పుష్పరాజ్ ని సర్వాంగసుందరంగా ప్రేక్షాభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకుడు సుకుమార్ టీం పగలు రాత్రి తేడా లేకుండా పని చేస్తోంది.
దర్శకుడు, నిర్మాతలు అందరూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అయిపోవడంతో ఐకాన్ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో బిజీ అయిపోయాడు.
తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని యు ఎ సర్టిఫికేట్ పొందిన పుష్పరాజ్.
కేరళ లోని కొచ్చి లో సందడి అయ్యాక ఇప్పడు ముంబై ఈవెంట్ కోసం బయలుదేరిన అల్లు అర్జున్.
శ్రీవల్లి (రష్మిక) తో సందడి చేస్తోన్న పుష్పరాజ్.
పుష్ప 2 నిర్మాణ వ్యయం 400 కోట్ల నుండి 500 మధ్య ఉంటుందని అంచనా. ఇది భారతీయ చిత్రాల్లో ఖరీదైన చిత్రం.
ఐమాక్స్ స్క్రీన్ పై పుష్పరాజ్ విశ్వరూపం చూడటానికి నిర్మాతలు ఐమాక్స్ ఫార్మాట్ లో చిత్రాన్ని సిద్ధం చేసారు.
ఇప్పటకే నార్త్ లోనూ,తమిళనాడు, కేరళ లోనూ ప్రమోషన్స్ షురూ చేసిన పుష్పరాజ్ తెలుగు వెర్షన్ కి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక ఇంకా జరపలేదు.