Megastar Chiranjeevi’s upcoming line-up will get you mentally excited..2025 : ఫిలిం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఏ నటుడికైనా ఏ నటీమణికైనా, అలాగే ఏ టెక్నీషియన్ కైనా సరే ఫైనల్ టార్గెట్ చిరంజీవి. చిరంజీవి తో సినిమా చేయాలని ప్రతీ ఒక్క డైరెక్టర్, ప్రతీ ఒక్క హీరోయిన్ అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్ కోరుకుంటారు. చిరంజీవి సినిమానే తమ అంతిమ లక్ష్యంగా సినిమా ఇండస్ట్రీలో తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దర్శకుడు చిరంజీవికి యాక్షన్, కట్ చెప్పాలనుకుంటాడు. అలాగే కొత్తగా ప్రవేశించిన ఏ కథానాయకైనా సరే వెండితెరపై చిరంజీవితో ఆడిపాడాలనుకుంటుంది. ఒక కొత్త కెమెరామెన్ చిరంజీవి అభినయాన్ని తన కెమెరాలో అందంగా బంధించాలనుకుంటాడు. ఇలా ఏ విభాగంలో చూసిన గాని చిరంజీవి సినిమానే తమ అంతిమ లక్ష్యంగా పెట్టుకుని తమ సినీ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. తన 45 సంవత్సరాల సినీ కెరియర్లో ఎంతోమంది సీనియర్స్ తో అలాగే కొత్త వాళ్ళతోనూ సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త దర్శకులకి అవకాశాలు ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి లైనప్ లో మరో ముగ్గురు కొత్త దర్శకులు చేరారు. ఈ యంగ్ డైరెక్టర్స్ తో చిరంజీవికి సినిమా పడితే బాక్సాఫీస్ బద్దలే అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇంతకీ ఎవరా ముగ్గురు? వాళ్ళతో చిరంజీవి సినిమాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
విశ్వంభర ఎంత వరకూ వచ్చింది?
ప్రస్తుతం యంగ్ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం కారణంగా సమ్మర్ కి వాయిదా పడింది. ఆ మధ్య రిలీజ్ అయిన విశ్వంభర టీజర్ అభిమానుల్ని ఆకట్టుకున్నా, గ్రాఫిక్స్ పరంగా చాలా నాశిరకంగా ఉందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా వేసవికి వాయిదా పడింది కాబట్టి ఈ గ్యాప్ లో గ్రాఫిక్స్ పరంగా దర్శకుడు వశిష్ట మరింత కేర్ తీసుకునే అవకాశం ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో సోషియో ఫ్యాంటసి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాలపై ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి కారణం చిరంజీవి ముగ్గురు కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఆ ముగ్గురు యంగ్ డైరెక్టర్ ఎవరు? వాళ్లు చిరంజీవితో ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు?
రా అండ్ రస్తిక్..మెగాస్టార్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన ప్రతీ దర్శకుడు తనదైన ప్రతిభతో కొత్త కొత్త కథనాలతో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన మరో సక్సెస్ఫుల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాచురల్ స్టార్ నానితో దసరా సినిమాని తన మొదటి సినిమాగా తనకెక్కించిన శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. శ్రీకాంత్ ఆ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులనే కాదు విమర్శకులను కూడా మెప్పించింది. విశ్వంభర చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఓదెలతో ఒక మాస్ యాక్షన్ ఫ్యాక్షన్ సినిమాని చేయబోతున్నట్టుగా ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రంలో రెగ్యులర్గా చిరంజీవి సినిమాల్లో ఉండే పాటలు లేకుండా చాలా కొత్త తరహా కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు ఫిలింనగర్ టాక్. అలాగే ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ ఉండదట. హీరోయిన్ లేకుండా, అలాగే పాటలు లేకుండా చిరంజీవి సినిమా ఎలా ఉంటుందో మనం ఊహించుకోలేము. కానీ ఈ కొత్త తరహా ప్రయత్నాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా చేస్తున్నాడంటే కథలో ఎంత దమ్ము ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా చిరంజీవి ఏజ్ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ ఇప్పటికీ ఆయన హీరోయిన్స్ తో ఆడిపాడుతున్నట్టుగా కథనాలు రాసుకుని సినిమాలు తీస్తుంటే ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. దానికి ఉదాహరణే చిరంజీవి నటించిన భోళాశంకర్. పాత చింతకాయ పచ్చడి లాంటి కథాకథనాలతో, పాటలతో చిరంజీవి చేసిన ఆ సినిమా చిరంజీవి అభిమానులనే కాదు సామాన్య ప్రేక్షకులను కూడా పూర్తిగా నిరుత్సాహపరిచింది. ఆ సినిమా ఫలితం తర్వాత చిరంజీవి ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. అందుకే శ్రీకాంత్ ఓదెలతో ఇలాంటి సినిమా చేయడానికి చిరంజీవి పచ్చ జెండా ఊపారని అనుకోవచ్చు.
