కాలానికి తగ్గట్టు మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతె ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడతాము. ఇప్పడు శీతాకాలం కాబట్టి ఈ టైం లో ఎలాంటి ఫుడ్ మన శరీరానికి మంచిదో చూద్దాం.
ఉదయం పూట ఒట్ మీల్ తో తయారయిన ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోండి.
ఉదయం.. కూరగాయలు ఎక్కువగా వేసి ఉడికించిన బ్రెడ్ టోస్ట్ కూడా తీసుకోవచ్చు.
బ్రేక్ ఫాస్ట్ తర్వాత అల్లం టీ తాగడం చాలా మంచిది. కుదిరితే అందులో రెండు తులసి ఆకులు వేసుకుని తాగండి.
మద్యాహ్నం భోజనం పొట్టు తీయని గింజల పిండితో చేసిన చపాతీలు మంచివి.
ఒకవేళ అన్నం తింటే అందులో ఎక్కువ కూరగాయలతో చేసిన కూర వేసుకుని తినండి.
వీలైనంత ఎక్కువగా కూరగాయల భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే శీతాకాలంలో అరుగుదల తక్కువ కాబట్టి టైమ్ కి తినండి..తక్కువ తినండి.
ఈ సీజన్ లో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది.
విటమిన్ డి, ఒమేగా ఫాటీ ఆసిడ్స్ కొరకు చేపలను ఎక్కువగా తినండి.
నీళ్ళు తక్కువగా తాగుతాం కాబట్టి డీ హైడ్రేట్ అవ్వొచ్చు.
దాహంగా లేకపోయినా శీతాకాలంలో నీళ్ళు ఎక్కువగా తాగాలి.
శీతాకాలంలో రాత్రి పూట తినే ఆహారంలో నూనె చాలా తక్కువగా వాడాలి.
తినడానికి ముందు గ్రీన్ విజిటేబుల్స్ సూప్ తీసుకోవడం ఎంతో మంచిది.