Viswambhara Teaser Trolls | Vishwambhara Teaser Reaction | ట్రోలర్స్ కి స్టఫ్ అందించిన విశ్వంభరుడు |

Viswambhra Teaser Trolls | Vishwambhara Teaser Reaction | ట్రోలర్స్ కి స్టఫ్ అందించిన విశ్వంభరుడు |  సినిమా పోస్టర్ చూసి సినిమాకి వెళ్ళే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడంతా డిజిటల్ యుగం. సినిమాకి మహారాజ పోషకులైన యూత్ ఆడియన్స్ చాలా తెలివిమీరి పోయారు. సినిమా ఎలా తీయాలి అనే విషయంపై సినిమా తీసే దర్శకనిర్మాతలకంటే, వీళ్ళకే ఎక్కువ తెలిసిపోతుంది. ఏదైనా సినిమా విడుదలకి ముందు సినిమా యూనిట్ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ నచ్చితే చాలు సోషల్ మీడియా లో పోస్ట్లు, యూట్యూబ్ చానల్స్ లో డిబేట్స్ పెట్టి సినిమాకి వీళ్ళే ఎక్కడా లేని హైప్ తీసుకొస్తున్నారు. ఒకవేళ వీళ్ళ అంచనాలకు తగ్గట్టు సినిమా గాని ఉంటే స్కై ఈజ్ ది లిమిట్ లా ఆ సినిమా విజయం ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా మాట్నీ షో నుండే సినిమా ఖాళి అయిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ నేపధ్యంలో ఒక పెద్ద హీరో, అందులోకి మెగాస్టార్ చిరంజీవి సినిమా, కెరీర్ లోనే భారీ వ్యయంతో తీస్తున్న సినిమా అంటే ఎలా ఉండాలి? టీసర్ తోనే టాప్ లేచిపోవాలి. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన విశ్వంభర టీసర్ టాప్ లేచిపోవడం పక్కన పెడితే..సినిమాపైనే అనుమానాలు పెంచేసింది.

ట్రోలర్స్ కి స్టఫ్ అందించిన విశ్వంభరుడు..

విజయదశమి సందర్భంగా విడుదలైన  మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టీసర్ పై ట్రోల్లింగ్ యుద్ధం మొదలైంది. హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ ని కూడా ఈ ఒకటిన్నర నిమిషాల టీసర్ చాలా నిరుత్సాహ పరిచింది. ఈ సినిమా ప్రకటించినప్పుడు చాలా అంచనాలు క్రియేట్ అయ్యాయి. బింబిసార సినిమాతో తన ప్రతిభ నిరూపించుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ట తో మెగాస్టార్ సినిమా అనగానే కొత్త వాళ్లకి అవకాశం ఇచ్చి చిరంజీవి చాలా మంచి నిర్ణయం తీసున్నారు అనుకున్నారంతా. ఇప్పటివరకూ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఫ్యాన్స్ ని బాగా సంతృప్తి పరచిన సినిమా రాలేదనే చెప్పాలి. ఒక పక్క యంగ్ హీరోలు ఇండస్ట్రీ హిట్ సినిమాలతో దూసుకెల్తున్నారు. మరో పక్క తమిళ, మళయాళ సీనియర్ హీరోలు కొత్త కొత్త కాన్సెప్ట్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధిస్తున్నారు. మరి మన మెగాస్టార్ కు ఏమయ్యింది..ఈ రేమేకుల మేకుల దెబ్బలు ఇంకా ఎన్నాళ్ళు అనుకుంటున్న సమయంలో ఈ సినిమా అనౌన్స్ చేసారు. జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఇదొక పెద్ద ఫాంటాసీ సినిమా అవుతుందని ఆశలు పెట్టుకుని కూర్చున్నారు. సంక్రాంతికి సినిమా విడుదల అంటే ఈ సంక్రాంతి మనదే అంటూ మెగా ఫ్యాన్స్ మంచి ఊపుమీద ఉన్న టైం లో విశ్వంభర టీసర్ రిలీజ్ చేసి వాళ్ళ ఆశలపై డైరెక్టర్, నిర్మాతలు నీళ్ళు చల్లారనే చెప్పాలి.

Viswambhara Teaser Trolls | Vishwambhara Teaser Reaction | ట్రోలర్స్ కి స్టఫ్ అందించిన విశ్వంభరుడు |

