ఏడుకొండలవాడా క్షమించు.. పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష | Pawan kalyan Deeksha for Tirumala Laddu |

ఏడుకొండలవాడా క్షమించు.. పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష | Pawan kalyan Deeksha for Tirumala Laddu | సినిమాలకి సంబంధించి పవన్ కళ్యాణ్ ను ట్రెండ్ సెట్టర్ అని చెప్తూ ఉంటారు. తన కెరీర్ స్టార్టింగ్ నుండి ఎవరినీ ఇమిటేట్ చేయకుండా కొత్త తరహా స్టైలిష్ పెర్ఫార్మన్స్ తో ఎంతోమంది యూత్ కి ఫేవరెట్ హీరో అయిపోయారు పవన్ కళ్యాణ్. తొలిప్రేమ సినిమా నుండి పవన్ తన సినిమాల్లో చూపించిన కొత్తదనానికి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. అప్పట్లోనే బద్రి, ఖుషి సినిమాల్లో ఇంగ్లిష్, హిందీ పాటలు పెట్టించి విజయం సాధించి కొత్త ట్రెండ్ కు నాంది పలికారు పవన్. ఏక్షన్ సన్నివేశాల చిత్రీకరణ లోనూ పవన్ చూపించన కొత్తదనం వల్ల ప్రారంభం లోనే ఆయనకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ వచ్చేలా చేసింది. పేరున్న దర్శకుల వెనక పడకుండా కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ, పవన్ చేసిన ప్రయోగాలు ఆయా సినిమాలకు ఘన విజయాన్ని అందించాయి. అందుకే గబ్బర్ సింగ్ సినిమాలో డైరెక్టర్ హరీష్ శంకర్ ‘నేను ట్రెండ్ ని ఫాలో అవ్వను సెట్ చేస్తా’ అనే డైలాగ్ ను పవన్ కోసం రాసారు. అప్పుడు సినిమాల్లోనే కాదు ఇప్పడు రాజకీయాల్లోనూ ట్రెండ్ ఫాలో అవ్వకుండా తానే ఓ కొత్త ఒరవడికి ప్రతీ అంశంలోనూ శ్రీకారం చుడుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 

సినిమాల్లోనే కాదు..రాజకీయంగా కొత్త ఒరవడి 

అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే తనని కలవడానికి వచ్చేవాళ్ళు ఎవ్వరూ పూల బొకేలు, శాలువలు తెచ్చి డబ్బుని వృధా చేయొద్దని, వాటి బదులు కూరగాయలు బుట్ట లాంటిది తీసుకొస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు అందరూ ఈ ఆలోచన ఎదో బాగుందే, ఇప్పటి వరకూ ఇలాంటి ఆలోచన ఎవరికీ రాలేదు అంటూ ఆచరించడం ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులంటే నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండాలని, వారికి ఏ సమస్య ఉన్నా ఓపిగ్గా విని, దాని పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని చేసి చూపించారు. అలాగే నిత్యం పార్టీ ఆఫీస్ లో ఎవరో ఒకరు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రతినెలా షెడ్యుల్ విడుదల చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులను ఎప్పటికప్పుడు నిత్యం సిద్ధం చేస్తున్నారు. అలాగే ఒకేసారి 1300లకు పైగా గ్రామ పంచాయితీల్లో గ్రామ సభలు నిర్వహించి, గ్రామల్లో మౌలిక వసతులపై ఓ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయని విధంగా జనాలకు ఉపయోగపడే కార్యాచరణతో ముందుకుపోతున్న పవన్ కళ్యాణ్ ని చూసి అధికార కూటమి నేతలు ప్రశంసిస్తుంటే, ఇలా అయితే ఇక మనకు కష్టమే అనుకుంటూ అధికారం పోగొట్టుకున్న వైసిపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

