రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ పుష్ప చిత్రం పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం ముంబై లో గ్రాండ్ గా జరిగింది.
పుష్పరాజ్ దేశంలోని ప్రధాన నగరాలను సుడిగాలిలా చుట్టేయడంతో చిత్రం పై హైప్ ఒక రేంజ్ లో పెరిగింది.
ఇప్పడు అందరి దృష్టి పుష్పరాజ్, శ్రీవల్లి పైనే. పార్ట్ వన్ లో కంటే రెండో భాగంలో శ్రీవల్లి పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండబోతుంది అనే విషయం ట్రైలర్ స్పష్టం చేసింది.
ఐదేళ్ళు గా పుష్ప తో తన ప్రయాణం సాగుతోందని ఇది తన కెరీర్ లోనే మర్చిపోలేని జర్నీ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
ఏనిమల్ తో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక ఈ రెండో భాగం పుష్ప తో మరింత గుర్తింపు కోరుకుంటోంది.
మొదటి భాగంలో మాస్ పుష్పరాజ్ ని చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఊరమాస్ పుష్పరాజ్ ని చూడబోతున్నారు.
డిసెంబర్ 5 నుండి దేశ విదేశాల్లో పుష్ప గాడి మాస్ జాతర మొదలవ్వబోతుంది.