విశ్వంభర టీసర్ లో మొదలునుండి చివరి వరకూ కూడా అనేక హాలీవుడ్ సినిమాల రిఫరెన్సులు దర్శనమిచ్చాయి. పొనీ అవ్వన్నీ ఇన్స్పిరేషన్ అనుకుంటే..సిజి వర్క్ లో క్వాలిటీ హిందీ సినిమా సీరియల్స్ లో కంటే దారుణంగా ఉందని కింద కామెంట్ సెక్షన్ లో విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్. ఇక యూట్యూబ్ లో ట్రోల్ వీడియోస్ లెక్కేలేదు. యువీ క్రియేషన్స్ వాళ్ళ మేకింగ్ వాల్యూస్ ఇంత పూర్ గా ఉంటాయని ఎవ్వరూ ఊహించలేదు. యంగ్ డైరెక్టర్ నుండి ఇలాంటి ఔట్ పుట్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఆమధ్య ఆదిపురుష్ సినిమాకి ఎంత నెగిటివ్ టాక్ వచ్చిందో ఇప్పుడు విశ్వంభర కి కూడా అంతే వచ్చింది. దాదాపు 30 కోట్లతో వ్యయంతో  ఆమధ్య వచ్చిన హనుమాన్ చిత్రం ఎంతగా  ప్రేక్షకుల్ని మెప్పించిందో మనం చూసాము. తక్కువ సోర్స్ తో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ హనుమాన్ చిత్రం కోసం సృష్టించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మరి ఇక్కడ చిరంజీవి సినిమా అంటే ఎలా ఉండాలి. విజువల్స్ మరీ పూర్ గా ఉండగా, ఏక్షన్ బ్లాక్స్ సైతం క్వాలిటీ లేకుండా రొటీన్ గా కనిపించాయి. ఇక కీరవాణి బీజియం ఏమత్రం హంటింగ్ గా లేదు. ఇంతకుముందు ఈ దర్శకుడు, కీరవాణి కలసి పని చేసిన బింబిసార చాలా బెటర్ అనిపించింది.  ఒకటిన్నర నిమిషాల టీసర్ తోనే ఎలా చెప్పగలం అనే ప్రశ్నకి అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలదా? ఇక్కడ కథ ఏమిటో ఇంకా మనకి తెలియదు కాబట్టి సినిమా రిసల్ట్ మనం అంచనా వేయలేము. కానీ టెక్నికల్ స్టాండర్డ్స్ ఎలా వున్నాయో టీసర్ చెప్పకనే చెప్పింది. దాదాపు 20 సంత్సరాల క్రితం వచ్చిన మెగాస్టార్ చిత్రం అంజి చిత్రం ఇంపాక్ట్ కూడా ఇందులో కనపడలేదు.

Power Star Pawan Kalyan OG Movie Release When?
Power Star Pawan Kalyan OG Movie Release When?

ఇంకా సమయం ఉంది..మిత్రమా..

మొదట సంక్రాంతికి అనుకున్న ఈ సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కారణంగా వేసవికి వాయిదా పడింది. ఇది కూడా ఒకందుకు మంచిదే అయ్యింది అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికైనా విశ్వంభర మేకర్స్ మేలుకుని సాంకేతికంగా ఇంకా బెటర్ ఔట్ పుట్ వచ్చేలా చేస్తే, కథలో దమ్ముంటే ఇది మరో విజువల్ ఫీస్ట్ అవుతుంది. ఇంకా విడుదలకి ఐదారు నెలల సమయం ఉంది కాబట్టి ఆ అద్బుతం జరుగుతుందని ఆశిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పడు ఈ టీసర్ రిలీజ్ చేసి ఒక రకంగా మంచి పనే చేసారని చెప్పాలి. ఆడియన్స్, ఫ్యాన్స్ రియాక్షన్ ఏమిటో అర్ధం అయ్యింది. లేకపోతే తాము తీసిందే సూపరని మేకర్స్ అనుకునేవారు. ఏది ఏమైనా ott లు వచ్చి కొత్త జానర్ సినిమాలకు అలవాటు పడిన సినిమా లవర్స్ ని ఇలాంటి సేఫ్ జానర్ సినిమాలు ఆకట్టుకోవాలంటే సినిమా కథ, కథనాల్లో బలం, టెక్నాలజీ పరంగా చాలా హై స్టాండర్డ్స్ లో ఉండాలి. అప్పుడే ఆడియన్స్ కి మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నిర్మాతలకు కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. చిన్న చిన్న సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాలు అందుకుంటున్న ఇలాంటి సమయంలో ఇక పెద్ద సినిమాల నేపధ్యం ఇంకెంత కొత్తగా ఉండాలి. మెగాస్టార్ కి ఉన్న ఇమేజ్ కారణంగా మరీ ప్రయోగాలు చేయకుండా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ ని పక్కగా అందిస్తే చాలు భారీ విజయాన్ని ప్రేక్షకులు, అభిమానులు చిరంజీవికి అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే చిరంజీవి సినిమా అంటే ఓ విందు భోజనంలా ఉండాలని అందరూ అనుకుంటారు కాబట్టి.

ట్రోల్ కా బాప్ ఆదిపురుష్..

