Pawan Kalyan’s own mark in the reign..Does it look like good days have come again for AP? పాలనలో పవన్ కళ్యాణ్ తనదైన మార్క్..ఎపి కి మళ్లి మంచి రోజులు వచ్చినట్టేనా? గడిచిన ఐదు సంవత్సరాలుగా కేవలం రాజకీయం మాత్రమే చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పడు నిజమైన పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు. వైసిపీ పాలనలో పాలన అనే పధం, దాని పరమార్ధం ఎక్కడా కనిపించలేదు. ప్రజా సమస్యల మీద బలంగా మాట్లాడిన నాయకుడు ఒక్కరు కూడా ఆ పార్టీలో లేరు. ఒకవేళ ఉన్నా మాట్లాడరు… మాట్లాడలేరు. అదీ అక్కడ పరిస్థితి. ఎంతసేపూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబుని తిట్టడం, పవన్ కళ్యాణ్ ని తిట్టడం, లోకేష్ ని ఎగతాళి చేయడం ఇదే తంతు వాళ్ళు అధికారంలో ఉన్నన్నినాళ్ళు కొనసాగింది. ఆఖరికి ప్రజా సమస్యలు చర్చించాల్సిన శాసన సభలో కూడా ప్రతిపక్ష నాయకులపై విరుచుకు పడటం, తమ సొంత నాయకుడుకి భజన చేయడం, విలువైన కాలాన్ని వృధా చేయడం ఇంతకుమించి 5 ఏళ్ల వారి పాలనా కాలంలో జరిగింది లేదు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన నాయకులు ప్రజలను, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఆ సమయానికి ఎదో ఒక పధకం డబ్బులు వాళ్ళ ఖాతాల్లో వేస్తే, వాళ్ళే మనల్ని మరలా నెత్తిన పెట్టుకుంటారని భావించారు. కానీ ఇక్కడ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అనే విషయం మర్చిపోయారు. వాళ్లకి కావాల్సింది పధకాలు కాదు, పరిపాలన అని తమ తీర్పుతో పాలకులకు తెలిసొచ్చేలా చేసారు. వైసిపీ అరాచక పాలనపై విసుగుచెందిన అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని బలంగా నమ్మారు. దాని ఫలితంగానే కూటమి 164 అసెంబ్లీ స్థానాలను, 21 పార్లమెంట్ స్థానాలను గెలిచింది. అతి విశ్వాసానికి పోయి నిండా మునిగిన వైసిపీ ఇప్పడు నేతి బీరకాయలో నేతి కోసం వెతికినట్టు, మైసూరు బజ్జీ లో మైసూర్ కోసం వెతికినట్టు కూటమి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడానికి, తమ రాజకీయ అస్తిత్వం కాపాడుకోడానికి నానా తంటాలు పడుతోంది.
పవన్ తో పెట్టుకుంటే..ప్రజలతో సున్నం పెట్టుకున్నట్టే..
పవన్ కళ్యాణ్.. ఆయనో సినిమా హీరో ఆయనకి రాజకీయాలు ఏం తెలుసు? మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నోడికి రాజకీయాలెందుకు? చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని, షూటింగ్ బ్రేక్ లో వస్తోన్న పవన్ కళ్యాణ్ మళ్ళి ఎన్నికలు అయిన తర్వాత కనపడడు.. అంటూ రకరకాల ఆరోపణలు చేస్తూ ఆయన వ్యక్తిగత జీవితాన్ని దారుణంగా టార్గెట్ చేసారు ప్రత్యర్డులు. ఇవన్నీ మౌనంగా భరించి, తను ప్రజలకోసం ఏవిధంగా నిలబడతాడో, తాను ప్రజలకు ఏమి చేయాలనీ అనుకుంటున్నాడో వాళ్లకి అర్ధమైనట్టు చెప్పడంలో పవన్ కళ్యాణ్ వందకి వంద శాతం విజయం సాధించారు. అంతే కాకుండా ఒక్కసారి కూడా అసెంబ్లీ లోకి అడుగుపెట్టకపోయినా, తన పదేళ్ళ రాజకీయ ప్రయాణంలో చూసిన ఎన్నో ఎత్తుపల్లాల అనుభవాలనుండి ఒక రాజకీయ ఉద్ధండుడిలా మారిపోయారు పవన్ కళ్యాణ్. తనకోసం కాకుండా రాష్ట్ర భ్యవిషత్తు కోసం పవన్ కళ్యాణ్ వేస్తోన్న రాజకీయ వ్యూహాలను ప్రజలు సరిగ్గా అర్ధం చేసుకున్నారు కాబట్టే ఆయన చెప్పినట్టు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అథ పాతాళానికి తొక్కి ప్రజలు మెచ్చే ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు.
