చలికాలంలో మనకు అనేక చర్మ సమస్యలు వస్తాయి. వాటిలో చర్మం పొడిబారిపోవడం అనేది ప్రధాన సమస్య. పొడి గాలి, చర్మంలోని తేమను గ్రహించడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీనికి పరిష్కారం ఎలానో తెలుసుకోండి.
చలికాలంలో నీళ్ళు తక్కువగా త్రాగుతూ ఉంటాము. దాని వల్ల డీ హైడ్రేట్ అయ్యి, చర్మం పొడిబారుతుంది. దాహం వేయకపోయినా తగినన్ని నీళ్ళు త్రాగడం శరీరానికి చాలా అవసరం.
ఎండ తక్కువగా ఉన్నప్పుడు కూడా సూర్యుని నుండి వచ్చే యువి కిరణాలు మన చర్మాన్ని డామేజ్ చేస్తాయి. కాబట్టి సన్‌స్క్రీన్‌ని అప్లై చేయడం మంచిది.
చలికాలంలో చర్మానికి హైడ్రేటింగ్ లేదా క్రీమ్ క్లెన్సర్‌ని అప్లై చేయండి. ఇది నాన్-ఫోమింగ్. ఇవి వాడటం వల్ల చర్మం దాని సహజ తేమను బయటకు పంపదు. ఇందులో ఉండే గ్లిజరిన్ లేదా సిరామైడ్‌లు తేమను ఎక్కువసేపు ఉంచడంలో సహాయపడతాయి.
చలికాలంలో మాయిశ్చరైజర్, సీరమ్ మిశ్రమాన్ని ఉపయోగించడం చాలా అవసరం. ఎందుకంటే సీరం, మాయిశ్చరైజర్ తేమను ఎక్కువ సమయం ఉంచేలా సహాయ పడతాయి.
చర్మాన్ని స్క్రబ్ చేయడం వలన మృత చర్మ కణాల పొరలు తొలగిపోతాయి. ఇది డెడ్ స్కిన్‌ను తొలగించడమే కాకుండా, మాయిశ్చరైజర్‌లు చర్మంలోకి లోతుగా చేరడానికి కూడా సహాయపడుతుంది.
హ్యూమిడిఫైయర్లు చర్మం తేమగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడతాయి.రాత్రి నిద్రిస్తున్నప్పుడు కూడా చర్మం తేమగా ఉండేలా పనిచేస్తాయి.
పెదవులు, పాదాలు, చేతులు పగిలిపోకుండా ఉండేందుకు లిప్ బామ్‌ను అప్లై చేయండి. చేతులకు, క్రీమీ హ్యాండ్ లోషన్‌ను అప్లై చేయండి. ఇది చలికాలంలో చర్మం పొడిబారకుండా చేస్తుంది. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి.