పవన్ కళ్యాణ్ పవర్ పంచ్ కి, వైసిపీ ఔట్ : Pawan Kalyan’s flood relief is 6 crores

పవన్ కళ్యాణ్ పవర్ పంచ్ కి, వైసిపీ ఔట్ : Pawan Kalyan’s flood relief is 6 crores : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ప్రజలు వరదలతో అల్లాడిపోతుంటే, మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా కనపడటం లేదు..ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన ఎక్కడికి పోయాడని, ఏమైపోయడని, గత రెండు రోజులుగా వైసిపీ పైడ్ మీడియా మరియు వైసిపీ నాయకులు మల్లగుల్లాలు పడిపోతున్నారు. వైసిపీ పార్టీ తరపున వరద బాధితులకు జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి సహాయం చేస్తారు? అసలు చేస్తారో..చెయ్యరో, అలాగే గడచిన 5 ఏళ్లలో వేలకోట్లు దోచేసిన వైసిపీ మంత్రులు, ఏంఎల్ఏ లు తమ జేబులోంచి డబ్బులు తీసి వరద బాధితులకి ఎంత అనౌన్స్ చేస్తారో అని జనాలు అనుకుంటుంటే, వీళ్ళు మాత్రం పవన్ నామస్మరణ చేస్తూ మీడియా గొట్టాల ముందుకు వచ్చి తెగ ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళ బాధ చూడలేక పాపం.. పవన్ కళ్యాణ్ నిన్న మీడియా ముందుకు వచ్చి తాను వస్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెప్పడం వల్ల రాలేదని, అధికారులతో వరదపై రివ్యూ మీటింగ్స్ చేస్తున్నానని చెప్పుకోవాల్సి వచ్చింది. వరద బాధితులకు గ్రౌండ్ లో ఉండి సహాయం చేయకుండా ఇలా కెమెరాల ముందు పెర్ఫార్మన్స్ ఇస్తున్న వైసిపీ పార్టీ వారికి ఈరోజు పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పంచ్ ఇచ్చారు.

