Power Star Pawan Kalyan OG Movie Release When?

Pawan Kalyan OG Movie Shoot : పవన్ ఓజిపై ఫ్యాన్స్ కి ఎందుకంత మోజు ? సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ అయిపోయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమా సెట్స్ పై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోమని తన దర్శక, నిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య పవన్ ను నిర్మాతలు ఎ.ఏం రత్నం, డివివి దానయ్య డైరెక్టర్ సుజీత్ ప్రత్యేకంగా కలిసారు. పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో పవన్ పెండింగ్ లో పెట్టిన హరిహర వీరమల్లు, ఓజి (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ), హరీష్ శంకర్ దర్శకత్వం చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు వరసగా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి.Power Star Pawan Kalyan OG Movie Release When?

కొత్తదనం..కొత్తతరం

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో 1996 అక్టోబర్ 11న ప్రేక్షాభిమానులకు పరిచయమయ్యాడు పవన్ కళ్యాణ్. ఇప్పడు ఒక స్టార్ కిడ్ గానీ, సెలెబ్రిటీ స్టేటస్ ఉన్న ఫ్యామిలీ లో నుండి ఎవరైనా హీరో అవుతుంటే హంగామా మామూలుగా ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ కి అంత హంగామా ఏం జరగలేదు. ఒకరకంగా చెప్పాలంటే సినిమా విడుదల అయ్యేవరకూ మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు ఉన్నాడు అనే సంగతే సామాన్య జనానికి తెలియదు. సినిమా విశేషాలు తెలుసుకోవాలంటే న్యూస్ పేపర్స్ అలాగే సినిమా పత్రికలే ఉండేవి. అందుకే మీడియా, సోషల్ మీడియా ఇప్పుడున్నంతగా లేని. ఆ సమయంలో నిర్మాత అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ ని పరిచయం చేయడానికి ఒక కొత్త ఆలోచన చేశారు. ‘ఎవరీ..అబ్బాయి’ అంటూ పవన్ కళ్యాణ్ గోడకి ఆనుకుని స్టైల్ గా నిలబడి ఉన్న ఒక పోస్టర్ ని రాష్ట్రమంతా వేయించారు. 24 షీట్స్ పెద్ద పోస్టర్ ఆరోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాలలోనూ పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఎవరీ అబ్బాయి అంటూ జనాలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. ఆ తర్వాత మరో వారం రోజులకు ‘ఇతడే మన కళ్యాణ్’ అని మరో పోస్టర్ ని అదే ప్లేస్ లో అన్ని చోట్ల అతికించి విభిన్నంగా పవన్ కళ్యాణ్ ని పరిచయం చేసారు అల్లు అరవింద్.

తన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పెద్ద హిట్ కాకపోయినా చిరంజీవి తమ్మడు ఫైట్స్ ఇరగదీసాడు అనే పేరు మాత్రం వచ్చింది. అప్పటికే సినిమాల్లోకి వదిన సురేఖ బలవంతం తో వచ్చిన పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయిపోయి ఇక ప్రయత్నాలు ఏమి చేయకుండా సైలెంట్ అయిపోయాడు. పైగా కళ్యాణ్ తో సినిమా చేయడానికి నిర్మాతలు కూడా ఎవరూ పెద్దగా ముందుకురాలేదు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కి జిమ్ లో పరిచయమైన కొత్త నిర్మాత జివిజి రాజు తమిళంలో హిట్ అయిన Gokulathil Seethai తమిళ్ మూవీ రైట్స్ కొని కళ్యాణ్ తో తీయాలని ప్రయత్నాలు చేసారు. అది కార్తిక్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేద్దామని నిర్ణయించుకున్న కళ్యాణ్ ఆ ప్రపోజల్ కి మొదట ఒప్పుకోలేదు. సినిమా చూపించి తక్కువ బడ్జెట్ లో చేద్దామని బలవంతం చేయడంతో, కథ బాగుండడంతో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఆ సినిమా చేసాడు కళ్యాణ్. అదే గోకులంలో సీత. మంచి సెంటిమెంట్ తో ఫ్యామిలీస్ ని ఆకట్టుకున్న ఆ సినిమాతో కళ్యాణ్ కి కొంచెం ధైర్యం వచ్చింది.కళ్యాణ్ ఈ సినిమాకే మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని స్క్రీన్ నేమ్ వేసారు. వెంటనే లవ్ టుడే తమిల్ సినిమాని నిర్మాత ఆర్ బి చౌదరి పవన్ కళ్యాణ్ తో సుస్వాగతం పేరుతో తెలుగులో తీసారు. సుస్వాగతం పెద్ద విజయం సాధించడమే కాక యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చింది. ఇక అక్కడినుండి కొత్త కథలతో కొత్త వాళ్ళతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయిన కళ్యాణ్, తెలుగులో డైరెక్టర్ అవకాశం కోసం తిరుగుతున్న కరుణాకర్ కి తర్వాత సినిమాకి అవకాశం ఇచ్చారు. ఇద్దరు యంగ్ ఏజ్ లో ఉండటం, ఇద్దరి ఆలోచనలు కలవడంతో ఆ సినిమాకి క్రియేటివ్ సైడ్ కూడా హెల్ప్ చేసాడు పవన్ కళ్యాణ్. అలా అంచనాలు లేకుండా తెరకెక్కి విడుదల అయిన తర్వాత సంచలనం సృష్టించిన ఆ సినిమానే ‘తొలిప్రేమ’. విడుదలైన ప్రతీ థియేటర్ లోనూ రికార్డు వసూళ్లు సాధించి తొలిప్రేమ పవన్ కళ్యాణ్ కి మంచి బూస్టర్ లా పనిచేసింది. ఇక అక్కడినుండి తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి వరస బ్లాక్ బస్టర్ హిట్స్ తో పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవిని మించిన తమ్ముడిగా అప్పట్లో సంచలనం సృష్టించాడు. కొత్త వాళ్ళతో సినిమా అంటే మరో ఆలోచన లేకుండా ఒకే అంటారు..ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు రికార్డు వసూళ్లు సాధించడానికి ప్రధాన కారణం…పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం. ఈ 28 ఏళ్ల కాలంలో అనేక ఎత్తుపల్లాలను సినిమాల్లోనూ రాజకీయ జీవితంలోనూ ఆయన చూసారు. రాజకీయాల కారణంగా ఆయన పెండింగ్ లో పెట్టిన సినిమాల్లో ముఖ్యమైనది అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఓజి. (the original gangstar).

