Megastar Chiranjeevi Vishwambhara Official Teaser Review | మెగాస్టార్ చిరంజీవి విజువల్ వండర్ ‘విశ్వంభర’ టీసర్ సినిమాపై అంచనాలు పెంచేసిందా ?

Megastar Chiranjeevi Vishwambhara Official Teaser Review | మెగాస్టార్ చిరంజీవి విజువల్ వండర్ ‘విశ్వంభర’ టీసర్ సినిమాపై అంచనాలు పెంచేసిందా? విజయదశమి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభర (Vishwambhara) మూవీ టీసర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. 40 సంవత్సరాల చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ వ్యయంతో, భారీ తారాబలంతో రాబోతున్న ఈ సినిమాపై కొత్త దర్శకుడు వశిష్ట మల్లిడి అంచనాలు పెంచేసాడా? చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ రాబోతుంది అనే సంకేతాలు ఇచ్చాడా? యువి క్రియేషన్స్ మరో సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంటుందా? పదండి విశ్వంభర చిత్ర టీసర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం…

‘విశ్వంభర’ మెగాస్టార్ కెరీర్ లో ఓ స్పెషల్..

రాజకీయాల్ని శాశ్వతంగా వదిలిపెట్టి, కళామతల్లి ఒడిలోకి తిరిగి వచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ఖైది నెంబర్ 150 తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. 2017 లో విడుదలైన ఆ చిత్రం మెగాస్టార్ లో గ్రేస్ ఏమాత్రం చెక్కుచెదరలేదని నిరూపించింది. ఆ సినిమాని వి వి వినాయక్ దర్శకత్వం లో చేసిన చిరంజీవి ఆ తర్వాత నుండి, తనతో ఇప్పటి వరకూ పనిచేయని కొత్త దర్శకులకి అవకాశం ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆయననుండి ఇప్పటి వరకూ మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్న అసలుసిసలైన మెగా మాస్ సినిమా ఏది పడలేదనే చెప్పాలి. ఈమధ్య దర్శకుడు బాబి తెరకెక్కించిన వాల్తేర్ వీరయ్య తప్పించి మిగతా సినిమాలు ఏవి కూడా మెగా జాతరని గుర్తు చేయలేదు. 69 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలతో పోటిపడుతూ స్పీడ్ గా సినిమాలు చేస్తున్న చిరంజీవి కూడా అభిమానులు అందరూ మెచ్చే ఓ భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో కొత్త దర్శకుడు వశిష్ట మల్లిడి చెప్పిన సోసియో ఫాంటసి కథ ఆయనకు బాగా నచ్చడంతో పచ్చజెండా ఊపేసారు.

చిరంజీవి సోసియో ఫాంటసి సినిమా అనగానే అందరికీ  గుర్తుకువచ్చే చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. అప్పట్లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిన ఆ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఓ క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. మధ్యలో మరో ఫాంటసి చిత్రం ‘అంజి’ రకరకాల సాంకేతిక కారణాలతో అంచనాలని అందుకోలేక పోయింది. ఇన్ని అనుభవాల నేపధ్యంలో చిరంజీవి మరో ఫాంటసి చిత్రానికి శ్రీకారం చుట్టడంతో విశ్వంభర చిత్రం పై అంచనాలు పెరిగిపోయాయి.తన తొలి చిత్రం బింబిసారతో మంచి విజయాన్ని అందుకున్న కొత్త దర్శకుడు వశిష్ట మల్లిడి తన రెండో సినిమాకే మెగాస్టార్ చిరంజీవిని ఇంప్రెస్ చేసి టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. బింబిసార కి కెమరామెన్ గా పనిచేసిన చోటా కే నాయుడు సహకారంతో చిరంజీవికి  విశ్వంభర కథ చెప్పిన ఈ యువ దర్శకుడు ఫస్ట్ సిట్టింగ్ లోనే మెగాస్టార్ ని మెప్పించాడు. ఇక ఈ సినిమానే తన కెరీర్ కి ఆయువుపట్టు అని గ్రహించిన వశిష్ట  విశ్వంభర చిత్రం కోసం ఓ కొత్త విశ్వాన్ని సృష్టించాడు. ఆమధ్య విడుదల చేసిన విశ్వంభర టైటిల్ రివీల్ అండ్ కాన్సెప్ట్ వీడియో తో విశ్వంభర ప్రపంచాన్ని శాంపిల్ గా చూపించాడు. 1:20 సెకన్స్ నిడివితో వచ్చిన ఆ వీడియో తెలుగు తెరపై మరో విజువల్ వండర్ చూడబోతున్నమనే సంకేతాలు ఇచ్చింది. ఇక దసరా పర్వదినాన్ని పురష్కరించుకుని చిత్ర యూనిట్ విశ్వంభర టీసర్ విడుదల చేసింది.

Power Star Pawan Kalyan OG Movie Release When?
Power Star Pawan Kalyan OG Movie Release When?

