బాలయ్య – బోయపాటి సినిమాలో విలన్ గా చేస్తున్న హీరో ఎవరో తెలుసా ?

బాలయ్య – బోయపాటి సినిమాలో విలన్ గా చేస్తున్న హీరో ఎవరో తెలుసా ? తన కెరీర్ ప్రారంభం నుండి అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. తన మొదటి చిత్రం భద్ర హీరో అల్లు అర్జున్ తో చేయాలనీ, అల్లు అర్జున్ కి కథ చెప్పారు బోయపాటి. అప్పటికే ఆర్య సినిమాతో యూత్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, భద్ర కథ తన ఇమేజ్ కి ఎక్కువ అయిపోతుందని భావించి, కథ బాగుందని  నిర్మాత దిల్ రాజుకి దగ్గరికి పంపించారు. దిల్ రాజుకి ఆ కథ బాగా నచ్చడంతో అప్పటికే రవితేజ డేట్స్ దిల్ రాజు దగ్గర ఉండడంతో భద్ర సినిమా రవితేజ హీరోగా పట్టాలెక్కింది. ఏక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన భద్ర ఘనవిజయం సాధించి బోయపాటి శ్రీను మేకింగ్ స్టైల్ ఆడియన్స్ కి పరిచయం చేసింది. ఇక ఆ విజయం తర్వాత విక్టరీ వెంకటేష్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసారు బోయపాటి. ఫ్యామిలీ సినిమాలు, ఏక్షన్ సినిమాలు తనదైన శైలి లో చేసి మెప్పించే వెంకటేష్ ను తులసి గా ప్రేక్షకులముందుకి తీసుకొచ్చారు. వెంకటేష్, నయనతార జంటగా నటించిన తులసి ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ తో ద్వితీయ విఘ్నాన్ని విజయవంతంగా దాటేసారు బోయపాటి శ్రీను. ఇక హట్రిక్ కొట్టడానికి రెడీ అయిన ఆయన తన అభిమాన హీరో బాలయ్యబాబుతో సినిమా చేసే ఛాన్స్ సంపాదించారు. సింహా గా బాలయ్యను బోయపాటి చూపించిన తీరు అందరికి భలే నచ్చేసింది. అప్పటివరకూ చాలా ఫాస్ట్ గా డైలాగ్స్ చెప్పే బాలయ్యను, చాలా సెటిల్డ్ గా చెప్పించి మరో కొత్త బాలయ్యను ఆడియన్స్ కి పరిచయం చేసారు. ఏక్షన్ సీన్స్ ను తనదైన శైలిలో చిత్రీకరించే బోయపాటి ఇది బోయపాటి సినిమా అనే ముద్రను బలంగా వేసారు. సింహా సినిమాలోని పోరాట దృశ్యాలు అందర్నీ ఎంతో అలరించాయి. ఇక తర్వాత మరో నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దమ్ము అనుకున్నంత సక్సెస్ కాకపోయినా ఎన్టీఆర్ నట విశ్వరూపం ఆ సినిమాలో కనపడింది. ఆ తర్వాత మరోసారి బాలయ్య సినిమా ఛాన్స్ అందుకున్నారు బోయపాటి. లెజెండ్ టైటిల్ ప్రకటించినప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. ఈసారి నటసింహ బాలకృష్ణని  ఎలా చూపిస్తారో అని ఎదురుచూసిన అభిమానులను మరోసారి తన మేకింగ్ స్కిల్స్ తో అబ్బురపరిచారు బోయపాటి. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని సరైనోడు మాస్ హిట్ గా బన్నీ కెరీర్ లో అప్పటివరకూ అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా అలరించింది. తర్వాత జయ జానకి నాయక, రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలతో కొంచెం సక్సెస్ స్పీడ్ తగ్గించిన బోయపాటి శ్రీను మరోసారి తన లక్కి హీరో బాలయ్య బాబుని అఖండ గా అధ్బుతంగా చూపించారు. ఒకే హీరోతో మూడు సినిమాలు చేసి ఒకదాన్ని మించి మరొకటి హిట్ కొట్టి బోయపాటి అరుదైన రికార్డు సాధించారు. ఆ తర్వాత యంగ్ హీరో రామ్ తో స్కంద చేసినా అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు నాలుగోసారి బాలయ్య బాబుతో సినిమా అనౌన్స్ చేసారు బోయపాటి.

బోయపాటి విలన్స్..రూటే సెపరేటు 

బాలయ్య – బోయపాటి సినిమాలో విలన్ గా చేస్తున్న హీరో ఎవరో తెలుసా ? డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాల్లో కథానాయకుడికి పాత్రకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో, ప్రతి నాయకుడి పాత్రకు అంతే ప్రాధాన్యత ఉంటుంది.సినిమాలో విలన్ కారెక్టర్ బలంగా ఉంటే  హీరోయిజం బాగా పండుతుందనే సినిమా సక్సెస్ సూత్రాన్ని బోయపాటి తన మొదటి సినిమా నుండి ఫాలో అవుతూ, మాస్, యంగ్ హీరోలతో విజయవంతమైన సినిమాలని అందించారు. ఎంతమంది హీరోలతో సినిమాలు చేసినా బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఉండే లెక్క వేరు. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అయితే చాలు. అది గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అవుతుందని ముందే ఫిక్స్ అయిపోతారు ఫ్యాన్స్. అంతగా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మ్యాజిక్ చేసాయి. సింహా, లెజెండ్, అఖండ లాంటి హాట్రిక్ హిట్స్ తర్వాత మరోసారి బాలకృష్ణ – బోయపాటి శ్రీను మరో చిత్రానికి రెడీ అయ్యారు. ఇప్పటి వరకూ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్ కావడంతో ఈసారి డైరెక్టర్ బోయపాటిపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలని అందుకోవడానికి ఈ సినిమాపై బోయపాటి మరింత కేర్ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ సినిమాలో విలన్ కారెక్టర్ కోసం ఒక హీరోని తీసుకోబోతున్నారు. లెజెండ్ సినిమా నుండి విలన్ కారెక్టర్ ని స్పెషల్ గా డిజైన్ చేస్తూ వస్తున్న బోయపాటి, బాలయ్యతో తొడకొట్టే విలన్ లాంటి హీరో కోసం గాలం వేస్తున్నారట. మొత్తానికి ఆయన అన్వేషణ ఫలించి విలన్ దొర్కినట్టు సమాచారం.

ఈసారి గోపీచంద్ వంతు..

లెజెండ్ సినిమాలో అప్పటివరకూ హీరోగా చేసిన జగపతిబాబు ని విలన్ గా చూపించి, ప్రేక్షకులకి, సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు బోయపాటి. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ హీరో శ్రీకాంత్  ని అఖండ సినిమాలో కరుడుగట్టిన విలన్ గా ఆయన చూపించిన తీరుకి ఫిదా అయిపోయారు ఆడియన్స్. అఖండ ఘనవిజయం తర్వాత ఇప్పడు అంచనాలు పీక్స్ కి చేరాయి. అందుకే ఈసారి బలయ్యకి పోటిగా హీరో గోపీచంద్ ని విలన్ గా చూపించాబోతున్నారట. గోపీచంద్ కి విలన్ పాత్ర చేయడం కొత్త కాకపోయినా, విలన్ గా కనిపించి చాలా కాలమే అయ్యింది. ఎప్పుడో వర్షం, నిజం సినిమాల్లో గోపీచంద్ విలన్ గా తన పవర్ చూపించాడు. చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి, ఈమధ్య హీరోగా గోపీచంద్ కి కాలం కలిసిరావటం లేదు కాబట్టి ఈ సినిమాలో  ఆయన దాదాపు ఖాయం అయినట్టే. విలన్ లందు బోయపాటి విలన్లు వేరయా అన్నట్టు మరి ఈ సినిమాలో గోపీచంద్ ని ఎలా చూపిస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

Power Star Pawan Kalyan OG Movie Release When?
Power Star Pawan Kalyan OG Movie Release When?

బోయపాటికి బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్..

చిరంజీవి – బాలకృష్ణ సినిమాలు ఏ విధంగా బాక్సాఫీస్ వద్ద తలపడేవో 80s, 90s కిడ్స్ కి బాగా తెలుసు. ఇప్పుడంటే సినిమా థియేటర్ రన్ లైఫ్ రెండు వారాలకు పడిపోయింది గానీ, అప్పట్లో సినిమాలు రోజు 4 ఆటలతో 100 రోజులు నడిచేవి. చిరంజీవి సినిమా ఏదైనా 100 రోజులు ఆడితే తర్వాత వచ్చిన బాలయ్యబాబు సినిమా ఆ రికార్డు బ్రేక్ చేయడానికి కనీసం ఒక్క రోజైన ఎక్కువ ఆఆడాల్సిందే. ఆ తర్వాత వచ్చిన చిరంజీవి సినిమా మళ్ళి, బాలయ్య సినిమా రికార్డు ని  బ్రేక్ చేస్తేగాని అభిమానులు శాంతించేవారు కాదు. ఇక ఇద్దరి సినిమాలు ఒకే సీజన్లో రిలీజ్ ఐతే అభిమానుల హంగామా మామూలుగా ఉండేది కాదు. ఎవరి సినిమా కలెక్షన్స్ గురించి వారు గొప్పగా చెప్పుకుంటూ థియేటర్స్ దగ్గర కాలక్షేపం చేసేవారు. ఒక్కోసారి ఇద్దరి హీరోలా అభిమానులు కలెక్షన్స్ గురించి, సినిమా టాక్ గురించి గొడవలు పెట్టుకున్న సందర్భాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఊర్లోనూ ఉండేవి. అభిమానుల మధ్య వాతావరణం ఇలా ఉంటే, చిరంజీవి, బాలయ్య మాత్రం చాలా స్నేహంగా ఉండేవారు. ఒకరి సినిమాల ఓపెనింగ్ కు మరొకరు వెళ్తూ, ఇద్దరి హీరోలా అభిమానులకు మంచి సందేశం ఇచ్చేవారు. అయినా ఫ్యాన్స్ మాత్రం సందేశం లేదు సమోసా లేదు అంటూ, మళ్లి ఇద్దరి హీరోలా కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు షరామామూలే. జ్యోతిచిత్ర, శివరంజని లాంటి సినిమా పత్రికలు తిరగేస్తూ మళ్ళి కలెక్షన్స్ గురించి వాదోపవాదలే. దాదాపు 30 ఏళ్ల క్రితం స్టార్ట్ అయినా ఈ ఫ్యాన్ వార్ ఇప్పటికి అలానే ఉన్నా, ఆ రోజులంత కాదని చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తాజాగా నందమూరి బాలకృష్ణ సినిమాల్లో నటించడం ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, హైదరాబాద్ లో బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుక ఘనంగా జరిగింది.  ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ గురించి, ఆయన సినిమాల గురించి, బాలయ్య తో కలిసి నటించడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.