Pushpa 2: The Rule Will Allu Arjun Sukumar Devi Sri Prasad Create A Musical Sensation Once Again?
Pushpa 2: The Rule Will Allu Arjun Sukumar Devi Sri Prasad Create A Musical Sensation Once Again?

Pawan Kalyan OG Movie Shoot : పవన్ ఓజిపై ఫ్యాన్స్ కి ఎందుకంత మోజు ? Power Star Pawan Kalyan OG Movie Release When?

యంగ్ డైరెక్టర్ సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమా స్టార్ట్ చేసి చాలాకాలమే అయ్యింది. పవన్ కెరీర్ లో మోస్ట్ స్టైలిష్ మూవీ గా ఈ సినిమా ప్రత్యేకత సంతరించుకుంది. డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ స్టార్ట్ చేసిన సుజీత్ శర్వానంద్ హీరోగా రన్ రాజా రన్ సినిమాతో ఫిల్మ్ డైరెక్టర్ గా ప్రమోషన్ కొట్టేసారు. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ టైం లో థియేటర్ దగ్గర ఒక అభిమానిగా సుజీత్ చేసిన మెగా హంగామా అంతా ఇంతా కాదు. ఈమధ్య ఆ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. రన్ రాజా రన్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో ‘సాహో’ సినిమాని తెరకెక్కించాడు సుజీత్. బాహుబలి లాంటి సిరీస్ తర్వాత ఒక యంగ్ డైరెక్టర్ కి ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు, ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అయ్యారనే చెప్పాలి. భారీ వ్యయంతో, నాలుగు భాషల్లో, భారీ తారాగణంతో సమర్ధవంతగా ఆ సినిమాని తెరకెక్కించాడు సుజీత్. ‘సాహో’  ఆకాశమంత అంచనాలని చాలా వరకూ అందుకున్న సుజీత్ ఇండస్ట్రీ ద్రుష్టి ని తన వైపు తిప్పుకున్నాడు. డిఫరెంట్ టేకింగ్ తో, ట్విస్ట్ లతో సుజీత్ కథని నడిపించే విధానం అగ్ర హీరోలందరికీ భలే నచ్చేసింది. అందుకే ఇప్పడు ఏకంగా తన అభిమాన హీరోనే డైరెక్ట్ చేసే అవకాశం ఓజి తో అందుకున్నాడు సుజీత్. ఒక ఫ్యాన్ గా తన హీరోని ఎలా చూడాలి అని సగటు అభిమాని కోరుకుంటాడో, అంతకు మించి పవన్ ని ‘ఓజి’  ప్రెజెంట్ చేయబోతున్నాడు సుజీత్. పవన్ స్టైల్ కి, సుజీత్ టేకింగ్ టెక్నిక్ తోడయితే సినిమా రేంజ్ ఊహించలేము అంటున్నారు పవన్ ఫ్యాన్స్. అందుకే ఓజి సినిమా మొదలైన దగ్గరనుండి ఆ సినిమాపై ఎక్కడ ఎప్పుడూ లేనంత క్రేజు వచ్చేసింది. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ప్రతి పోస్టర్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఇక గత ఏడాది రిలీజ్ అయిన ఓజి గ్లిమ్ప్స్ పవన్, సుజీత్ కాంబో క్రేజు మరోసారి ప్రూవ్ చేసింది. పవన్ కళ్యాణ్ స్టామినా కి తగ్గటు ఏక్షన్ సీక్వెన్స్, పవన్ బాడీలాంగ్వేజ్ కి తగ్గ ఎలివేషన్స్ హంగ్రీ చీతా టీజర్ లో కనిపించాయి. దాంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అని గట్టిగా ఫిక్స్ అయిపోయారు మెగా ఫాన్స్.