ఇక ఈ మధ్య కాలంలో ఇలా ట్రోల్కి గురయ్యి చేదు ఫలితాన్ని చూసిన చిత్రాల్లో ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ చిత్రాన్ని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. బాహుబలి లాంటి విజువల్ వండర్ తర్వాత ప్రభాస్ నుండి మరో భారీ చిత్రం, అదికూడా హిందీ లో తెరకెక్కడంతో ఈ ఆదిపురుష్ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరో విజువల్ ఫీస్ట్ చూడబోతున్నామని ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా ఆదిపురుష్ టీజర్ విడుదలైన తర్వాత అది ప్రభాస్ అభిమానుల్నే కాకుండా, సగటు సినిమా అభిమానిని కుడా తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. ఇది మామూలు సినిమానా లేక కార్టూన్ సినిమానా అనే సందేహాలు అందరినీ వెంటాడాయి. అన్ని బాషల్లోనూ ఈ సినిమా టీజర్ భయంకరమైన ట్రోలింగ్ కి గురయ్యింది. ఇది చిత్ర యూనిట్ కి బాగా ఎఫెక్ట్ అయ్యింది. ఈ టీజర్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ చూసిన హీరో ప్రభాస్ దర్శకుడు ఓం రత్ పై ఫైర్ అయ్యాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. సినిమాకి రావసినంత బజ్ రాకపోగా నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. టీజర్ విషయంలో తప్పు ట్రైలర్ లో లేకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడింది. ఆ తర్వాత వచ్చిన ఆదిపురుష్ ట్రైలర్ ఆకట్టుకున్నా సినిమా విడుదల అయిన తర్వాత మాత్రం సినిమా కూడా ముందు రిలీజ్ అయిన టీజర్ కి సినిమాకి పెద్ద తేడా ఏమి లేదని అర్ధం అయ్యింది. రామాయణ గాధని, అందులోని పాత్రల ఆహార్యాన్ని తనకి ఇష్టం వచ్చిన విధంగా మార్చేసి దర్శకుడు ఓం రత్ విమర్శల పాలయ్యాడు. అదే సమయంలో ఆదిపురుష్ కంటే చాలా తక్కువ వ్యయంతో నిర్మితమైన తెలుగు చిత్రం హనుమాన్ క్వాలిటీ వంద రెట్లు బెటర్ గా ఉండడంతో ఆదిపురుష్ చిత్రం ఆ చిత్ర యూనిట్ కి ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది.

ట్రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ ఎక్కడ?

తెలుగులో ట్రోలర్స్ కి కావలసినంత కంటెంట్ అందించే ఫ్యామిలీ అంటే అది మంచు వారి ఫ్యామిలీ అని చెప్పాలి. మంచు హీరోలు మోహన్ బాబు, ఆయన తనయుడు విష్ణు తరచూ ట్రోలింగ్ బారినపడుతూ ఉంటారు. అప్పట్లో  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ వర్గాల మధ్య నడిచిన మాటల యుద్ధం ట్రోల్ చేసేవాళ్ళకి కావలసినంత స్టఫ్ అందించింది. ఇక మరో మంచు వారసురాలు మంచు లక్ష్మి కూడా తన మాటల చమత్కారాలతో ట్రోల్కి గురవుతూ ఉంటారు. ఇక ఈమధ్యే మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప టీజర్ విడుదల అయ్యింది. ఇది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రోలింగ్ యూట్యూబ్ చానల్స్ కి, మీమ్స్ పేజ్ వాళ్లకి అడ్డంగా దొరికిపోయింది. ఆ టీజర్ లో మంచు విష్ణు గెటప్ చూసిన అందరూ ఈ కన్నప్ప స్వదేశి కన్నప్ప కాదు..విదేశీ కన్నప్ప అంటూ చేసారు. టెక్నికల్ గా చాలా లో స్టాండర్డ్స్ లో ఉన్న ఆ టీజర్ ని చూసి, ఇది అమీర్ పేట గ్రాఫిక్స్ కంటే దారుణంగా ఉంది అంటూ చూసిన వాళ్ళు కామెంట్స్ చేసారు. టీజర్ కనిపించిన ప్రతీ ఆర్టిస్ట్ పైనా భయంకరమైన ట్రోల్ నడిచింది. మరి ఇంత బాడ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన తర్వాత చిత్ర నాణ్యత విషయంలో ఎలాంటి తీసుకున్నారో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకూ వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఒకప్పటి రోజులు కావివి. సినిమా పోస్టర్ చూసి ప్రేక్షకులే కథలు చెప్పేసే రోజులివి. మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ వాడకం మొదలయ్యాక అందరూ టెక్నికల్ గా బాగా అప్డేట్ అవుతున్నారు. మరి ఈతరం ప్రేక్షకుల్ని మెప్పించాలంటే అమీర్ పెట్ టాలెంట్ కాదు, హాలివుడ్ టాలెంట్ కావాలి. ఈ అగ్ని పరీక్షను తట్టుకుని రాబోయే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, మంచు విష్ణు కన్నప్ప ఎంతవరకూ నిలబడతాయో చూడాలి. ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ కథనాన్ని కింద ఉన్న సోషల్ మీడియా apps ద్వారా మీ మిత్రులకు షేర్ చేయండి.  

Pushpa 2: The Rule Will Allu Arjun Sukumar Devi Sri Prasad Create A Musical Sensation Once Again?
Pushpa 2: The Rule Will Allu Arjun Sukumar Devi Sri Prasad Create A Musical Sensation Once Again?

   

Leave a Comment