చిరంజీవి ఫ్యాన్ బాయ్..నిర్మాతగా
యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్ చేయబోయే ఈ యాక్షన్ మూవీ గురించి మరో ఆసక్తికర వార్త ఏంటంటే ఈ సినిమాకి నేచురల్ స్టార్ నాని నిర్మాత. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా సినీ పరిశ్రమంలో ప్రవేశించిన నాచురల్ స్టార్ నాని మొదట్లో సహాయ దర్శకుడిగా పనిచేసి ఆ తరువాత హీరోగా తనకంటూ ఒక డిఫరెంట్ ఇమేజ్ ని, ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమా చూడడం కోసం వెళ్లి న్యాచురల్ స్టార్ నాని తన సైకిల్ని పోగొట్టుకున్నానని ఆ మధ్య చాలా ఇంటర్వ్యూస్ లో హీరో నాని చెప్పారు. అలాంటి ఓ వీరాభిమాని నిర్మాతగా, ఇంకో వీరాభిమాని శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఈ సినిమాను, తమ అభిమాన హీరోని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో, తమ అభిమాన హీరోని ఏ విధంగా చూపిస్తే ఫ్యాన్స్ మెచ్చుకుంటారు అనే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా శ్రీకాంత్ ఓదెల రెస్టిక్ స్టైల్లో ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే లీడ్స్ అందించారు. ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం మెగా అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
మరో చంటబ్బాయి వస్తాడా?
Megastar Chiranjeevi’s upcoming line-up will get you mentally excited..2025
ఇక మెగాస్టార్ చిరంజీవి లైనప్ లో ఉన్న మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. తన మొదటి సినిమా పటాస్ నుండి ఇప్పటివరకూ అపజయమెరుగని దర్శకుడిగా యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడి గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరియర్ మొదటి నుంచి అగ్ర హీరోలతో పని చేస్తూ వస్తున్న అనిల్ రావిపూడి ఇప్పటికే విక్టరీ వెంకటేష్ తో ఎఫ్2 ఎఫ్3 సినిమాల తర్వాత ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం అనే మరో సినిమాని తెరకెక్కించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఆ మధ్య తీసిన భగవత్ సింగ్ కేసరి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ బాలకృష్ణని ఎవరు చూపించని విధంగా ఆ సినిమాలో అనిల్ ప్రజెంట్ చేసి బాలకృష్ణతో ఇలా కూడా సినిమా చేయొచ్చా అనిపించారు. ఒక బలమైన ఉమెన్ సెంట్రిక్ పాయింట్తో అనిల్ రావిపూడి తెకెక్కించిన భగవత్ సింగ్ కేసరి దర్శకుడిగా ఒక ప్రత్యేక గుర్తింపుని అనిల్ రావిపూడికి తీసుకు వచ్చింది. కామెడీ సినిమాలనే కాకుండా ఇలాంటి కాన్సెప్ట్ బేస్ సినిమాల్ని కూడా తను కమర్షియల్ గా ఎంత బాగా తీయగలను అనే విషయాన్నీ అనిల్, భగవత్ సింగ్ కేసరి సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు చిరంజీవితో సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
హాస్యరసం ప్రధానం..
మెగాస్టార్ చిరంజీవి నవరసాలని అద్భుతంగా పోషించగల నటుడు. అయితే చిరంజీవి కామెడీ టైమింగ్ కి సెపరేటు ఫ్యాన్ బేస్ ఉంది. తనదైన బాడీ లాంగ్వేజ్ తో, డైలాగ్ డెలివరీతో మెగాస్టార్ చేసే కామెడీ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన కెరియర్ ప్రారంభం నుండి కూడా కామెడీ సినిమాలను తనదైన శైలిలో పండించారు మెగాస్టార్. చిరంజీవి సినిమా అంటే పాటలు ఫైట్స్ అనుకునే రోజుల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేశారు. మాస్ కమర్షియల్ సినిమాల్లో కూడా చిరంజీవి చేసిన కామెడీ ఆ సినిమాకే హైలెట్స్ గా నిలిచాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కామెడీ సినిమాలు చేయడంలో తనదైన స్టైల్ని క్రియేట్ చేసుకున్నారు. తన మొదటి సినిమా నుండి యాక్షన్ బేస్డ్ సినిమాలు చేసినా అందులో కామెడీ ఏమాత్రం తక్కువ కాకుండా హీరో ఇమేజ్ తగ్గట్టు కామెడీని రాసుకోవడంలో అనిల్ రావిపూడిది ఒక ప్రత్యేకమైన శైలి. మాస్ మహారాజు రవితేజతో అనిల్ చేసిన రాజా ది గ్రేట్ యాక్షన్ పరంగానే కాకుండా, కామెడీ పరంగాను ఎంతో మందికి ఇష్టమైన సినిమా. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన ఎఫ్2 ఎఫ్3 సినిమాలయితే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అందర్నీ అలరించాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి చేయబోయే సినిమా కూడా కామెడీ ప్రధానంగా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి కామిక్ రైటింగ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద నవ్వుల పంటలే. ఈ కాంబినేషన్ గనక వర్కౌట్ అయితే 90లో మెగాస్టార్ చేసిన మెమొరబుల్ కామెడీని మరోసారి సిల్వర్ స్క్రీన్ పై అభిమానులు వీక్షించవచ్చు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
వైల్డ్వ చిరు ..వరల్డ్ వైడ్..
ఇక మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ లైనప్ లో అందర్నీ షాక్ కి, ఆనందానికి గురిచేసిన కాంబినేషన్ సందీప్ రెడ్డి వంగా – చిరంజీవి కాంబినేషన్. అర్జున్ రెడ్డి సినిమాతో తన మేకింగ్ స్టైల్ తో, తన రైటింగ్ స్కిల్స్ తో ఇటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నే కాకుండా, బాలీవుడ్ ని కూడా షేక్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రియలస్టిక్ ఎప్ప్రొచ్ తో, సినిమాటిక్ బ్రిలియన్స్తో సందీప్ రెడ్డి వంగా అతి తక్కువ సమయంలోనే ఇండియాలోనే ప్రముఖ దర్శకుడిగా మారిపోయాడు. హిందీ అర్జున్ రెడ్డి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాతో సృష్టించిన సెన్సేషన్ అంతా కాదు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ని ఈ సినిమాలో చూపించిన తీరు ఇటు టాలీవుడ్ నే కాదు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా విస్మయానికి గురి చేసింది. యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో మరో సినిమా స్పిరిట్ తీయబోతునట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ గ్యాప్ లోనే మెగాస్టార్ తో సందీప్ రెడ్డి వంగా మరో సినిమా చేయబోతున్నట్టుగా టాక్ నడుస్తుంది. సందీప్ రెడ్డి వంగా రైటింగ్ స్టైల్ కి మేకింగ్ స్టైల్ కి చిరంజీవి స్వాగ్ తోడయితే మెగా అభిమానులకు అంతకంటే కావాల్సిందేముంది. అసలు కాంబినేషన్ అంటే ఇదేరా బాబు అంటున్నారు మెగా ఫ్యాన్స్. నిజంగా ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యి సినిమా గనక ప్రేక్షకుల ముందుకు వస్తే అది ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తన చిన్నతనం నుంచి కూడా చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన సందీప్ రెడ్డి వంగా మెగాస్టార్ చిరంజీవికి తాను పెద్ద ఫ్యాన్ అని ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు. ఒక అభిమాని తన అభిమాన హీరోని ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో ఆ విధంగా చూపిస్తే మెగాస్టార్ నుంచి మెగాస్టార్ ని అభిమానించే వీరాభిమానులకు అంతకంటే కావాల్సిందేముంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువ రీమేక్ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి మిశ్రమ ఫలితాలు పొందిన మెగాస్టార్, ఈ యంగ్ డైరెక్టర్ తో సినిమాలు చేసి ఇప్పుడున్న యంగ్ హీరోలకు, యంగ్ జనరేషన్ కు కూడా తన మెగా సత్తా ఏంటో చూపించాలి అనుకుంటున్నారు.