పొలిటికల్ ఓజి

ఎన్నికలకి ముందు, ఆ తర్వాత కూడా పవన్ ఎక్కడ కనిపించినా సీఎం, అంటూ అభిమానులు నానా హంగామా చేసేవారు. అది చూసి ప్రత్యర్డులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన సినిమాలు చూస్తారు గాని, ఓటు వేయరని విమర్శలు చేసేవారు. వాళ్ళ విమర్శలకు తగ్గట్టు గత ఎన్నికల్లో వైసిపీ పార్టీకి పవన్ ఫ్యాన్స్ కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. ఆ దెబ్బకి వైసిపీ 11 సీట్లకు పడిపోయి, పోటిచేసిన అన్ని చోట్ల జనసేన పార్టీ ఘనవిజయం సాధించింది. డిప్యూటీ సీఎం తో పాటు పలు శాఖల మంత్రిగా పవన్ తన మార్క్ పరిపాలనతో అందరి అభినందనలు అందుకుంటున్నారు. ఆమధ్య పిటాపురం విజయోత్సవ సభ పెట్టినప్పుడు అభిమానులంతా ఓజి ఓజి అంటూ పెద్దగా నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా కడప జిల్లా మైసూరివారి పల్లెలో కూడా ఓజి సినిమా నినాదాలు వినిపించాయి. ఈ సందర్భంగా సినిమాలకంటే తనకి ప్రజా శ్రేయస్సే ముఖ్యమని, అందరూ ఆనందంగా ఉండటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని పవన్ తన మనసులో మాట బయట పెట్టారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా ఓజి

పవన్ కళ్యాణ్ మరో 15 రోజులు షూటింగ్ చేస్తే ఓజి సినిమా పూర్తయిపోతుంది. ఆయన లేని సీన్స్ అన్నీఇప్పటికే కంప్లీట్ చేసేసాడు డైరెక్టర్ సుజీత్. ప్రస్తుతం రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న పవన్ ఈమధ్యే హరి హర వీరమల్లు సినిమా కోసం కొన్ని రోజులు పని చేసారు. మార్చ్ చివరలో ఈ చిత్రం విడుదల కానునుంది. ఇక ఓజి సినిమా నిర్మాతలకు డేట్స్ ఇచ్చినట్టుగా సమాచారం. అందుకే దర్శకుడు సుజీత్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ లేని కొన్ని సన్నివేశాలను బ్యాంకాక్ లో షూట్ చేసుకుని వచ్చాడు. పవన్ కొన్ని రోజులే ఈ సినిమాకి పని చేయాల్సి ఉంది కాబట్టి హరిహర వీరమల్లు తర్వాత అంటే దసరాకి 2025 ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగన రాజకీయ పరిణామాలు, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వలన పవన్ ఇమేజ్ ఇండియా వైడ్ పెరగడంతో ఓజి సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువయాయి. ఇక ఆ తర్వాత హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి, పూర్తి స్థాయిలో ప్రజలకోసం పని చేయాలనీ ఫిక్స్ అయ్యారట పవన్. తర్వాత పరిస్టితులు అనుకూలిస్తే సినిమాలు చేస్తారు..లేకుంటే లేదు. ఇదీ..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్నిహితులు చెప్తోన్న మాట. అందుకే మంచి ఆకలి మీద ఉన్న పవన్ ఫ్యాన్స్ ఓజి గా పవన్ విశ్వరూపాన్ని సిల్వర్ స్క్రీన్ పై వీక్షించడానికి ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. ఈ కథనం పై  మీ అభిప్రాయాన్నికింద కామెంట్ రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయాన్నికింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

తగ్గేదేలే.. అంటూ పుష్పరాజ్ గా, కొత్త రికార్డులు సృష్టిస్తున్న అల్లు అర్జున్ | Pushpa 2 Pre Release Business Create A History
తగ్గేదేలే.. అంటూ పుష్పరాజ్ గా, కొత్త రికార్డులు సృష్టిస్తున్న అల్లు అర్జున్ | Pushpa 2 Pre Release Business Create A History

Leave a Comment