తినడం, పని చేయడం, వ్యాయామం చేయడంలానే నిద్ర పోవడం కూడా ఓ దైనందిన చర్య అని మర్చిపోకండి.

మధుమేహం, బిపి, కాన్సర్, ఊబకాయం, డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన ఇవన్నీ నిద్రలేమి వలన మన జీవితంలోకి ప్రవేశిస్తాయి.

ఎక్కువ సమయం నిద్రపోయేవారు ఎక్కువ కాలం జీవిస్తారని అనేక పరిశోధనల్లో తేలింది.

45 సంవత్సరాలు దాటినవారు రోజుకి ఆరుగంటల కన్నా తక్కువ నిద్ర పోతుంటే వాళ్ళలో గుండె జబ్బులు, పక్షవాతము వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు చెప్తున్నారు

పూర్వం బాబిలోనియాకి చెందిన గిల్ గామేష్ అనే రాజు, దీర్ఘకాలం పాటు జీవించాడట. దానికి కారణం అయన రోజూ రాత్రి వేళలో సుమారు తొమ్మిది గంటలపాటు నిద్రపోయే వారట .

నిద్రలేమి అనేది కాన్సర్ కి దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

నిద్రలేమికి, మనకి వచ్చే వ్యాధులకి బలమైన సంబంధం ఉంటుంది.

ఒక్కరోజు నిద్ర లేకున్నా రోగనిరోధక శక్తిలో 70 శాతం దెబ్బతీస్తుంది. రోజులో కనీసం 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి.