Game Changer Review In Telugu: ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది రా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు ఇప్పుడే అర్థమైంది అంటాడు అదుర్స్ సినిమాలో బట్టు క్యారెక్టర్ లో నటించిన బ్రహ్మీ (బ్రహ్మనందం) చారి క్యారెక్టర్ నటించిన ఎన్టీఆర్ తో. మీమ్స్ లో ఎంతో పాపులర్ అయిన ఈ డైలాగ్, బ్రహ్మానందం సినీ కెరియర్ లోనే ఒక బెస్ట్ కామెడీ డైలాగ్ గా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ కి ఈ డైలాగ్ మళ్లీ గుర్తుకొచ్చింది. ఎందుకంటే.. డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ, ప్రతీ ప్రెస్ మీట్ లోనూ ఆయన ఏం చెప్పారంటే ‘నాకు తెలుగులో ఒక్కడు, పోకిరి సినిమాలు అంటే చాలా ఇష్టం అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో గేమ్ చేంజర్ సినిమా తీసానని, దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రైట్ తెలుగు సినిమాకి మొదటిసారిగా దర్శకత్వం చేశానని, గేమ్ చేంజర్ ప్రతీ ఈవెంట్ లోనూ ఆయన చెప్పారు. ఇంతకీ శంకర్ అనుకున్నట్టుగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మరో ఒక్కడు, పోకిరి అయ్యిందా? శంకర్ మీద రామ్ చరణ్ పెట్టుకున్న నమ్మకం నిజమైందా? గేమ్ చేంజర్..గేమ్ సిల్వర్ స్క్రీన్ పై గెలిచిందా?
సినిమా అంటే వినోదమే కాదు..
ఓన్లీ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఓవరాల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే డైరెక్టర్ శంకర్ ఒక లెజెండ్. సినిమా అంటే వినోదమే కాదు, దానికి సామాజిక స్పృహ కూడా ఉండాలి అని నమ్మిన అతికొద్దిమంది దర్శకుల్లో ఉన్నతమైన భావాలు కలిగిన శంకర్ కూడా ఒకరు. సినిమా కేవలం ఒక వినోదం గానే కాకుండా, జనాల్ని చైతన్యపరచాలని ఎంతో మంది మహానుభావులు ఎన్నో అద్భుతమైన ఆలోచింపజేసే సినిమాలను మనకు ముందు నుంచి అందిస్తున్నారు. ఒక విశ్వనాథ్, ఒక టి.కృష్ణ, ముత్యాల సుబ్బయ్య అలాగే తమిళంలో ఒక కె. బాలచందర్, మణిరత్నం లాంటివారు ఎన్నో అద్భుతమైన సినీ కళాఖండాలను మనముందు ఉంచారు. వీళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్ లో ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఒకే ఒక్క దర్శకుడు శంకర్.
శంకర్ అంటే..ఒక బ్రాండ్
Game Changer Review In Telugu – 2025
డైరెక్టర్ శంకర్.. ఈ పేరు 90 ల్లో తమిళ సినిమా ఇండస్ట్రీ లోనే కాదు, తెలుగులో కూడా ఒక బ్రాండ్. శంకర్ సినిమా వస్తుందంటే అటు తమిళంలోనే కాదు, ఇటు తెలుగులోనూ కూడా అగ్ర దర్శకుల సినిమాలు, అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా? అని ప్రొడ్యూసర్స్ ఆలోచించేవారు. జెంటిల్మెన్ సినిమాతో మొదలైన డైరెక్టర్ శంకర్ దర్శక ప్రస్థానం సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ఒక విజయవంతమైన అధ్యాయం. సోషల్ మెసేజ్ ని కథలో ఇమిడ్చి, ఒక ఎంటర్టైనింగ్ కమర్షియల్ సినిమాని ఎలా తీయాలో ఇండియన్ సినిమాకి పాటలు నేర్పిన దర్శకుడు ఎవరంటే శంకర్ అనే చెప్పాలి. 1993లో శంకర్ తొలిసారిగా దర్శకత్వం వహించిన జెంటిల్మెన్ సినిమా విడుదలై సౌత్ ఇండియాలో ఒక సంచలన విజయం నమోదు చేసింది. ఆ తర్వాత తన రెండో సినిమాగా ప్రేమికుడు సినిమాని డాన్సింగ్ స్టార్ ప్రభుదేవాతో తెరకెక్కించి అందులో కూడా ఒక సోషల్ మెసేజ్ ని జనాలకి అందించారు. శంకర్ అంటే భారీతనం, ఎంటర్టైన్మెంట్ శంకర్ అంటే ఒక సోషల్ మెసేజ్ ఈ మూడు అంశాల్ని ఒక సినిమాలో ఇమడ్చడం అనేది ఏ దర్శకుడికి ఇప్పటివరకు సాధ్యం కాలేదు. అందుకే శంకర్ అంటే సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియాలోనే ఒక క్రేజీ క్రియేటివ్ డైరెక్టర్.
దటీజ్ చరణ్..
ఒక సీనియర్ క్రియేటివ్ డైరెక్టర్ దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఒక తెలుగు సినిమాని డైరెక్ట్ గా డైరెక్ట్ చేస్తున్నాడంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. తెలుగు హీరోస్ తో ఎన్నోసార్లు సినిమాలు చేయాలనుకున్న శంకర్ చివరికి ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తో సినిమా అనగానే ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు ఇండస్ట్రీలోనూ అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు దర్శకుడు శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు కి ఫోన్ చేసి రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పినట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో తెలియజేశారు. ఒక పెద్ద దర్శకుడు పైగా క్రియేటివ్ డైరెక్టర్ టెక్నాలజీకి ఒక కొత్త నిర్వచనం చెప్పిన డైరెక్టర్ తనతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు అనగానే హీరో రామ్ చరణ్ హ్యాపీగా ఈ సినిమాకి పచ్చ జెండా ఊపారు. అయితే దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా శంకర్ లీగల్ ఇష్యూస్ వల్ల బాగా లేట్ అయ్యింది. తను ముందుగా కమిట్ అయిన సినిమా ఇండియన్ 2 ని గేమ్ చేంజర్ కంటే ముందుగానే శంకర్ పూర్తి చేయవలసి వచ్చింది. ఇక ఆ మధ్య విడుదలైన భారతీయుడు 2 సినిమా ఎంతటి అపజయాన్ని చవిచూసిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత శంకర్ క్రియేటివిటీపై అందరికీ అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. అయినా కానీ ఎక్కడో చిన్న ఆశ. ఒకటి రెండు ఫ్లాప్ సినిమాలతో ఒక డైరెక్టర్ టాలెంట్ ని అంచనా వేయలేం అని హీరో చరణ్, మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై అంచనాల్ని పెట్టుకున్నారు.
ట్రైలర్ తో పెరిగిన అంచనాలు
మొదటినుంచి కూడా పెద్దగా అంచనాలు లేకుండా నిర్మాణంలో ఉన్న గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ తో ఒక కొత్త నమ్మకాన్ని ఫాన్స్ లోనూ ప్రేక్షకుల్లోనూ కలిగించింది. ఆ తర్వాత విడుదలైన ట్రైలర్ కూడా డైరెక్టర్ శంకర్ కి కం బ్యాక్ సినిమా అనే ఒక ముద్ర వేసుకుంది. ఇప్పుడున్న ఎంతోమంది దర్శకులకు ఇన్స్పిరేషన్ అయినా డైరెక్టర్ శంకర్ టాలెంట్ ఒక్క సినిమాతో లేదా రెండు సినిమాలతో ఎలా చెప్పగలం? ఇది గ్యారెంటీగా శంకర్ మార్కు తో బాక్స్ ఆఫీస్ వద్ద రామ్ చరణ్ కు మరో ఘనవిజయం అందిస్తుందని అభిమానులు అందరూ నమ్మకంగా ఉన్న వేళ ఏం చేజర్ సినిమా విడుదలయింది.
అంచనాలు నిలబెట్టిందా?
