In 2024, telugu cinema will be a pan-india success

In 2024, telugu cinema will be a pan-india success : తెలుగు సినిమా ఎదుగుతోంది. ఇతర భాషా పరిశ్రమ వాళ్ళు కుళ్ళుకునే విధంగా తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో తన విజయకేతనాన్ని ఎగరవేస్తోంది. 2024 సంవత్సరం తెలుగు సినిమాకి సంబంధించి మరపురాని విజయాలను అందించింది. తెలుగు సినిమాలను, తెలుగు నటీనటులను చిన్నచూపు చూసే చిత్ర శ్రమలన్నీ ఇప్పుడు తెలుగు సినిమాల వైపు చూస్తున్నాయి. దీనికి కారణం తెలుగు సినిమా జాతీయ స్థాయిలో తన సత్తాను చాటదమే. ఒక భారీ తెలుగు సినిమా రిలీజ్ అవుతోంది అంటే, అటు బాలీవుడ్ హీరోలు కూడా భయపడే పరిస్థితి ఈ 2024 సంవత్సరంలో క్రియేట్ అయింది. జనవరి నెలలో సంక్రాంతి కానుక విడుదలైన హనుమాన్ సినిమా నుండి నిన్న మొన్నటి పుష్ప 2 వరకూ తెలుగు సినిమా తగ్గేదేలే అంటూ తన విజయ పరంపర ని కొనసాగిస్తూ 2025 సంవత్సరంలోకి ప్రవేశించింది. మరి ఈ కొత్త సంవత్సరంలో గడిచిన సంవత్సరం మాదిరిగానే విజయాలు పునరావృతం అవుతాయా? తెలుగు సినిమా జర్నీ ఎలా ఉండబోతుంది?

ఆంజనేయ అభయ హస్తం..

In 2024, telugu cinema will be a pan-india success

సినిమాలకు సంబంధించి సంక్రాంతి సీజన్ అనేది తిరిగిలేని సీజన్ అని చెప్పొచ్చు. మంచి సినిమా ఈ సీజన్లో విడుదలైందంటే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఈ సంవత్సరం జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్, యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్, కింగ్ నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటించిన ‘నా సామి రంగా’ విడుదలయ్యాయి. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం హిట్ కాగా హనుమాన్ చిత్రం మాత్రం జాతీయ స్థాయిలో సంచలన విజయం సాధించింది. సంక్రాంతి సీజన్ లో కంటే ముందే విడుదల కావలసిన హనుమాన్ చిత్రం అనుకోని రీతిలో సంక్రాంతి బరిలో నిలిచింది. హనుమాన్ సినిమా ట్రైలర్ విడుదల దగ్గర నుంచి కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఒక చిన్న హీరోతో దర్శకుడు ప్రశాంత్ వర్మ దాదాపు 30 కోట్ల ఖర్చుతో హనుమాన్ సినిమాని భారీగా తెరకెక్కించారు. సినిమాలో కంటెంట్ ఉంటే అది ఏ రేంజ్ సక్సెస్ లో అవుతుందో హనుమన్ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. 30 కోట్ల సాధారణ బడ్జెట్ తో దర్శకుడు ప్రశాంత వర్మ 100 కోట్ల విలువైన అవుట్ ఫుట్ ని హనుమాన్ సినిమాకి తీసుకొచ్చారు. టెక్నికల్ పరంగా, కథపరంగా హనుమాన్ సినిమా తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ మంచి విజయం సాధించింది. దాదాపు 250 కోట్లకి పైగానే హనుమన్ సినిమా నెట్ వసూళ్ళు సాధించి బాలీవుడ్ నే కాదు ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. కోట్లు ఖర్చుపెట్టి అతి భారీ గ్రాఫిక్స్ సినిమాలు తెరకెక్కించే దర్శకులకు హనుమాన్ ఔట్పుట్ చూసి మతిపోయింది అని చెప్పాలి. సినిమా కథపై క్లారిటీ, టెక్నాలజీ పై ఒక ఐడియా ఉంటే ఎంత ఈజీగా అద్భుతాలు చేయొచ్చా దర్శకుడు ప్రశాంత వర్మ చూపించారు హనుమాన్ సినిమాతో ఇండస్ట్రీ కి కొత్త నిర్వచనం చెప్పారు.

విజువల్ వండర్ కల్కి 2898 ఎడి

బాహుబలి సినిమాతో బాలీవుడ్ ఖాన్ లను సైతం భయపెట్టిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాదిలో కల్కి సినిమాతో మరో ఘనవిజయాన్ని అందుకున్నారు. మహానటి సినిమాతో దర్శకుడుగా తనేంటో ప్రూవ్ చేసుకున్న నాగ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కల్కి సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన కల్కి సినిమా ఇక్కడ మన తెలుగులోనే కాకుండా, ఉత్తర భారతదేశంలోనూ, విదేశాల్లో కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. మరో ఏడు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది? అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే ఊహాజనిత ప్రపంచాన్ని దర్శకుడు నాగ అశ్విన్ కల్కి సినిమా కోసం సృష్టించారు. హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి కథ కథనాలు మన భారతీయ సినిమాలో మచ్చుకైనా ఊహించలేం. అలాంటి అద్భుతాన్ని ఎంతో బ్రిలియంట్ గా, తెరపై ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. నార్త్ ఇండియాలోనూ ప్రభాస్ కల్కి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఓ సరికొత అనుభూతిని ప్రేక్షకులు ఈ సినిమాతో పొందారు.

game changer movie review
Game Changer Review In Telugu – 2025

దేవర దండయాత్ర

పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకున్న మరొక సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ఇదే. దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన దేవర మొదటి భాగం సెప్టెంబర్ నెలలో విడుదలై ఎన్టీఆర్ సినిమాల్లోనే రికార్డ్ వసూళ్లను సాధించింది. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో తొలిసారిగా తెలుగు పరిచయమైంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోడ్ లో నటించిన దేవర లో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్ హైలెట్గా నిలిచాయి. కంటెంట్ పరంగా దేవర సినిమాని కొంతమంది విమర్శించినా విమర్శకుల నోళ్లు మూయిస్తూ ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది.

