Game Changer Trailer Review..రామ్ చరణ్, శంకర్ మ్యాజిక్ చేయబోతున్నారా?

Game Changer Trailer Review..రామ్ చరణ్, శంకర్ మ్యాజిక్ చేయబోతున్నారా? మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ కాంబోలో మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల అయ్యింది. చిత్ర యూనిట్ తో పాటు ధర్శకదీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిధి గా గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్లో జరిగింది. ఇప్పటివరకూ డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయని దర్శకుడు శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ కి తగ్గట్టు ఈ సినిమాని తెరకెక్కించాడా? మెగా అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు సినిమా ఉండబోతుందా, శంకర్ మార్క్ భారీ తనాన్ని నిర్మాత దిల్ రాజు ఎంత వరకూ తెరమీద తీసుకొచ్చారు? మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి ఎంత హెల్ప్ అయ్యింది? ఆర్ ఆర్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ గా ఎలాంటి సంచనాలు సృస్టించబోతున్నారు? ఈ సంక్రాంతికి రియల్ గేమ్ చేంజర్ ఎవరు? గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలా ఉంది?

డైరెక్టర్ శంకర్ స్ట్రాంగ్..కం బ్యాక్.

మొత్తం రెండున్నర నిమిషాల నిడివితో సాగిన గేమ్ చేంజర్ ట్రైలర్ మెగా అభిమానుల,ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా శంకర్ మార్క్ మాయాజాలంతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మెసేజ్ ఓరియెంటెడ్ కధాంశాలను తనదైన శైలిలో కమర్షియల్ గా తెరకెక్కించే దర్శకుడు శంకర్ ఈ సినిమాని కంప్లీట్ ప్యాకేజ్ తో పర్ఫెక్ట్ గా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రామ్ చరణ్ ఇమేజ్ కి తగ్గట్టు దర్శకుడు శంకర్ చూపించిన ఎలివేషన్స్ మెగా అభిమానులను ఒక రేంజ్ లో ఆకట్టుకొబోతున్నాయి. డిఫరెంట్ గెటప్స్ తో, ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. ఫ్లాష్ బ్యాక్ లోని అప్పన్న క్యారెక్టర్ ను, ప్రజెంట్ లోని ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను పార్లర్ గా చూపిస్తూ శంకర్ ట్రైలర్ తో మ్యాజిక్ చేశాడని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా తన మార్కు భారీ కమర్షియల్ హిట్ ని అందుకోలేకపోతున్న శంకర్ ఈ సినిమాతో మరోసారి తన స్టైల్ హిట్ ని రిపీట్ చేయగలడని ట్రైలర్ చూస్తే పక్కాగా తెలుస్తుంది. మాస్ హీరో లుక్ లోనూ, క్లాస్ ఐఏఎస్ ఆఫీసర్ గాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని శంకర్ చూపించిన తీరు మెగా అభిమానుల్నే, కాదు సామాన్య ప్రేక్షకులకు సైతం సినిమా చూడాలని ఆసక్తిని అమాంతం పెంచేసింది. ఇక ట్రైలర్ కోసం తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. పాటల్లోనే కాకుండా ఈమధ్య బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగాను తమ తనదైన మార్క్ చూపిస్తున్నాడు తమన్. గేమ్ చేంజర్ లో వచ్చే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్స్ లో మెగా రచ్చ మామూలుగా ఉండదు.

రామ్ చరణ్, ఎస్ జే సూర్య..నువ్వా నేనా?