 ‘విశ్వంభర’ టీజర్ ఎలా ఉంది? 

Megastar Chiranjeevi Vishwambhara Official Teaser Review | మెగాస్టార్ చిరంజీవి విజువల్ వండర్ ‘విశ్వంభర’ టీసర్ సినిమాపై అంచనాలు పెంచేసిందా ? ఒకటిన్నర నిమిషాల నిడివి ఉన్న ఈ కొత్త టీజర్ ఎలా ఉందంటే..There Rises An Evil Forse.. విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు, ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది..అనే గంభీరమైన వాయిస్ తో టీసర్ మొదలవుతుంది. విర్ర వీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహా యుద్దాన్ని తీసుకొస్తుంది. A Legend Rises Like Never Before అంటూ.. రెక్కల గుర్రంపై మెగాస్టార్ ఎంట్రీ అదుర్స్ అని చెప్పొచ్చు. స్టన్నింగ్ విజువల్స్ తో ఒక హాలివుడ్ స్థాయి మేకింగ్ విజువల్స్ తో విశ్వంభర భారీ విస్పోటనం సృష్టించాడని చెప్పాలి. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ తర్వాత తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేసిన ఎస్ ఎస్ రాజమౌళి, తన సృజనతో, ఈ తరం దర్శకులకు ఛాలెంజ్ విసిరాడని చెప్పాలి. రాజమౌళి సినిమాలు చూసిన ప్రేక్షకుల కంటికి ఏ భారీ చిత్రాలు మ్యాచ్ కావడం లేదు. ఈ విషయంలో విశ్వంభర దర్శకుడు వశిష్ట తన విశిష్టత చూపించాడు. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమా తెరపై చూడని ఓ కొత్త మాయా ప్రపంచాన్ని విశ్వంభర తో మనకి చూపించబోతోన్నాడనే విషయం ఈ టీసర్ తో అర్ధమయ్యింది. దర్శకుడు వశిష్ట ఊహల్లోంచి పురుడుపోసుకున్న విజువల్స్ కి ఎం ఎం కీరవాణి తన బీజియంతో ప్రాణం పోసారు. మరోసారి ఇలాంటి సినిమాలకు కీరవాణి నే బెస్ట్ ఛాయస్ అనేటట్టుగా ఆయన పనితనం ఉంది. ఏక్షన్ సీన్స్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే హింట్ ప్రేక్షకులకి ఇచ్చేసాడు డైరెక్టర్. ఇక మెగాస్టార్ స్క్రీన్ ప్రేసెన్స్ గురించి ప్రత్యకంగా చెప్పేదేముంది. మరో యంగ్ చిరంజీవి విశ్వరూపాన్ని ఆ హనుమంతుని శక్తితో విశ్వంభర రూపంలో వస్తున్నాడు. 2025 సంక్రాంతికి విడుదల అని ముందునుంచి ప్రకటించిన చిత్ర యూనిట్ విశ్వంభర విడుదల తేదిపై మాత్రం ఈ టీసర్ లో క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి అభిమానుల అంచనాలకు మించి ఈ చిత్రం మేజిక్ చేయడానికి ముస్తాబవుతోంది.

Megastar Chiranjeevi Vishwambhara Official Teaser Review | మెగాస్టార్ చిరంజీవి విజువల్ వండర్ ‘విశ్వంభర’ టీసర్ సినిమాపై అంచనాలు పెంచేసిందా ?

ఈ సోషల్ మీడియా జమానాలో సినిమా తీయటం ఒకెత్తు అయితే ట్రోలర్స్ ని మెప్పించడం మరో ఎత్తు. ఏదైనా సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ కంటెంట్ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారంటే అభిమానులకంటే ట్రోలర్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. సినిమా, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన పలు యూట్యూబ్ చానల్స్, మీమ్స్ పేజ్ రన్ చేసే వాళ్ళు ఇందులో ముందు వరసలో ఉంటారు. ఏదైనా సినిమాకి సంబంధించి పోస్టర్ గానీ, టీజర్ గానీ, ట్రైలర్ గానీ రిలీజ్ అవ్వడం ఆలస్యం నిమిషాల్లో వాటిమీద వీడియోస్, మీమ్స్ రెడీ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేసేస్తున్నారు. ఆ విడుదలైన సినిమా కంటెంట్ బాగుంటే సినిమాకి ఎంత ప్లస్ అవుతుందో, ఏదైనా తేడాగా ఉంటే మాత్రం అంత మైనస్ అవుతుంది. ఇక మంచి అంచనాలతో విడుదల అయిన విశ్వంభర టీజర్ కూడా ట్రోల్ బారిన పడింది. టీజర్ లో చూపించిన గ్రాఫిక్స్ లో ఎన్నో హాలీవుడ్ చిత్రాల పోలికలు ఉన్నాయనీ, ఆ గ్రాఫిక్స్ కూడా ఏమాత్రం క్వాలిటీ లేకుండా చాలా దారుణంగా ఉన్నాయని, టీజర్ విడుదల అయిన నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. మెగా అభిమానులు కూడా ఇందులో భాగం అయ్యారు. యంగ్ డైరెక్టర్ వశిష్ట నుండి ఇంత లో రేటెడ్ కంటెంట్ ఊహించలేదని, అలాగే ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన యువి క్రియేషన్స్ సంస్థ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా అంటే, ఒక రేంజ్ లో ఉంటుందని అనుకుంటే, ఈ టీజర్ చూస్తుంటే అలా అనిపించడం లేదంటూ సోషల్ మీడియా హేండిల్స్ లో దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. టీజర్ వ్యూస్ రికార్డు స్థాయిలో ఉన్నా, దానికి తగట్టుగానే ఈ టీజర్ పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువ అయిపొయింది. ఇది గమనించిన విశ్వంభర చిత్ర యూనిట్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్టుగా ఫిల్మ్ నగర్ లో టాక్ మొదలయ్యింది.

