Krishna Vamsi Khadgam Movie Re-Release On October 18th | మరోసారి కత్తి పట్టిన కృష్ణవంశీ

Krishna Vamsi Khadgam Movie Re-Release On October 18th | మరోసారి కత్తి పట్టిన కృష్ణవంశీ : సినిమా ఇండస్ట్రీ లో మొదటి సినిమాతో హిట్ కొట్టిన ఏ దర్శకుడైనా సరే, తర్వాత సినిమాని స్టార్ హీరోతో చేయాలని కలలు కంటాడు..అది సహజం కూడా. అయితే ఇక్కడ తన అభిరుచిని పక్కన పెట్టి, హీరో అభిరుచి మేరకు సినిమాలు తీసి హిట్ కొట్టిన దర్శకులు ఉన్నారు..అలాగే ఫెయిల్యూర్ అయిన డైరెక్టర్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. మొదటి సినిమా సక్సెస్ తర్వాత కేవలం తన అభిరుచి ప్రకారం స్టార్ హీరోతో సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు మాత్రం ఒకే ఒక్కడు..అతడే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. తన మొదటి చిత్రం గులాభి గ్రాండ్ సక్సెస్ తర్వాత ఆయనకి నాగార్జున హీరోగా, నిర్మాతగా నిర్మించే చిత్రానికి దర్శకుడిగా అవకాశం వచ్చింది. పెద్ద హీరో తనకి అవకాశం ఇచ్చారని, ఆయనకి నచ్చినట్టు సినిమా చేయకుండా ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని నాగార్జున హీరోగా ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు కృష్ణ వంశీ. ఆ సినిమా హిట్ తర్వాత అలాంటి సినిమానే మరొకటి చేయమని ఎంతోమంది నిర్మాతలు ఆ రోజుల్లో కోటి రూపాయలు పారితోషికం ఆఫర్ చేసినా కాదని, తన అభిరుచి మేరకు అప్పటికి హీరోలు కాని రవితేజ, బ్రహ్మాజీలను హీరోలుగా పెట్టి సింధూరం సినిమాతో తన క్రియేటివిటీ చూపించారు కృష్ణవంశీ. సక్సెస్ వెనుక తను పరుగులు పెట్టకుండా, సక్సెస్ నే తన వెనక పడేటట్టు చేసి, ప్రేక్షకులకు విభిన్న సినిమా ఎక్స్పీరియన్స్ అందించిన దర్శకుల్లో ఆయన మొదటి స్థానంలో ఉంటారు.

Krishna Vamsi Khadgam Movie Re-Release On October 18th | మరోసారి కత్తి పట్టిన కృష్ణవంశీ 

హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు..కానీ డైరెక్టర్స్ కి కూడా ఫ్యాన్ బేస్ ఉంటుందని ప్రూవ్ చేసిన డైరెక్టర్స్ లో కృష్ణవంశీ ఒకరు. అభిమానులంతా క్రియేటివ్ డైరెక్టర్ అని ముద్దుగా పిలుచుకునే కృష్ణవంశీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలని అందించారు. అందులో ఖడ్గం సినిమాది ప్రత్యేక స్థానం.  క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ క్రియేటివిటీ పదును చూపించిన ఖడ్గం సినిమా మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది. ఈనెల 18న ఖడ్గం సినిమాని రి రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు డైరెక్టర్ కృష్ణవంశీ ఈ విషయాన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసారు. 2002 నవంబర్ 29 న విడుదలైన ఖడ్గం సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. తన మొదటి సినిమా గులాబి నుండి సినిమా సినిమాకి సంబంధం లేకుండా, డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు తీస్తూ వచ్చిన కృష్ణవంశీ, ఈ సినిమా కోసం టెర్రరిజం బ్యాక్ డ్రాప్ ని ఎంచుకుని చాలా సున్నితమైన అంశాన్ని చాలా డేరింగ్ గా చూపించారు. అప్పట్లో కాబట్టి అక్కడక్కడా, చిన్న చిన్న అలజడి కనపడింది కానీ, ఇప్పుడైతే సినిమా చూసిన ప్రతీవోడి మనోభావాలు తెగ దెబ్బతినేసి, దేశవ్యాప్తంగా ఈ సినిమా కాంట్రవర్సీ అయ్యేది.