తనకి ఒక్కడు పోకిరి లాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా ఇష్టమని ఈమధ్య శంకర్ గేమ్ చేంజర్ ప్రెస్ మీట్స్ లో చెప్తున్నారు. ఈ ట్రైలర్ చూస్తే ఆయన అదే తరహాలో ఒక ఫుల్ మీల్స్ లాంటి మాస్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాని ప్రేక్షకులకు అందించబోతున్నట్టు క్లియర్ గా అర్థం అవుతుంది. ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ కు, ఒక అవినీతిపరుడైన రాజకీయ నాయకుడుకు మధ్య జరిగే రాజకీయ సమరమే ఈ గేమ్ చేంజర్. సినిమాకి తగ్గట్టుగానే ఒక మాస్ హీరోని ఏ విధంగా చూపిస్తే ప్రేక్షకులు, అభిమానులు రిపీటెడ్ గా సినిమా చూస్తారో అదే మోడ్ లో శంకర్ ఈ సినిమాని ఆవిష్కరించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్లో ప్రధాన పాత్రలైన రామ్ చరణ్, సూర్యలపై పొలిటికల్ వార్ ఒక రేంజ్ లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఒకపక్క శంకర్ మార్పు భారీతనం స్క్రీన్ మీద కనిపిస్తూనే కథ ఏంటనేది గెస్ చేయకుండా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. కథలోని ప్రధాన క్యారెక్టర్లన్నిటిని పరిచయం చేస్తూనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. రామ్ చరణ్, హీరోయిన్ కియరా అద్వానీల లవ్ ట్రాక్, అలాగే ఫ్లాష్ ప్యాక్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ తో అంజలి పాత్రను పరిచయం చేశారు. ప్రధాన పాత్రలన్నిటిని చూపిస్తూ కథలో వాళ్లకు ఉండే ఇంపార్టెన్స్ ఏంటో తెలియజేస్తూ ఈ విధంగా ట్రైలర్ కట్ చేయడం ఒక రకంగా కష్టమే అని చెప్పాలి. ఆ టాస్క్ ను పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేటట్టుగా, సినిమా టీం జాగ్రతలు తీసుకుంటూ ట్రైలర్ ని సరైన సమయంలో దించింది.

sankranthiki vasthunnam
Venkatesh Biggest Victory In This Sankranthi – 2025

మాస్ ఎంటర్టైనర్ విత్ మెసేజ్.

సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు అది ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వాలనేది దర్శకుడు శంకర్ సినిమాటిక్ స్టైల్. తన మొదటి సినిమా జెంటిల్మెన్ నుంచి సామాజిక అంశాలను, సొసైటీలోని రుగ్మతలను ఒక డాక్యుమెంటరీలా కాకుండా నేల క్లాస్ నుంచి బాల్కనీ వరకూ అందరూ మెచ్చేలా, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు తీయడంలో దర్శకుడు శంకర్ ని మించిన దర్శకుడు ఇండియాలో లేరనే చెప్పాలి. దాదాపు 30 సంవత్సరాల ముందే టెక్నాలజీని వాడుకుని శంకర్ చేసిన అద్భుతాలు సిల్వర్ స్క్రీన్ పై కనువిందు చేశాయి. మొదటి పాన్ ఇండియా దర్శకుడిగా ఎన్నో విజయాలు అందుకున్న ఆయన ఈమధ్య రేసులో కొంచెం వెనకబడ్డ ఈ సీనియర్ దర్శకుడు ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వబోతున్నట్టు స్పష్టంగా చెప్పేశారు. శంకర్ మార్కు కథకి దిల్ రాజు మేకింగ్ వాల్యూస్ తోడయ్యి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మరో భారీ సినిమా కోసం, భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు గేమ్ చేంజర్ రూపంలో ఒక భారీ గిఫ్ట్ ని నిర్మాత దిల్ రాజు ఈ సంక్రాంతికి సిద్ధం చేశారు. క్లాస్ ఐఏఎస్ ఆఫీసర్ గానూ, పంచకట్టులో ఊర మాస్ అవతారంలో రామ్ చరణ్ ని చూపించి, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని థియేటర్లో విజిల్స్ వేయించే సినిమాని సిద్ధం చేశారు.

కంప్లీట్ తెలుగు నేటివిటీ

Game Changer Trailer Review..రామ్ చరణ్, శంకర్ మ్యాజిక్ చేయబోతున్నారా?

కడుపునిండా 100 ముద్దలు తిన్న ఏనుగు ఒక ముద్ద వదిలిపెడితే, దానికి పెద్దగా వచ్చే నష్టమేం లేదు. కానీ అది లక్ష చీమలకు ఆహారం.. ఇది ట్రైలర్ స్టార్టింగ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్. ఈ ఒక్క డైలాగ్ తోనే సినిమా థీం ఏంటనేది మాటల రచయిత బుర్ర సాయి మాధవ్ తన పదునైన డైలాగ్ తో కథాంశాన్ని ఆవిష్కరించారు. అవినీతిపరులైన రాజకీయ నాయకుల అంతులేని అవినీతిని కంట్రోల్ చేస్తే ఎంతోమంది సామాన్యులకు అన్నం దొరుకుతుందనే పాయింట్ కథాంశంగా గేమ్ చేంజర్ సినిమా ఉండబోతుంది. దర్శకుడు శంకర్ ఇంతకుముందు ఏ సినిమా చేసినా అందులో ఎక్కువగా తమిళ నేటివిటీ కనిపించేది. కానీ ఈసారి తొలిసారిగా ఒక తెలుగు సినిమాకి స్ట్రైట్ గా దర్శకత్వం వహించిన శంకర్ సినిమాలో తెలుగుదనం ఉట్టిపడేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాస్టింగ్ పరంగా గానీ, లొకేషన్స్ పరంగా గాని ఎక్కడ తమిళ వాసన గానీ, అతి గాని గేమ్ చేంజర్ ట్రైలర్లో కనిపించలేదు. శంకర్ చెప్పినట్టుగానే ఒక కంప్లీట్ ఫుల్ మీల్స్ లాంటి భారీ సినిమాని తెరపై చూపించబోతున్నట్లుగా గేమ్ చేంజర్ ట్రైలర్ చూడగానే అనిపించింది.

ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.

ట్రైలర్లో ప్రధానంగా రామ్ చరణ్ ఎన్ని గెటప్స్ లో కనిపించబోతున్నాడనే విషయం రివీల్ చేశారు. ట్రైలర్ అంతా రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి అని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా మిగతా క్యారెక్టర్స్ ని కూడా పరిచయం చేశారు. ట్రైలర్లో మనం చూసింది జస్ట్ 40% టు 50 పర్సెంట్ మాత్రమే అని నిర్మాత దిల్ రాజు ఈరోజు జరిగిన ట్రైలర్ లాంచ్ లో చెప్పారు. తాము కూడా కంప్లీట్ సినిమాని ఈ జనవరి 10న చూడబోతున్నట్టుగా తెలియజేశారు. అలాగే దర్శకుడు శంకర్ ఈ సినిమా ట్రైలర్ గురించి చెబుతూ మరో ఆసక్తికర వ్యాఖ్య చేసి, మెగా అభిమానులను ఊరించారు. అయితే అది రామ్ చరణ్ మరో గెటప్ కి సంబంధించిందా లేక మరి మరేదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి సినిమా ప్రారంభం నుండి సరైన అప్డేట్స్ లేక మెగా అభిమానులు చాలా వరకు డీలా పడిపోయారు. ఆ మధ్య విడుదలైన టీజర్ తో మరోసారి గేమ్ చేంజర్ వార్తల్లో నిలిచాడు. ఇక ఈ ట్రైలర్ తో ఈ సంక్రాంతి మనదే అంటూ ముందుగానే అభిమానులకు భరోసా ఇచ్చాడు రామ్ చరణ్.

game changer
Game Changer Review In Telugu – 2025

సరైన సమయంలో.. పర్ఫెక్ట్ మూవీ

Game Changer Trailer Review..రామ్ చరణ్, శంకర్ మ్యాజిక్ చేయబోతున్నారా?
image source : Meta

ఆర్ ఆర్ ఆర్ లాంటి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ తర్వాత హీరో రామ్ చరణ్ కి పర్ఫెక్ట్ భారీ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ అని చెప్పాలి. rrr లో తన నట విశ్వరూపంతో ఆకట్టుకున్న రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత మరో పెద్ద స్కేల్ ఉన్న సినిమా చేస్తేనే ప్రేక్షకులకు తృప్తిఉంటుంది. ఆ రకంగా గేమ్ చేంజర్ ఈ సమయంలో పర్ఫెక్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఇండియాలోనే భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు శంకర్ కి ఇప్పుడు ఈ సినిమా విజయం చాలా అవసరం. అందుకే తన కం బ్యాక్ కోసం కంప్లీట్ యాక్షన్ ప్యాక్ మూవీని ప్లాన్ చేసారు. ఒక కలర్ ఫుల్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ని చూస్తున్న అనుభూతిని తప్పనిసరిగా ఈ సినిమా ఇస్తుంది అనటంలో సందేహం లేదు. సంక్రాంతికి జనవరి 10న గేమ్ చేంజర్ విడుదలవుతుండగా, జనవరి 12న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ విడుదల కానుంది. 14న విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలవుతోంది. ప్రధానంగా ఈ మూడు సినిమాల మధ్యన పోటీ. ఏ సినిమాకు ఆ సినిమా డిఫరెంట్ జానర్స్ లో ప్రేక్షకుల్ని మెప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే భారీ స్కేల్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాబట్టి గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగితే, రామ్ చరణ్ కున్న మాస్ ఫాలోయింగ్ తో సంక్రాంతి విజేతగా గేమ్ చేంజర్ రికార్డుల మోత మోగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Leave a Comment