ఇంద్రసేనారెడ్డి – సమరసింహా రెడ్డి కలిస్తే… 

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా చిరంజీవి సినిమా కెరీర్ లోనే కాకుండా, తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం లిఖించింది. అప్పట్లో ఆ సినిమా రిలీజ్ అయిన సమయంలో బాలయ్య బాబు నటించిన  సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు చూసి, అలాంటి సినిమా చేయాలని చిరంజీవి ఇంద్ర సినిమా చేసారని బాలయ్య అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉండేవారు. రీసెంట్ గా ఇంద్ర రి రిలీజ్ అయినప్పుడు ఈ టాపిక్ మరోసారి సోషల్ మీడియాలో నడిచింది. ఇప్పడు ఇదే విషయాన్నీ చిరంజీవి ప్రస్తావిస్తూ.. సమరసింహారెడ్డి సినిమా చూసి స్ఫూర్తి పొంది, అలాంటి ఫాక్షన్ సినిమా చేయాలని ఇంద్ర సినిమా చేసానని, ఇప్పడు మరలా ఎవరైనా ఇంద్రసేనారెడ్డిని , సమరసింహారెడ్డిని కలిపి ఒక కథ తయారు చేస్తే బాలయ్య బాబుతో కలిసి నటిస్తానని చిరు అన్నారు. పక్కనే ఉన్న బాలకృష్ణ ని కూడా నువ్వు చేస్తావా అని అడిగితే తప్పకుండా అంటూ.. బాలయ్య హుషారుగా ఓకే చెప్పేసారు. ఈ మాటలకి ఫంక్షన్ లో ఉన్న వారంతా కేరింతలు కొట్టారు. చిరంజీవి ఎదురుగా ఉన్న డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఉద్దేశించి నువ్వేమైన రెడీ చేస్తావా అంటూ, ఎవరు ఆ కథతో వచ్చినా తాను రెడీ అని చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

అంతకు మించి…

చిరంజీవి సరదాగా అన్నా, సీరియెస్ గా చెప్పినా ఇది గాని నిజం అయితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. తెలుగు సినిమా రంగంలో ఇద్దరు అగ్ర హీరోలు నటించిన రేర్ మూవీగా చరిత్రలో నిలిచిపోతుంది. కానీ ఈ కాంబినేషన్ ని బాలన్స్ చేస్తూ కథ రాయగల రైటర్ ఎవరున్నారు? ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాకుండా, ఇద్దర్నీ స్క్రీన్ పై ప్రెసెంట్ చేసే డైరెక్టర్ ఎవరు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. ఒకవేళ రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ లాంటివారు అలాంటి కథ గాని రాస్తే, డైరెక్టర్ ఎవరైనా కొంచెం ఈజీ గా డీల్ చేసే అవకాశం ఉంది. సమరసింహారెడ్డి కథ కూడా విజయేంద్ర ప్రసాద్ రాసిందే. ఇక ఆర్ ఆర్ ఆర్ ఎంత అధ్బుతంగా రచన చేసారో మనం ఇప్పటికే చూసాము. ఫాంలో ఉన్న ఇలాంటి రైటర్ కథ ఇస్తే ఓకే. లేకపోతే పాత చింతకాయ పచ్చడే.  సో ..చిరంజీవి సరదగా అన్నా సీరియెస్ గా అన్నా ఇది గాని జరిగితే, మెగా – నందమూరి అభిమానులకే కాదు, ప్రేక్షకులకు పెద్ద సినిమా పండగే. మీరేమంటారు ? ఈ ఆర్టికల్ పై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి.

Pushpa 2: The Rule Will Allu Arjun Sukumar Devi Sri Prasad Create A Musical Sensation Once Again?
Pushpa 2: The Rule Will Allu Arjun Sukumar Devi Sri Prasad Create A Musical Sensation Once Again?

Leave a Comment