1998…అప్పటికే బ్రహ్మాజీ ఎన్నో తెలుగు సినిమాల్లో సైడ్ విలన్ గానూ, కారెక్టర్ ఆర్టిస్ట్ గాను చిన్న చిన్న పాత్రలు చేస్తూ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కెరీర్ పరంగా స్ట్రగుల్ స్టేజిలో ఉన్నాడు. ఇక రవితేజ అప్పటికే చాలా సినిమాలకు సహాయ దర్శకుడిగానూ, చిన్న చిన్న గుర్తింపులేని పాత్రల్లోనూ నటిస్తూ, బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయం. నిన్నే పెళ్ళాడతా గ్రాండ్ సక్సెస్ తర్వాత ఎన్నో పెద్ద అవకాశాలను కాదని వీళ్ళతో సింధూరం లాంటి సందేశాత్మక చిత్రాన్నితానే స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు కృష్ణవంశీ. ఇక సింధూరం విమర్శకుల ప్రసంశలు అందుకున్నా, కృష్ణవంశీకి మాత్రం ఆర్ధికంగా పెద్ద దెబ్బే కొట్టింది. ఈ సినిమా తర్వాత బ్రహ్మాజీ, రవితేజ హీరోలుగా బిజీ అయిపోయారు. ఇద్దరిలో రవితేజ కెరీర్ స్పీడ్ అందుకుని స్టార్ హీరోగా సింధూరం వచ్చిన రెండు మూడు సంవత్సరాల్లోనే సక్సెస్ ట్రాక్ ఎక్కేసాడు. 2002… ఒకపక్క మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర చిత్రం ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టిస్తున్న సమయంలోనే రవితేజ హీరోగా పూరీ జగన్నాధ్ ‘ఇడియట్’ సంచలన విజయం సాధించింది. ఇక రవితేజ సోలో హీరోగా తన హవా చూపిస్తున్న సమయంలో తనకి లైఫ్ ఇచ్చిన కృష్ణవంశీ తన అభిరుచి మేరకు తెరకెక్కించిన ఖడ్గం చిత్రంలో మరోసారి కోటి పాత్రలో నటించి జీవించాడు రవితేజ.    

game changer movie review
Game Changer Review In Telugu – 2025

మాస్ గా చెప్పాలంటే..కత్తి లాంటి సినిమా 

కృష్ణవంశీ ని క్రియేటివ్ డైరెక్టర్ గా మూవీ లవర్స్ పిలుచుకోడానికి కారణం.. అయన ఎంచుకునే స్టొరీ లైన్స్, దాన్ని ఆయన స్క్రీన్ పై ప్రెజెంట్ చేసే విధానం. ఖడ్గం సినిమాకి ముందు, ప్రిన్స్ మహేష్ బాబు మురారితో సూపర్ డూపర్ హిట్ కొట్టిన కృష్ణవంశీ, ఆ తర్వాత ఎవరైనా అగ్ర హీరోతో సినిమా చేస్తారని అందరూ అనుకుంటుంటే, శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధానపాత్రల్లో ఖడ్గం సినిమాని తెరకెక్కించారు. రిలీజ్ కి ముందు పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్ళిన ఆడియన్స్ ఖడ్గం సినిమా చూసి షాక్ అయ్యారు. మత సామరస్యాన్ని, దేశభక్తిని ఆ కథలో బ్లెండ్ చేసిన తీరు సూపర్బ్ అని చెప్పొచ్చు. సినిమాలు చూసి ఎవ్వరూ మారిపోరుగానీ, ఇది నిజమే కదా..మనం చేస్తున్నది ఇదే కదా.. అనిపిస్తుంది… ఖడ్గం సినిమా చూస్తుంటే. ఆ విధమైన ఆలోచన మన మనసులో పుట్టించి కృష్ణవంశీ ఈ సినిమాతో 100% సక్సెస్ అయ్యారు. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ కేరెక్టర్స్ కి బలమైన నేపధ్యం, అంతకంటే బలమైన కారెక్టరైజేషన్ రాసుకుని చివరి వరకూ సినిమాని ఉత్కంటభరితంగా తెరకెక్కించారు. ఖడ్గం సినిమాలో రాసిన చాలా పదునైన సంభాషణలు మనల్ని ఆలోచనలో పడేస్తాయి. సినిమా ఎంత సీరియస్ టోన్ లో నడుస్తున్నా కృష్ణవంశీ మార్క్ ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, మ్యూజికల్ మేజిక్ ఈ సినిమాలో ఎక్కడా మిస్ అవ్వలేదు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం చేసిన సూపర్ హిట్ ఆల్బమ్ ఇప్పటికీ వినకుండా ఉండలేం. దేశభక్తి ని గుండెలనిండా నింపే పవర్ ఫుల్ సాంగ్స్ తో పాటు రొమాంటిక్ సాంగ్స్, ఐటెం సాంగ్ తో దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాతో అగ్ర సంగీత దర్శకుల జాబితాలో అతి చిన్న వయసులోనే స్థానం సంపాదించాడు. ఇక ఈ సినిమా సాహిత్యపరంగా కూడా ఉన్నత స్థానంలో ఉండటానికి సీతారామశాస్త్రి కూడా ప్రధాన కారణం. ఖడ్గం టైటిల్ సాంగ్, గోవిందా గోవిందా సాంగ్,తన నువ్వు నువ్వు సాంగ్, ముసుగు వెయ్యొద్దు మనసు మీద అనే పబ్ సాంగ్ సీతారామశాస్త్రి సాహిత్యంలో చిత్రానికి వన్నెలద్దాయి. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో సూపర్ హిట్ అయిన ఖడ్గం సినిమాని ఈ జనరేషన్ కుర్రాళ్ళు చాలామంది థియేటర్ లో చూడలేదు. అంతేకాదు ఈ సినిమాకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరికోసం అక్టోబర్ 18న ఖడ్గం సినిమాని రి రిలీజ్ చేయబోతున్నారు. దేశభక్తి, మానవతావిలువలు, ఎమోషన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, ప్రేమ, రొమాన్స్. సంగీతం, సాహిత్యం ఇలా ఒకే సినిమాలో ఇన్ని ఎమోషన్స్ మనం ఖడ్గం సినిమాలో మాత్రమే చూడగలం. ఇన్ని అంశాలను పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసిన ఘనత మాత్రం దర్శకుడు  కృష్ణవంశీ దే.