మాటల నాయకుడు కాదు..చేతల నాయకుడు 

ఒక నాయకుడు పరిపక్వత చెందితే ఎలా ఉంటుందో మాటల ద్వారా కాకుండా, చేతల ద్వారా చూపించారు పవన్ కళ్యాణ్. ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఎంత చేశామన్నది ముఖ్యమని మరోసారి తనలోని ప్రజాసేవకుడ్ని ప్రజలముందు ఉంచారు పవన్. దీంతో మూడు రోజులుగా లేడు లేడు అన్నవారు నోరెళ్ళబెట్టారు. ఈరోజు పంచాయితీ, మరియు ప్రిన్సిపల్ సెక్రెటరీలతో వరసగా సమావేశాలు జరిపిన పవన్ కళ్యాణ్,  ఫైనల్ గా వరద బాధితులకి తానేం చేస్తాడో చెప్పి వైసిపీ నాయకులకు చెంప చెళ్ళుమనేలా సమాధానం చెప్పారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కి కోటిరూపాయలు, అలాగే తెలంగాణకి కోటిరూపాయలు తన సొంత డబ్బుని విరాళంగా ప్రకటించారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ గ్రామీణశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్, వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న400 పంచాయితీలకు, ఒక్కొక్క పంచాయితీకి లక్ష చొప్పున 400 లక్షలు తన సొంత సొమ్ముని విరాళంగా ప్రకటించారు. 400 లక్షలు అంటే 4 కోట్లు. టోటల్ గా 6 కోట్లు వరద బాధితులకు విరాళంగా ప్రకటించి తన ధాతృత్వాన్ని చాటుకున్నారు పవన్. వైసిపీ పార్టీ నాయకులు వీలైతే ఇలాంటి సమయాల్లో సాయం చేయండని, రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేసారు. అలాగే సినిమా ఇండస్ట్రీ నుండి విరాళాలు ప్రకటించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పడు వరదలకే కాదు, ఎప్పడు ఏ ప్రకృతి విపత్తు సంభవించినా ముందుగా నేనున్నా అంటూ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నారు. సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా ఆయన చేసిన సహాయ కార్యక్రమాల గురించి సినిమా ఇండస్ట్రీ ప్రముఖులకే కాదు సామాన్య ప్రజలకు ఆయన దానగుణం గురించి తెలుసు. తనతో సినిమాలు చేసి నష్టపోయిన కొంతమంది నిర్మాతలకు ఆయన పారితోషికం తిరిగి ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తనని కలిసి తమ కష్టాలు చెప్పుకున్న ఎంతోమందికి ఆయన మూడో కంటికి తెలియకుండా ఎన్నో సహాయాలు చేసారు. అందుకే పవన్ కళ్యాణ్ కి సినిమాలపరంగా కంటే ఆయన్ని వ్యక్తిగతంగా అభిమానిస్తారు అభిమానులు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కి ఫ్యాన్స్ కంటే భక్తులే ఎక్కువ మంది ఉన్నారంటారు. బయటవారికే కాకుండా సినిమా ఇండస్ట్రీలోని పేద కళాకారులను, సాన్కేతికనిపుణులను ఎంతో మందిని ఆయన ఆర్దికంగా ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. తన గురించి తన కుటుంభం గురించి ఆలోచించకుండా ఆయన చేసే దానాలు ఆయన వ్యక్తిగత జీవితంపైన ప్రభావం చూపించాయని పవన్ కళ్యాణ్ ని దగ్గరగా చూసినవారు చెప్తారు. తన సొంతానికి కాకుండా ఎప్పుడు ఇతరుల గురించి ఎక్కువగా ఆయన ఆలోచిస్తారు కాబట్టే చిత్ర పరిశ్రమలోని నటీనటులు కూడా పవన్ కళ్యాణ్ ని అమితంగా ఆరదిస్తారు. ఇంతటి అభిమానం బహుశా ఇంతకుముందు, భ్యవిషత్తులోనూ ఏ నాయకుడు, కథానాయకుడు పొందలేదేమో. 

Pawan Kalyan's own mark in the reign..Does it look like good days have come again for AP? పాలనలో పవన్ కళ్యాణ్ తనదైన మార్క్..ఎపి కి మళ్లి మంచి రోజులు వచ్చినట్టేనా?
Pawan Kalyan’s own mark in the reign..Does it look like good days have come again for AP? పాలనలో పవన్ కళ్యాణ్ తనదైన మార్క్..ఎపి కి మళ్లి మంచి రోజులు వచ్చినట్టేనా?

ఆంధ్ర ప్రజల..అదృష్టం 

రాజకీయాల్లో పది కోట్లు ఖర్చు పెట్టి, 100 కోట్లు సంపాదించుకునే రాజకీయ నాయకులున్న రోజులివి. మనకి ఎంతోమంది పారిశ్రామిక వేత్తలు, రాజకీయనాయకులు, ముఖ్యమంత్రులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నా, వాళ్లెవరు ఇప్పటి వరకూ ఇలాంటి సాయం చేయలేదు. అందుకే ఈరోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్ధ రాజకీయనాయకుడు దేశ చరిత్రలోనే లేడని, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం ఆంధ్ర వాళ్ళు చేసుకున్న అదృష్టమని, నెటిజన్స్ అలాగే ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కొంతమంది  జనసైనికులైతే ‘ఏం గుండేరా అది..జై పవన్ కళ్యాణ్ జై జనసేన’ అంటూ సోషల్ మీడియా లో పోస్ట్లు పెడుతున్నారు. మీడియాలో కూడా ఈ వార్త వైరల్ గా మారింది.