వైసిపీ పాపలపుట్ట

అధికారంలో ఉండగా వైసిపీ చేసిన పాపలపుట్టలు రోజుకొకటి చొప్పున బద్ధలవుతూ ప్రజలంతా అవాక్కవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి నెల గడవకుండానే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, రాష్టపతి పాలన కావాలన్నట్టు ఢిల్లీ వెళ్లి జగన్ ఆడిన జగన్నాటకాలు ఆయన అధికార దాహానికి అద్దం పట్టాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వరదలకి సంబంధించి జగన్ మోహన్ రెడ్డి చేసిన బురద రాజకీయంతో మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ నవ్వులపాలవుతున్నారు. అయినా గానీ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా వైసిపీ రాజకీయాలు రోజు రోజుకీ  దిగజారుతున్నాయి. అందుకే ఆ పార్టీని వదిలిపోతున్న నాయకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక పవిత్ర  తిరుమల లడ్డూ నాణ్యత వివాదంలో వైసిపీ పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. దేశవ్యాప్తంగా పెను దుమారం లేపిన ఈ వ్యవహారంపై సిట్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.

ఏడుకొండలవాడా క్షమించు.. పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష | Pawan kalyan Deeksha for Tirumala Laddu |

కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా ఆవేదనకులోనై 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. లడ్డూ తయారీలో కల్తీని ఎవరూ కలలో కుడా ఊహించలేము. ఈ ఘటనపై ప్రతి ఒక్కరిలో వేదన ఉంది. దైవానికి ఎవరి వల్ల అపచారం జరిగినా..అపచారం చేసిన వారికి ఆ పశ్చాత్తాప భావన లేకపోయినా, ప్రజల క్షేమం కోసం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు రకరకాల పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి మతసామరస్య వాతావరణాన్ని గడిచిన 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ చూడలేదు. చెడు ఎవరు చేసినా అంతిమంగా ప్రజలకు మంచి జరగాలనే పవన్ కళ్యాణ్ ఆలోచనలకు రాష్ట్ర ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఇలాంటి నూతన ఒరవడి రాజకీయాలకు నాంది పలికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ తనదైన మార్క్ వేస్తున్నారు. ఇలాంటి రాజకీయం ప్రజల్లో భరోసా నింపుతుంది. రేపు బాగుంటుంది అనే నమ్మకం కలుగుతుంది. దాదాపు దశాబ్ద కాలంగా నలిగిపోతున్న విభజిత ఆంధ్రప్రదేశ్ కి అంతకంటే కావాల్సింది ఏముంది? అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Pawan Kalyan's own mark in the reign..Does it look like good days have come again for AP? పాలనలో పవన్ కళ్యాణ్ తనదైన మార్క్..ఎపి కి మళ్లి మంచి రోజులు వచ్చినట్టేనా?
Pawan Kalyan’s own mark in the reign..Does it look like good days have come again for AP? పాలనలో పవన్ కళ్యాణ్ తనదైన మార్క్..ఎపి కి మళ్లి మంచి రోజులు వచ్చినట్టేనా?