ఎన్నికలకు ముందే ప్రచార సభల్లో ఈసారి కొత్త చంద్రబాబును చూస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తూ ఉండేవారు. నిజంగానే మారిన చంద్రబాబుని ఇప్పడు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. తనతో పాటు కూటమిలో భాగస్వాములైన మిత్ర పక్షాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ, తనకున్న అపారమైన అనుభవంతో ఒక రకంగా ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ లో డబల్ ఇంజిన్ సర్కార్ తో పరిపాలనని పరుగులు పెట్టిస్తున్నారు. దీని ఫలాలు అందడానికి మరికొంత సమయం పట్టొచ్చు. అస్తవ్యస్త మైన వ్యవస్థలను దారిలో పెట్టాలంటే ఇంకొంచెం సమయం కావాలి. ఈలోపే ఎదో జరిగిపోతుందని ఒకరోజు, ఏమి చేయట్లేదని ఒకరోజు, ఇంకా ప్రభుత్వం ఏర్పాటయ్యి 6 నెలలు కాకుండానే వైసిపీ నాయకులు ఓవర్ యాక్షన్ షురూ చేసేసారు. వైసిపీ నాయకులు ఎంత గగ్గోలు పెట్టి గొంతు చించుకున్నా.. వీళ్ళ పెర్ఫార్మన్స్ ని గత 5 సంవత్సరాలనుండి చూస్తున్న జనాలు మాత్రం వాళ్ళని అస్సలు పట్టించుకోవట్లేదు.
ట్రెండ్ సెట్టర్ పవన్..
ఇక ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా గ్రామీణం, పలు శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ పరిపాలనతో అన్ని వర్గాల ప్రజలను ఆకర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ వాగ్ధాటి చూసి అపార్ధం చేసుకున్న కొంతమంది అధికారులు గానీ. ప్రజలు గానీ ఇప్పడు ఆయన ఆలోచన విధానాన్ని అర్ధం చేసుకుని, ఆశ్చర్యపోతున్నారు. నిత్య విధ్యార్దిలా ప్రతి దాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ, కొత్తదనం నిండిన ఆలోచనలతో పరిపాలనా పరంగా ఆయన వేస్తున్న అడుగులు రాజకీయ మేధావుల్ని సైతం ఆకట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ కి ఏం తెలుసు రాజకీయాలు? అన్నవారికి నిజమే నాకు రాజకీయాలు తెలియదు ప్రజలకు సేవ చేయడం, పరిపాలన మాత్రమే తెలుసనీ ఆయన తన పనులతో బలమైన సందేశాన్ని ప్రజలకు వెళ్ళేలా చేస్తున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను పదే పదే విమర్శించకుండా, లోపాలను ప్రజలకు అర్ధమయ్యేలా చెప్తూ, తాము ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు అర్ధం అయ్యేలా వివరిస్తున్నారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే తన శాఖల అధికారులతో వరస సమావేశాలు నిర్వహించి, లోటుపాట్లు తెలుసుకుని నివేదిక సిద్ధం చేయమని, మూడు నెలల తర్వాత రంగంలోకి దిగుతామని చెప్పిన ఆయన అన్నట్టుగానే పలు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకు కంకిపాడులో శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి ప్రతీ గ్రామంలోనూ గ్రామ సభలను నిర్వహించి, గ్రామల్లో మౌలిక వసతులపై ఓ అవగాహనకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పడు ఆ సమస్యల పరిష్కారానికి వడి వడిగా అడుగులు వేస్తున్నారు.
Pawan Kalyan’s own mark in the reign..Does it look like good days have come again for AP? పాలనలో పవన్ కళ్యాణ్ తనదైన మార్క్..ఎపి కి మళ్లి మంచి రోజులు వచ్చినట్టేనా?
చంద్రబాబు నాయడు ఒకపక్క, పవన్ కళ్యాణ్ మరో పక్క ఇలా ఏ పొరపచ్చాలు లేకుండా డబల్ ఇంజిన్ సర్కార్ ని డబల్ స్పీడ్ లో పరిగెత్తించడం ప్రతిపక్ష వైసిపీ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక మనకి భ్యవిషత్తు కష్టమే అనే అనుమానాలు పెరిగిపోతున్న సమయంలో అధినేత జగన్ మోహన్ రెడ్డిలో ఏ మార్పు రాకపోగా, ప్రజల తీర్పునే అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారు. ఇక ఇలా ఐతే కష్టమే అని అర్ధం చేసుకున్న పలువురు వైసిపీ నేతలు పార్టీని వీడి పోతున్నారు. ఇక ఏ పార్టీలోకి వెళ్ళడానికి వీలులేని విధంగా తమ మాటల తూటాలతో రెచ్చిపోయిన పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా వంటివారు అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి పసలేని వాదనతో ప్రజల దృష్టిలో మరింత దిగజారిపోతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ వీళ్ళపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అదంతా పచ్చ మీడియా ప్రచారమని ఎంత కవర్ చేసుకున్నా, వాస్తవం ఏంటనేది వాళ్లకి తెలుసు కాబట్టి అతి విశ్వాసం చూపించకుండా ఉంటే మంచిది. ఎందుకంటే.. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే గత ఎన్నికల్లో వాళ్ళ అందరిని ఇప్పడు ఇంట్లో కూర్చోబెట్టింది.
తక్షణం స్పందించే గుణం..
ఏదైనా సమస్య తన కళ్ళముందు కనపడినప్పుడు గానీ, తెలిసినప్పుడు గానీ తక్షణం స్పందించడం పవన్ కళ్యాణ్ నైజం. చిన్నతనం నుండి ఇవే లక్షణాలతో పెరిగిన ఆయన, సినిమా రంగంలో హీరోగా మారిన తర్వాత ఆపదలో, ప్రమాదాల్లో ఉన్న ఎంతో మందికి రకరకాలుగా సహాయం అందించారు. తన కెరీర్ ప్రారంభంలో తొలిప్రేమ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు జరిగిన ఓ ప్రమాదం గురించి, దానిపై పవన్ కళ్యాణ్ స్పందించిన విధానం గురించి ఇటీవలే ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కెమెరామెన్ చోటా కె నాయుడు తెలియజేసారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే..తొలిప్రేమ సినిమాలో ఒక ఫైట్ షూట్ చేయడానికి హైదరాబాద్ శివార్లలో ఒక క్వారీ దగ్గరకు వెళ్లి ఎలా చేద్దామనే డిస్కషన్ లో ఉండగా, అప్పుడే కళ్యాణ్ షూటింగ్ స్పాట్ కి వచ్చాడు. తను ఆ రోజు షూట్ లో వేయాల్సిన వైట్ డ్రెస్ లోనే ఉన్నాడు. నేను, కళ్యాణ్ అక్కడ రోడ్డు పక్కన నిలబడి సీన్ కోసం మాట్లడుకుంటూ ఉండగా, ఇద్దరు కుర్రాళ్ళు అటుపై బైక్ పై వెళ్తూ కళ్యాణ్ వైపే చూస్తూ, షూటింగ్ గురించి, కళ్యాణ్ గురించి ఎదో మాట్లాడుకుంటూ వెళ్లి డివైడర్ ని డీ కొట్టి పడిపోయారు. పెద్ద శబ్దం రావడంతో అటు చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి పరిగెత్తుకుని వెళ్లి, వాళ్ళని సినిమా యూనిట్ కి సంబంధించిన వాహనంలో ఎక్కించి హాస్పిటల్ కి పంపించారని చోటా కె నాయుడు చెప్పారు. ఈ క్రమంలో కళ్యాణ్ వేసుకున్న డ్రెస్ కి రక్తపు మరకలు అంటి, ఆ రోజు షూట్ కి చాలా అలస్యమైనదని, తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో కూడా ఫోన్ ద్వారా తెలుసుకున్నారని ఆ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు. ఆ తర్వాత మరో సినిమా జల్సా షూటింగ్ లో కూడా ఒక టెక్నీషియన్ కి కరెంటు షాక్ కొడితే, అక్కడే స్పాట్ లో ఉన్న పవన్ కళ్యాణ్ వెంటనే అతన్ని ఎత్తుకుని, హాస్పిటల్ కి తీసుకెళ్ళి ప్రాణాపాయం నుండి కాపాడారు. ఈ విషయం బయట ప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా సినిమా ఇండస్ట్రీ లో చాలామందికి తెలుసు. సినిమా ఇండస్ట్రీ లోని పేద కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఆదుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేస్తున్నారు.
రాజకీయనాయకుడు కాదు..ప్రజా సేవకుడు
ఇక రాజకీయ నాయకుడిగా ప్రజా జీవితంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజా సేవకుడిగా మిగతా రాజకీయ నాయకులు లా కాకుండా ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లో కి వచ్చిన తరవాత ఎవరైనా సరే, తమ సొంత సొమ్ముని విపత్తులకు విరాళంగా ప్రకటించిన సందర్భాలు ఎక్కడా లేవు. మొన్న రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వరదలకు తన సొంత నిధులు 6 కోట్లు ప్రకటించి అందరికంటే తాను ఎంత భిన్నమో తెలియజేసారు పవన్ కళ్యాణ్. బాధితులకు ప్రభుత్వ సాయం వెంటనే అందాలంటే కొంత సమయం పడుతుంది. ఇలాంటి సందర్భాలలో ముందుగా మన వంతు సాయం అందించాలని, ప్రకటించడమే కాకుండా వెంటనే ఆ సాయాన్ని ప్రజలకు అందేలా చేసారు. ఇటీవలే కడప జిల్లా మైసూరవారిపల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 60 లక్షల సొంత నిధులతో ఆ గ్రామంలోని స్కూల్ గ్రౌండ్ కోసం ఎకరం ఆట స్థలాన్ని కొనుగోలు చేసి ఆ గ్రామానికి అందించారు. తాజాగా గుర్ల గ్రామంలో అతిసార వ్యాధి సోకి మృతి చెందిన కుటుంభాలకు లక్ష రూపాయలు చొప్పున తన సొంత డబ్బును విరాళంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బాధితులను పరామర్శించి, అక్కడి నీటి వసతులను పరిశీలించారు. కష్టం ఎక్కడ ఉన్నా తానున్నా అంటూ ముందుకు వస్తున్న ఆయన్ని చూసి ఇలాంటి ప్రజా సేవకుడ్ని ఇప్పటి వరకూ చూడలేదంటూ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.