పాత క్రిష్ణ వంశీని మళ్ళీ చూడొచ్చా?

ఒకప్పుడు అనేక హిట్ సినిమాలు తీసిన చాలామంది దర్శకులు ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేయటంలో తప్పటడుగులు వేస్తున్నారు. ఈక్రమంలో వాళ్ళు చేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విఫలం అవుతున్నాయి. ఒకప్పడు క్రియేటివ్ డైరెక్టర్ గా ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలను తీసిన క్రిష్ణవంశీ అనగానే గులాభి, నిన్నే పెళ్ళాడతా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో పాటు సింధూరం, అంతపురం, ఖడ్గం లాంటి క్లాసిక్ సినిమాలు గుర్తుకువస్తాయి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుండి వచ్చిన క్రిష్ణవంశీ, ఆయన గురువు వర్మ లాగే ఎంతోమంది యువ దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. తనదైన మేకింగ్ స్టైల్ తో, బలమైన భావోద్వేగాలతో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన క్రిష్ణవంశీ హిట్ సినిమా తీసి పది సంవత్సారాలకు పైగానే అవుతోంది. సోషల్ మీడియా జమానా ప్రారంభం అయ్యాక ఆడియన్స్ టేస్ట్ రోజు రోజుకీ మారిపోతుంది. ఇప్పటి సినిమాలకు మహారాజ పోషకులంటే యువతరమే అని చెప్పాలి. మొబైల్ ఫోన్స్ లోనే సోషల్ మీడియా రూపంలో వాళ్లకి బోలెడంత వినోదం దొరుకుతుండడంతో, సినిమాలో కొత్త కంటెంట్ ఉంటే గాని థియేటర్ వైపు వెళ్ళడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రిస్క్ చేయడం ఎందుకని క్రిష్ణవంశీ సినిమాలు తీయటం బాగా తగ్గించారు. చాలాకాలం తర్వాత ఆయన్ని మరాఠీ భాషలో మంచి కుటుంభ కథా చిత్రంగా ఆకట్టుకున్న ‘నట సామ్రాట్’ ఆకట్టుకోవడంతో దాన్ని తెలుగులో ‘రంగ మార్తాండ’ పేరుతో గత సంవత్సరం రీమేక్ చేసారు. రంగస్థల నటుల విశ్రాంత జీవితాలు ఎలా ఉంటాయి అనే పాయింట్ వచ్చిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. రంగస్థలం మీద ఎన్నో పాత్రలకి జీవం పోసి రక్తి కట్టించిన రాఘవ రావు (ప్రకాష్ రాజ్) అనే కళాకారుడు తన నిజ జీవితంలో నటించడం చేతకాక, ఇప్పటి తరం తన వారసులతో ఇమడలేక తన జీవితాన్ని ఎలా ముగించాడనే బలమైన భావోద్వేగాలతో ‘రంగ మార్తాండ’ అందర్నీ ఆలోచింపజేసింది. ప్రకాష్ రాజ్ కి స్నేహితుడిగా ఎప్పడూ నవ్వించే బ్రహ్మనందం ఈ సినిమాలో ఒక బరువైన పాత్రలో జీవించి కంటతడి పెట్టించేలా ఆ పాత్రని రక్తి కట్టించారు.

‘రంగ మార్తాండ’ కథ పరంగా, కంటెంట్ పరంగా బాగున్నా ఇలాంటి కథలు, పాత్రలు మన తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. అందుకే ఈ సినిమాకు అనుకున్నంత ఆదరణ లభించలేదు. గత సంవత్సరం మార్చి లో విడుదల అయిన ఈ సినిమా తర్వాత దర్శకుడు క్రిష్ణవంశీ నుండి కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే రీసెంట్ గా జరిగిన ఖడ్గం మూవీ రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ఖడ్గం సినిమాని మించి, మరో దేశ భక్తి సినిమాని వచ్చే ఏడాది ప్లాన్ చేస్తునట్టు ప్రకటించారు. కథ ప్రకారం ఎవరు ఆ కథకి సెట్ అవుతారో వాళ్ళతోనే సినిమా చేస్తానని చెప్పారు క్రిష్ణవంశీ. ఏదేమైనా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన దర్శకులు ఇప్పడు తమ ఉనికిని చాటుకోడానికి చాలానే కష్ట పడుతున్నారని చెప్పాలి. ఈ కథనం పై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

Game Changer Pre-Release Event Hilights
Game Changer Pre-Release Event Hilights

Leave a Comment