Y.S Jagan Press Meet on Tirumala Tour : మాట తప్పి, మడం తిప్పిన పులివెందుల పులి : 30 సంవత్సరాల పాటు తానే ముఖ్యమంత్రి గా ఉంటానని కలలు కన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ ప్రకటన చేసిన మూడు నెలలకే అధికారం కోల్పోతాడని కలలో కూడా ఊహించివుండరు. అందుకే ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఆయన ఈ మధ్య ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్ధం కావడం లేదు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఎప్పడూ మీడియా ముందుకు రాకుండా, తన అనుకూల మీడియాలతో ప్రచారం చేయించుకున్న జగన్ ఈమధ్య తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా ముందుకు రావాల్సి వస్తుంది. వచ్చిన ప్రతిసారీ తన స్టైల్ కామెడీ చేస్తూ, ట్రోలింగ్ కి మంచి కంటెంట్ అందించి వెళ్ళిపోతున్నారు. మొన్నామధ్య తిరుమల లడ్డూ కల్తీ విషయంపై ప్రెస్ మీట్ పెట్టిన ఆయన మరోసారి యధావిధిగానే ఈ రోజు పేపర్స్ పట్టుకుని మీడియా ముందుకు వచ్చి తిరుమల దర్శనం విషయంపై ,మాట్లాడారు. ఈ శనివారం తిరుమల మెట్ల మార్గంలో వెళ్లి స్వామివారిని దర్శించుకుంటానని, రెండు రోజుల క్రితం జగన్ ప్రకటించారు. దీనికి కూటమి ప్రభుత్వ నాయకులు మీరు ఎలా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదని, కాకపోతే డిక్లరేషన్ మీద సంతకం చేయండని ప్రెస్ మీట్స్ పెట్టి మరీ సూచిందారు. బిజెపి (Bjp)తరపున ఎంపీ పురందేశ్వరి కూడా ఇదే మాట మీడియాతో చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిక్లరేషన్ విషయం TTD చూసుకుంటుందని, దాని గురించి కూటమి నేతలు ఎవ్వరూ మాట్లాడొద్దని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 28 శనివారం జగన్ ఏం చేయబోతున్నారు? అసలు తిరుమల వెళ్తారా? వెళ్తే డిక్లరేషన్ పై సంతకం చేస్తారా? వెంకటేశ్వర స్వామి పై తనకి గౌరవం, భక్తి ఉన్నాయని నిరూపించుకుంటారా? ఇలా అనేక సందేహాలు మీడియాలోనూ, ప్రజల్లోనూ నెలకొన్న సమయంలో ఈరోజు జగన్ ఈ విషయంపై ఊహించని నిర్ణయం తీసుకున్నారు.

Y.S Jagan Press Meet on Tirumala Tour : మాట తప్పి, మడం తిప్పిన పులివెందుల పులి

తాను తిరుమల దర్శనానికి వెళ్ళడం లేదని..దర్శనం ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నట్టు ఈరోజు మరోసారి ప్రెస్ మీట్ పెట్టి తెలియజేసారు జగన్. నేను తిరుమల వెళ్తే నన్ను కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని, నన్ను అరెస్ట్ చేసే ప్లాన్స్ కూడా వేస్తున్నారని, ఆక్కడ గొడవ చేసి శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి ప్లాన్ చేస్తున్నారని అన్నారు. ఈ విషయమై మా పార్టీ నాయకులకు నోటీసులు కూడా ఇచ్చారంటూ చెప్తూ అందుకే తన తిరుమల పర్యటన రద్దు చేసుకుంటున్నట్టు మీడియా తో చెప్పారు. పనిలో పనిగా లడ్డూ కల్తి వ్యవహారంలో ఇంతకుముందు చెప్పిన మాటలనే మరలా మరోసారి రిపీట్ చేసారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నా కులమూ మతమూ ఏంటో ప్రజలందరికీ తెలుసు. ‘నా మతం మానవత్వం..నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను..బయటకు వెళ్తే అన్ని మతాలను గౌరవిస్తాను’ అని చెప్పారు. మరి ఇతర మతాలను గౌరవిస్తానని సెలవిచ్చినప్పుడు..ఇప్పటివరకూ దాదాపు పదిసార్లకు పైగా తిరుమలకి వెళ్ళిన జగన్ డిక్లరేషన్ పై సంతకం ఎందుకు చేయనట్టు? దాదాపు 80 శాతానికి పైగా హిందువులు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ మతానికి, మనోభావాలకు గౌరవం ఇచ్చి సంతకం చేస్తే సరిపోతుందిగా. 2012 లో కడప ఎంపీ గా గెలిచినప్పుడు, 2014 లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పడు, 2017 లో ఒకసారి, 2019లో సిఏం అయినాక, ఆ తర్వాత 2020 లోనూ జగన్ తిరుమల వెళ్లారు గానీ డిక్లరేషన్ పై సంతకం చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు అసలు సంతకం అవసరమే లేదు అన్నట్టు వైసిపీ నాయకులు స్టేట్ మెంట్స్ ఇచ్చారు. మరి ఇప్పడు జగన్ మోహన్ రెడ్డి ఈ సాకులు చెప్పడమేంటి? మన దేశంలో ఏ మతానికి సంబంధించిన క్షేత్రమైన కొన్ని నిబంధనలు ఉంటాయి. మరి అన్ని మతాలనూ గౌరవించినప్పుడు ఆ నిబంధనలు పాటిస్తే తప్పేంటి? వెళ్తే ఒక బాధ..వెళ్ళకపోతే ఒక బాధ అన్నట్టు తయారయ్యింది మాజీ సిఎం జగన్ (Y.S Jagan) పరిస్థితి. ఎందుకూ మరో వివాదం అనుకున్నారో ఏమో..అందుకే ఎప్పట్లాగే ఈ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు మీదికి, కూటమి ప్రభుత్వం మీదకి తోసేసారు జగన్ మోహన్ రెడ్డి.

ముందు నుండీ ఇదే తంతు..

ఇప్పుడే కాదు ముందునుండి ఇదే వైఖరితో ఉన్నారు జగన్. 2019 లో ముఖ్యమంత్రిగా అవ్వకముందు నుంచీ కూడా రాష్ట్రంలో ఏ చెడు జరిగినా అది చంద్రబాబు నాయుడు చేయించారని, ఏదైనా మంచి జరిగితే మాత్రం అది తనవల్లె అయ్యిందని అడ్డంగా అబద్ధాలు చెప్పడం ముందునుండి జగన్ మోహన్ రెడ్డి కి బాగా అలవాటు. 2019 ముందు ఆయన మాటల్ని, ఆయన చేసిన రియాలిటీ షోలని నిజమని నమ్మిన ప్రజలు ఆయనకి అధికారాన్ని కట్టబెట్టారు. ముఖ్యమంత్రి అయినాక ఒక ముఖ్యమంత్రి ఎలా పరిపాలన చేయకూడదో ఆ విధంగా చేసారు గడిచిన 5 సంవత్సరాలలో. ఒక నియంత లాగ వ్యవస్థలన్నిటిని తన అధీనం లోకి తీసుకుని, కింద స్థాయి ఏంఎల్ఏ లకు పని లేకుండా చేసి, అవినీతికి గేట్లు తెరిచారు. అప్పటి వరకూ పార్టీ ని భుజాన వేసుకున్న సామాన్య కార్యకర్తలను అస్సలు పట్టించుకోలేదు. సంక్షేమం పేరు చెప్పి భారీగా అప్పులు తీసుకొచ్చి జనాలకు పంచారు. పైగా అదేదో తన సొంత సొమ్ము పంచినట్టుగా ప్రచారం చేయించుకున్నారు. ఒక్కొక్క ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చాను అని గొప్పగా చెప్పుకున్న జగన్ ఒక్కో ఇంటిమీద ఎంత అప్పు పెట్టాడో మాత్రం చెప్పలేదు. ఇలాంటి తాయిలాలకు అలవాటు పడిన చాలామంది జగన్ మోహన్ రెడ్డి ని సపోర్ట్ చేసినా, వాస్తవం అర్ధం చేసుకున్న ప్రజలు మాత్రం ఎలాంటి విపత్కర పరిస్థితిని చక్కదిద్దాలంటే మళ్ళీ చంద్రబాబే రావాలని కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని అందించారు. మరో 30 ఏళ్ళు నేనే అనుకున్న జగన్ ని 11 సీట్లతో పాతాళం లోకి తొక్కెసారు. జనాగ్రహం చూసిన ఏ నాయకుడుకి కూడా భ్యవిషత్తు ఉండదని ప్రజాబలం మరోసారి నిరూపించింది. ఈ కథనం పై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

 

RK Roja Poll On Tirumala Laddu Issue : అందరిలోనూ పరువు పోయిందిగా
RK Roja Poll On Tirumala Laddu Issue : అందరిలోనూ పరువు పోయిందిగా

 

Leave a Comment