండాలి..ప్రతి పక్షం ఉండకూడదు అనే రాజ్యంగా విరుద్ధమైన జగన్ మోహన్ రెడ్డి దురాలోచానకు ప్రజలు ఆయనకీ ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఇంట్లో కూర్చోబెట్టారు.

ఏడుకొండలవాడా క్షమించు.. పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష | Pawan kalyan Deeksha for Tirumala Laddu |
ఏడుకొండలవాడా క్షమించు.. పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష | Pawan kalyan Deeksha for Tirumala Laddu |

ఇది డిజిటల్..జమానా..కొంచెం మారండ్రా..

ఒకప్పడు రాజకీయ నాయకులు ఏది చెప్తే అదే నిజమని జనాలు నమ్మేవారు. గుడ్డిగా ఓట్లు గుద్ది వారినే తమ నాయకులుగా ఎంచుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు..జనాల మైండ్ సెట్ వేరు. ప్రజలు కూడా టెక్నికల్ గానూ, ఎన్నో అంశాల్లోనూ ఎంతో అప్డేట్ అయ్యారు. ఇక ఇప్పటి యూత్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? విచిత్రం ఏమిటంటే జనం ఇచ్చిన తీర్పుతో 11 సీట్లకే పరిమితమైన వైసిపీ నాయకులు మాత్రం అప్డేట్ అవ్వకుండా తాము చెప్పిందే నిజం అన్నట్టుగా ఇంకా జనాల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళే జనాల్లో నవ్వులపాలు అవుతున్నారు. దీనికి తోడు జగన్ మోహన్ రెడ్డి సొంత పత్రిక, టీవీ సాక్షి లో వస్తోన్న అబద్ధపు ప్రచారాలని చూసి జనం చీదరించుకుంటున్నారు. ఇక ఏదైనా హత్య లేదా అత్యాచారం జరిగినప్పడు దాన్ని రాజకీయంగా వాడుకుందామని పాలస్ నుండి బయటకు వస్తోన్న జగన్ అక్కడ మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటున్నాయి. పేపర్స్ పట్టుకుని ఆయన పెడుతున్న ప్రెస్ మీట్స్ ఈమద్య మరీ కామెడీ అయిపోతున్నాయి. వీటిని చూసిన జనాలు జగన్ మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలకు కింద కామెంట్ సెక్షన్ లో దారుణంగా కౌంటర్ ఇస్తున్నారు. ఓటమి తర్వాత తన తప్పులు తెలుసు కోకుండా, కారణాలు విశ్లేషణ చేయకుండా  ఓటమి కారణం ఈవీయంలు అంటూ జనం ఇచ్చిన తీర్పును కూడా అవమానం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఆ మాటలు విని ఇక రాజకీయ భ్యవిషత్తు శూన్యమే అంటున్నారు నెటిజన్స్. ఏదైనా అంశంపై మీడియా ముందుకు వస్తున్న జగన్ లేదా మిగతా నాయకులు పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, కొడాలి నాని, అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ట్రోల్స్ కి కావలసినంత కంటెంట్ ఇచ్చి వెళ్లి పోతున్నారు. ఇప్పడు వైసిపీ నాయకుల ప్రెస్ మీట్స్ అంటే జబర్దస్త్ కామెడీ షో లా ఫీల్ అవుతున్నారు జనాలు. కాస్త అప్డేట్ అవ్వండ్రా బాబు అంటున్నారు నెటిజన్స్. ఈ కథనం పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

Leave a Comment