టిల్లు అన్న సత్తా..

పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకున్న హనుమాన్, కల్కి, దేవర సినిమాల తర్వాత చెప్పుకోవలసిన మరో సినిమా టిల్లు స్క్వేర్. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా దాదాపు 100 కోట్లకు పైగానే వసూళ్లను సాధించి ప్రేక్షకులను అటు ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యపరిచింది. ఇంతకుముందు సిద్దు తొన్నలగడ్డ నటించిన డిజె టిల్లు సినిమాకి కొనసాగింపుగా వచ్చిన టిల్లు స్క్వేర్ ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఎవరు ఊహించలేదు. డిజే టిల్లు లో తనదైన డైలాగ్ డెలివరీతో సినిమాని సూపర్ హిట్ చేసిన హీరో సిద్దు మరోసారి టిల్లు స్క్వేర్ తో ఘనవిజయాన్ని అందుకున్నాడు. సిద్దు, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ త్రిల్లర్ యూత్ నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

లక్ తెచ్చిన లక్కీ..

ఇక నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. నాని సినిమాల్లోనే రికార్డు ఓపెనింగ్స్ సాధించిన సరిపోతా శనివారం యాక్షన్ బేస్డ్ ఎంటర్టైనర్గా మాస్ యూత్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా సూపర్ హిట్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. లిమిటెడ్ బడ్జెట్ తో, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఎక్కడా బోర్ కొట్టని స్పీడ్ స్క్రీన్ ప్లే, అర్థవంతమైన డైలాగ్స్, ఎంగేజింగ్ సీన్స్ తో లక్కీ భాస్కర్ సినిమా స్క్రీన్ పై పరుగులు పెట్టింది. దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లతో లక్కీ భాస్కర్ లక్కీ హిట్ కొట్టాడని చెప్పాలి.

Game Changer Pre-Release Event Hilights
Game Changer Pre-Release Event Hilights

పుష్పరాజ్ జాతర

2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పేస్తూ డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన పుష్పరాజ్ పుష్ప ద రూల్ అంటూ నిజంగానే ఇండియన్ బాక్సాఫీస్ ని రూల్ చేశాడు. 2021 లో విడుదలైన పుష్ప సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాకి కొనసాగింపుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ ఈ డిసెంబర్ మొదటి వారంలో విడుదలైన పుష్ప కలెక్షన్ల జాతరను తలపించాడు. అనకాపల్లి నుండి అమెరికా వరకు కలెక్షన్ల విషయంలో తగ్గేదేలే అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ పై తన దండయాత్ర ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. మన తెలుగు వెర్షన్ కంటే పుష్ప హిందీ వర్షన్ సంచలన విజయం నమోదు చేసింది. ఇప్పటికీ తరగని కలెక్షన్స్ తో నార్త్ ఇండియాలో పుష్పరాజు హవా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్లకు పైగా వసూళ్ళతో పుష్పరాజ్ బాక్సాఫీస్ బాద్షాగా తన సత్తా చూపిస్తున్నాడు. పుష్ప మొదటి భాగంతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సాధించిన అల్లు అర్జున్ పుష్ప 2 లో నటన పరంగా తన విశ్వరూపాన్ని చూపించాడని చెప్పాలి. యాక్షన్ సీన్స్ లోనే కాకుండా, నటన పరంగా మరో మెట్టు పైకి ఎక్కాడు. జాతర సీన్లో అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ చూసిన ప్రతి ఒక్కరూ మరోసారి ఈ సినిమాతో జాతీయ అవార్డు కొట్టడం ఖాయమని అంటున్నారు. పుష్ప దండయాత్ర చూసి బాలీవుడ్ హీరోలు సైతం భయపడుతున్నారు. ఒక భారీ తెలుగు సినిమా విడుదలవుతుందంటే హిందీ సినిమాలన్నీ పక్కకు తప్పుకునే పరిస్థితి ప్రస్తుతం బాలీవుడ్ లో వచ్చేసింది. అల్లు అర్జున్ తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో, సుకుమార్ తన అద్భుతమైన టేకింగ్ తో తెలుగోడి సత్తాను ఇక్కడ ఆంధ్రాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూపించారు.

మహేష్, రాజమౌళి వస్తే..

2024 సంవత్సరంలో తెలుగు సినిమా సాధించిన విజయాలు మర్చిపోలేనివి. ఈ కొత్త సంవత్సరం 2025 లో కూడా ఇలాంటి విజయాలే నమోదు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జనవరి 10న సంక్రాంతి సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చెంజర్ విడుదల కానుంది. ఇది కూడా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా వస్తోంది. ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే మరో పాన్ ఇండియా సక్సెస్ను జనవరిలో బోనీ కొట్టినట్టే. ఇక సూపర్ స్టార్ మహేష్, సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజుభాయ్ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో మరో పాన్ ఇండియా చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతుంది. ఇలా అగ్ర హీరోలు నటించిన క్రేజీ సినిమాలు ఇండియా స్థాయిలో సత్తా చాటగలిగే కంటెంట్తో రానున్నాయి కాబట్టి మరోసారి తెలుగు సినిమా ఖ్యాతిని ఈ కొత్త సంవత్సరంలో కూడా విస్తరిస్తారని ఆశిద్దాం.

Leave a Comment