YS Jagan Funny Comments On CM Chandrababu At Pithapuram | పవన్ ఇలాఖా లో.. జగన్ జబర్దస్త్ కామెడీ | పవన్ ఇలాఖా లో.. జగన్ జబర్దస్త్ కామెడీ |పవన్ ఇలాఖా లో.. జగన్ జబర్దస్త్ కామెడీ | వరద బాధితుల పరామర్శ పేరుతో విపక్షనేత, పులివెందుల ఏంఎల్ఏ వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan) చేస్తున్న ఓదార్పు యాత్రలు ఇప్పడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజాకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సీరియస్ గా ఆయన చేస్తున్న ఈ పరామర్శ యాత్రలు జనానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వరదలోని బురదంతా పోయాక ఆయన నిన్న pithapuram లో వరద బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పై జగన్ చేసిన ఆరోపణలు, ఆరోపణల క్రమంలో ఆయనిచ్చిన హావభావాలు చూసిన సొంత పార్టీ నేతలు, వైసిపీ అభిమానులు ‘ఇదేందయ్య ఇది..ఇది నేను చూడాలే’ అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారు.

జగన్ ఏం మాట్లాడుతున్నారు.. YS Jagan Funny Comments On CM Chandrababu At Pithapuram | పవన్ ఇలాఖా లో.. జగన్ జబర్దస్త్ కామెడీ | 

వరదలు లేదా ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు బాధితులకి సహాయం అందిందా లేదా ? ఒకవేళ అందకపొతే మొదటగా మన వైపునుండి ఏదైనా చేసి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నది జగన్ మోహన్ రెడ్డి (ys jagan). అలా చేస్తే ఆయన జగన్ ఎందుకవుతారు? 2019 లో అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి రాష్ట్రంలో ఏ జిల్లాలో, ఏ ఊర్లో.. ఏ నేరం జరిగినా, ఏ ఘోరం జరిగినా అదంతా చంద్రబాబు నాయుడు(chandrababu naidu) చేయించాడని డప్పు కొట్టిన జగన్, ఏదైనా మంచి చేస్తే తానే చేసానని, తన వల్లే అది సాధ్యమని ఆ 5 సంవత్సరాలు ఊదరకొట్టి జనానికి పరమ బోర్ కొట్టించారు. ఇక ఆ డప్పు శబ్ధం తట్టుకోలేని జనం, జగన్ ని 11 సీట్లకే పరిమితం చేసి ఇంట్లో కూర్చొబెట్టారు. దాదాపు 30 ఏళ్ళు తానే ఈ రాష్ట్రాన్ని ఏలతానని, తన దరిదాపుల్లోకి కూడా ఎవరూ రారని కలలు కన్న ఆయన కలలు… కల్లలు అయ్యేటప్పటికి ఇప్పడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావటం లేదు. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షం అనేది కనీసం, ఏడాది అయినా టైం ఇవ్వాలి. అప్పటికీ వాళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చక పొతే అప్పడు విమర్శలు చేయాలి. అప్పుడే ఆ విమర్శల్ని జనాలు ఆమోదిస్తారు..నిజమే కదా ఈయన చెప్పేది అనుకుంటారు. ప్రతిపక్షానికి సపోర్ట్ గా ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నది అది కాదు. వేరే లెవెల్ కామెడీ.

RK Roja Poll On Tirumala Laddu Issue : అందరిలోనూ పరువు పోయిందిగా
RK Roja Poll On Tirumala Laddu Issue : అందరిలోనూ పరువు పోయిందిగా

సవాళ్ళ కూటమి..చంద్రబాబు అనుభవం

చంద్రబాబు నాయుడు(chandrababu naidu) జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇంకా 100 రోజుల పాలన కూడా పూర్తవ్వలేదు. ఏదైనా కొత్త ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే బోలెడన్ని బాధ్యతలు, సవాళ్లు ఉంటాయి. పైగా ఈసారి ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా భాగస్వామి అయ్యింది కాబట్టి ఎవరికి ఏ మంత్రివర్గం ఇవ్వాలి? నామినేటెడ్ పోస్ట్లు ఎవరికి ఇవ్వాలి? అనే తర్జనభర్జనలతో పాటు, పాలనా పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని తనకున్న పాలనానుభవంతో చంద్రబాబు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఒక్కొక్క పధకాన్ని అమలు చేసుకుంటూ, ఇచ్చిన హామీల్ని ఎలా నెరవేర్చాలి అనే విషయం పై ఎప్పటికప్పుడు మంత్రులతో సమీక్షలు చేస్తున్నారు. ఇవి కాకుండా ప్రకృతి విపత్తులు, ప్రత్యర్ధ పార్టీ నాశనం చేసిన వ్యవస్థల సవాళ్ళు అదనంగా ఉండనే ఉన్నాయి. జగన్ కూడా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్నవారే. ఇవన్నీ ఆయనకీ తెలియనివి కాదు. తెలిసినా గానీ మీడియా ముందుకు వచ్చి ఆయన అధికార కూటమి పై పసలేని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో జబర్దస్త్ ని మించిన కామెడీ చేస్తున్నారని ఆయన మాటలు, హావభావాలు చూస్తున్న రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పడు జగన్, ఆ పార్టీ నేతలు ఎంతగా గొంతుచించుకున్నా మరో 5 ఏళ్ల తర్వాతే ఎన్నికలు వస్తాయి. వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నట్టు, ఇప్పడు మాట్లాడకపోతే తనకి పొలిటికల్ మైలేజీ రాదన్నట్టు ఆయన మాటలు ఉంటున్నాయి. ఇలాగే పనిగట్టుకుని విమర్శిస్తే, ఆయనకి తర్వాత మాట్లాడానికి ఏమి లేక, మాట్లాడిందే మాట్లాడుతూ జనానికి బోరు కొట్టించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఏం చెప్పినా జనం పట్టించుకోరు. 2024 ఎన్నికల ముందు జరిగిందదే. 

దత్తపుత్రుడు.. ఇప్పడు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు.

పవన్ కళ్యాణ్ నియోజక వర్గం pithapuram లో పర్యటించిన జగన్, పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ నెగిటివ్ గా మాట్లాడకపోవడం విశేషం. పవన్ గురించి చెడుగా మాట్లాడితే అక్కడి ప్రజలు నమ్మరు అనుకున్నారో లేక భవిష్యత్తులో పవన్ అవసరం ఉంటుంది అనుకున్నారో గానీ, ఆయనొక సినిమా యాక్టర్, చంద్రబాబు డ్రామా యాక్టర్ అంటూ పవన్ కొత్తగా వచ్చారు కదా అంటూ కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి దత్త పుత్రుడు, మూడు పెళ్ళిళ్ళు, ప్యాకేజి స్టార్ అని దారుణంగా విమర్శించిన జగన్, ఆయన దెబ్బకే తనకీ పరిస్థితి వచ్చిందని, లేట్ గా తెలుసుకున్నట్టున్నారు. మంచిదే. ఈ విషయమే కాకుండా నిఖార్సైన రాజకీయం ఎలా చేయాలో తెల్సుకుంటే ఆయనకే మంచిది..లేకుంటే ఆయనకీ, వైసిపీ పార్టీ కి రాబోయే రోజుల్లో కష్టమే. వైయస్ జగన్ ఎప్పుడు బయటకు వస్తారో ఆయనకే తెలియదు. వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఏమి అర్ధం కావటం లేదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. ఇటీవల కాలంలో ఆయన మీడియా సమావేశాలు విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. జగన్ ప్రెస్ మీట్ అంటే చాలు, ట్రోల్లెర్స్ వెంటనే రెడీ అయ్యి ఆయన మాట్లాడిన మాటల్ని సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. ఈ కథనం పై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి.

Leave a Comment