మెగాస్టార్ ఏం చెయ్యబోతున్నారు?

మిగతా విషయాల్లో ఎలా ఉన్నా ఈ మధ్య మెగాస్టార్  తన నుండి వచ్చే  సినిమాల విషయంలో కొంచెం అసంతృప్తి గా ఉన్న మాట వాస్తవమే. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్నో ఆశలు పెట్టుకున్న సైరా, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు బాగా నిరుత్సాహపరిచాయి. ఖైదీ నెంబర్ 150 తో కం బ్యాక్ హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. మధ్యలో వాల్తేరు వీరయ్య విజయం సాధించినా అందులో మాస్ మహారాజ్ రవితేజ వాటా కూడా ఎంతో కొంత ఉందనే ఉంది. సోలోగా సూపర్ హిట్ కొట్టి చాలాకాలమే అయ్యింది. మరో పక్క తన తోటి ఇతర భాషా సీనియర్ హీరోలు కమల్ హాసన్, మామ్మూట్టి, మోహన్ లాల్ విభిన్న సినిమాలతో అలరిస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేయాలా లేక, తన ఇమేజ్ కి తగ్గ సేఫ్ జోన్ చిత్రాలు చేయాలో అర్ధం కాక మెగాస్టార్ చిరు కొంచెం గందరగోళం లో ఉన్నారని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టే అర్ధం అవుతోంది. రీమేక్ సినిమాలతో సేఫ్ గేమ్ ఆడదామని అనుకున్న ఆయనకీ గాడ్ ఫాదర్, భోళా శంకర్ గట్టి దెబ్బే కొట్టాయి.

Pushpa 2: The Rule Will Allu Arjun Sukumar Devi Sri Prasad Create A Musical Sensation Once Again?
Pushpa 2: The Rule Will Allu Arjun Sukumar Devi Sri Prasad Create A Musical Sensation Once Again?

అందుకే తర్వాత రీమేక్ చేద్దామనుకున్న బ్రో డాడి మలయాళం సినిమాని పక్కన పెట్టేసారు. కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో యంగ్ హీరోతో కలిసి ఈ సినిమా చేయాలనుకున్నారు చిరంజీవి. స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిపోయిన ఈ సినిమాని భోళా శంకర్ దెబ్బతో పక్కన పెట్టారు. ఈ వార్త మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వెంటనే విశ్వంభర సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. తీరా ఈ సినిమా టీజర్ చూసి చూసి హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. తన చేసే ప్రతీ సినిమాని తన ఐడియాస్ తో హంగులు అద్దుతారు చిరంజీవి. విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ కి ట్రోల్స్ రావడంతో డైరెక్టర్ వివి వినాయక్ ని చిరంజీవి రంగంలోకి దించినట్టు వార్తలు వస్తున్నాయి. వినాయక్ పర్యవేక్షణలో విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ జరిగేలా ఆయన ప్లాన్ చేస్తున్నారని, ఈమధ్యే అనారోగ్యం నుండి కోలుకున్న వినాయక్ దానికి ఒకే చెప్పారని అంటున్నారు. గతంలో మెగాస్టార్ నటించిన స్టాలిన్ సినిమాకి వినాయక్ పర్యవేక్షకుడిగా ఉన్నారు. ఇప్పడు మరోసారి విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ కోసం సాయం చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే నిజమైతే రాబోయే విశ్వంభర ట్రైలర్ లో వినాయక్ ఇన్ పుట్స్ కనిపించే అవకాశం ఉంది. ఏది ఏమైనా అందరూ సమిష్టిగా పనిచేసి అధ్బుతమైన ఔట్ పుట్ తీసుకొస్తే మూవీ లవర్స్ కు, మెగా అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంది? ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ ఆర్టికల్ ని మీ మిత్రులకు కింద ఉన్న సోషల్ మీడియా apps ద్వారా షేర్ చేయండి.

Leave a Comment