నిలబెట్టిందా అంటే లేదనే చెప్పాలి. ముందుగా చెప్పినట్టు అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ చెప్పినట్టు ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది రా నాకే చాలా సేపు సస్పెన్సు తర్వాత అర్థమయింది.. అంటాడు బ్రహ్మానందం, నటి రమాప్రభ ను ఉద్దేశించి. ఈ సినిమా చూస్తుంటే పదేపదే ఆ డైలాగు గుర్తుకొస్తుంది. ఒక్కడు, పోకిరి లాంటి సినిమాలను తీయాలి అనుకున్న క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఆ సినిమాలు విడుదలైన 2003, అలాగే 2006 సంవత్సరంలోనే తన క్రియేటివిటీని వదిలేశాడు. ఒక్కడు, పోకిరి లాంటి సినిమాలు తీయాలనుకోవడం తప్పుకాదు అయితే శంకర్ ఆలోచనలు శంకర్ క్రియేటివిటీ…ఒక్కడు, పోకిరి సినిమాలు ఎప్పుడు వచ్చాయో అప్పుడే ఆగిపోయింది. ఈ జనరేషన్ కి అందుకునేటట్టుగా గేమ్ చేంజెస్ సినిమాని ఆయన మలచలేకపోయారు. ఆయన టెంప్లేట్లో సాగే కథనిఈ సినిమాకి ఎంచుకుని ఈ జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాని మార్చడంలో దాదాపు విఫలమయ్యాడనే చెప్పొచ్చు. పాత సీసాలో.. కొత్త సారా ఇది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తరచూ వినిపించే మాట. కథ పాతదైన కథనం కొత్తగా ఉండాలని ఆ మాటకి అర్థం. ఈ అర్ధాన్ని ఏమాత్రం పట్టించుకొని శంకర్ ఈ సినిమాని 10 క్రితం రావలసిన ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా జనాల ముందుకు తీసుకొచ్చారు.
హిట్టా..ఫట్టా …
ఒక పెద్ద దర్శకుడు, పైగా క్రియేటివ్ దర్శకుడు తనతో సినిమా చేస్తున్నాడు అనగానే హీరో రామ్ చరణ్ ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పారు. ఈ తన నట ప్రతిభ సినిమాలో చూపించారు. రామ్ చరణ్ స్క్రీన్ ప్రేజేన్స్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్, హీరోయిన్ అంజలి పాత్ర తప్పించి మిగతావన్నీ ఇంతకుముందు చూసిన ఎన్నో సినిమాలను గుర్తుకు తెచ్చాయి. ముందు నుంచి హైలెట్ అవుతుందనుకున్నా డైరెక్టర్ సూర్య క్యారెక్టర్ మన తెలుగు ప్రేక్షకులకు, అలాగే సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు ఒక రెగ్యులర్ క్యారెక్టర్గానే కనిపించింది. అన్ ప్రేడెక్టబుల్ అంటూ ట్రైలర్ లోనూ, టీజర్ లోనూ, ఊరించిన యూనిట్ విఫలం అయ్యింది. మనం ఊహించిన విధంగానే సాగింది సినిమా. మొదటి నుంచి చివరి వరకు ఒకే టెంప్లేట్లో ఉన్న ఈ సినిమా ఫ్లాష్ ప్యాక్ ఎపిసోడ్ కూడా అంత బలంగా హత్తుకోలేదు. రామ్ చరణ్ తన అద్భుతమైన స్క్రీన్ పెర్ఫార్మెన్స్ తో చాలా వీక్ గా ఉన్న కథకి ఆక్సిజన్ అందించాడని చెప్పొచ్చు. రామ్ చరణ్.. ఒకే ఒక రామ్ చరణ్ తప్పితే ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. టెక్నికల్ గా ఉన్నత స్థాయిలో ఈ సినిమా ఫైనల్ గా ఎలాంటి విజయం సాదిస్తుందో ఒక్క వారం ఆగాలి.
మిగతా..
ఇక ఈ సం 2025 సంక్రాంతి సినిమాల్లో బాలయ్య నటించిన డాకు మహారాజ్ , వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం; సినిమాలు వరసలో ఉన్నాయి. ఎప్పడూ ఎక్కువ తెలుగు సినిమాలు, తమిల్ సినిమాలు విడుదల అయ్యే ఈ ఇయర్ సంక్రాంతి దాదాపు ఫ్రీ గా ఉంది. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమాకి ప్రేక్షకులు పట్టం కట్టి సంక్రాంతి విజేతగా నిలబెడతారో తెలియాలి అంటే ఈ సంక్రాంతి పండగ చివరి వరకూ చూడాలి. ఇక్కడ ఒక తమాషా విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఏమిటంటే..2019 సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ, బాలకృష్ణ కథానాయకుడు, ఎఫ్ 1 విదుదల అయ్యాయి. కానీ యాక్షణ్ లో ఓవర్ అయిపోయిన వినయ విధేయ రామ, నిజాలు దాచి అబద్దపు వాస్తవాలు చూపించిన కథానాయకుడు దారుణంగా బోల్తా కొట్టి సినిమా అభిమానులకు తలనొప్పి తెప్పించాయి. ఈ ఇయర్ కూడా అదే రిపీట్ అవుతుంది అనే అనుమానాలు గేమ్ చేంజర్ ఫలితం తో అర్ధం అయ్యింది. ఇక చూడాలి ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో…