ఆ సెంటిమెంట్స్ దేవర కి భయం పుట్ట్టిస్తున్నాయా ? NTR Devara Movie Pre Release Review | Korata Shiva |

ఆ సెంటిమెంట్స్ దేవర కి భయం పుట్ట్టిస్తున్నాయా ? NTR Devara Movie Pre Release Review | Korata Shiva | యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర గా మరో కొన్ని గంటల్లో స్క్రీన్ పై దర్శనమివ్వబోతున్నాడు. ఈమధ్య ఏ సినిమాకి రానటువంటి హైప్, అనుమానాలు ఈ సినిమాపై అటు ఫిల్మ్ ఇండస్ట్రీ లోనూ, ప్రేక్షకుల్లోనూ, అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోనూ క్రియేట్ అయ్యాయి. దేవర అదిరిపోతుందని కొంతమంది, ఎక్కడో డౌట్ కొడుతుందని కొంతమంది, ఇలా రకరకాలుగా ఈ భారీ సినిమాపై ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో జనతా గారేజ్ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనమందరం చూశాం. మరి ఆ సినిమాకి రాని హైపు, అనుమానాలు దేవర సినిమాపై ఎందుకొచ్చినట్టు?

ఆ సెంటిమెంట్స్ దేవర కి భయం పుట్ట్టిస్తున్నాయా ? NTR Devara Movie Pre Release Review | Korata Shiva |

మొదటగా చెప్పుకోవాల్సింది హీరో ఎన్టీఆర్ గురించి.. RRR రిలీజ్ ఐన రెండున్నర సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్(Ntr) తెరపై కనిపించబోతున్నాడు. ఆ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్, సోలోగా కనిపించింది మాత్రం అరవింద సమేత వీర రాఘవరెడ్డి. ఆ సినిమా విడుదలై దాదాపు ఆరేళ్ళు. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా వస్తుండడంతో అభిమానులు వేయి కళ్ళతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినమాపై భయకరమైన హైపు. అనుమానాలు క్రియేట్ అవ్వడానికి కారణం దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి, అలాగే దేవర సినిమా దర్శకుడు కొరటాల శివ. ఇక్కడ ఈ సినిమాతో సంభందం లేని రాజమౌళి ప్రస్తావన ఎందుకొచ్చిందంటే రాజమౌళి తో హిట్ కొట్టినాక ఆ సినిమా హీరో మరో హిట్ కొట్టడానికి కొంచెం టైం పడుతుంది అనే సెంటిమెంట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. RRR సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు. RRR తర్వాత విడుదలవుతోన్న ఎన్టీఆర్ సినిమా ఇదే కాబట్టి కొంతమంది ఈ ప్రచారాన్ని బయటకు తీసారు. మగధీర ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్(Ram Charan) ఆరెంజ్ సినిమాతో అపజయాన్ని చూసారు. అలాగే ఆచార్య సినిమాతోనూ మరో అపజయాన్ని చూసారు కాబట్టి ఇపుడు దేవర పరిస్థితి ఏంటి అంటూ కొంతమంది సెంటిమెంట్ గురించి గుర్తు చేస్తున్నారు. ఇక మరో కారణం డైరెక్టర్ కొరటాల శివ.

ఎన్నో అంచనాలతో విడుదల అయిన కొరటాల శివ గత చిత్రం ఆచార్య(Aacharya) ఘోర పరాజయాన్ని చూసింది. పైగా దేవర సినిమా బ్యాక్ డ్రాప్ ఎలిమెంట్స్, కారెక్టర్స్, గెటప్స్ కొంత ఆచార్య సినిమాని పోలి ఉండడంతో మరో ఆచార్య ని గాని తీసాడా కొరటాల శివ అంటూ కొంతమంది trollars, మీమెర్స్ దేవర సినిమాపై ప్రచారం మొదలు పెట్టారు. ఇక్కడ వీళ్ళు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే సెంటిమెంట్స్ అన్నిసార్లు నిజం కావు. రాజమౌళి సినిమా తర్వాత కొంతమంది హీరోలా సినిమాలు ఫెయిల్ అయ్యాయంటే దానికి కారణం అంచనాలు అందుకోలేకపోవడం. మగధీర సినిమాలో హీరోయిజాన్ని పీక్స్ లో చూసిన ప్రేక్షకులు ఆరెంజ్ సినమాలో చరణ్ ని లవర్ బాయ్ గా అంగీకించలేదు. అలాగే ఆ సినిమా కథ కూడా కొంచెం అడ్వాన్స్ మోడ్ లో ఉండటం వల్ల జనాలకి ఎక్కలేదు. ఇక్కడ దేవర ఈ సెంటిమెంట్ ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు అని చెప్పొచ్చు. RRR సినిమా లానే దేవర కూడా ఎమోషనల్ యాక్షన్ బేస్ సినిమా. కంప్లీట్ అవే గా లేకుండా, ఆ ఫ్లో లో వస్తున్న మరో భారీ చిత్రం కాబట్టి కొరటాల శివ ఆ అంచనాలని అందుకుంటే చాలు. దేవర బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా. ఇక ఆచార్య అంటారా ఏ ఒక్క దర్శకుడి పనితనాన్ని ఒక్క సినిమా ఫలితంతో అంచనా వేయలేం..వేయకూడదు కూడా. పైగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఇంతకుముందు జనతా గారేజ్ (Janatha Garage) లాంటి సూపర్ హిట్ ఉంది కాబట్టి ఎన్టీఆర్ నుండి ప్రేక్షకులు, అభిమానులు ఏం ఆశిస్తారో అదే ఇచ్చే అవకాశాలే ఎక్కువ. ఈమధ్య సరైన కమర్షియల్ సినిమా రాక మూవీ లవర్స్ అంతా మంచి ఆకలిమీదున్నారు. వాళ్ళని ఏమత్రం సంతృప్తి పరచినా దేవర రికార్డు వసూళ్లు కొల్లగొట్టడం ఖాయం. 

Power Star Pawan Kalyan OG Movie Release When?
Power Star Pawan Kalyan OG Movie Release When?

నెగెటివ్ టాక్ తో మొదలైన దేవర..

సెప్టెంబర్ 27న భారీ అంచనాల నడుమ ఎన్టీఆర్ దేవర ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ రూపాంతరం చెందిన తరవాత ఆయన సోలో హీరోగా చేసిన చిత్రం కావడంతో దేవర చిత్రాన్ని మన తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసారు. తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ ఈ చిత్రం రికార్డు వసూళ్లతో తొలి రోజు సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాలు ఎక్కువగా పడుతున్న దేవర కలెక్షన్స్ వర్షం మాత్రం..ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ స్తామినాని ప్రూవ్ చేసాయి. ఈ సినిమాకి ముందు దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రం నిరుత్సాహపరచడం, దేవర సినిమా ట్రైలర్ ఆచార్య చిత్రాన్ని పోలి ఉండడంతో దేవర చిత్రానికి తొలిరోజు నెగెటివ్ టాక్ వినిపించింది. రెండు భాగాలుగా తీయల్సినంత కథ ఈ చిత్రం లో లేదని, హీరోయిన్ జాన్వి కపూర్ కి అసలు సరైన కారెక్టర్ పడలేదని, సాంగ్స్ కూడా సగిగ్గా లేవని, ఇలా రకరకాల మాటలు దేవర చిత్రం పై తొలిరోజు వినిపించాయి. ఎవ్వరు ఎన్ని మైనస్ పాయింట్స్ చెప్పినా అందరూ ముక్తకంఠం తో చెప్పిన మాట మాత్రం ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించాడని. దేవర సినిమా కి ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ చాలా కాపాడిందని విమర్శకులు సైతం ఒప్పుకున్నారు.

కలసి వచ్చిన దసరా పండగ 

దేవర ఫైనల్ కలెక్షన్ ఎంతని ఎవరైనా అడిగితే …ఇప్పటివరకూ ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో దేవరకే ఫస్ట్ ప్లేస్ దక్కిందని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ మన తెలుగు భాషకే పరిమితమైన ఒక ప్రాంతీయ హీరో. ట్రిపుల్ ఆర్ తర్వాత హీరో రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ గానీ పాన్ ఇండియా హీరోలుగా ప్రమోట్ అయ్యారు. వీరిద్దరికంటే ముందుగా బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఆ ఇమేజ్ ఎప్పుడో సాధించారు. ఎస్.ఎస్ రాజమౌళి, ప్రభాస్ వేసిన బాటలోనే ఇప్పుడు ఈ హీరోలు అందరూ నడుస్తున్నారు. ఒక భారీ తెలుగు చిత్రం విడుదల అవుతుందంటే హిందీ చిత్రసీమ కూడా భయపడే ఘనతని మన తెలుగు చిత్రసీమ ఈరోజు సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఇప్పుడు హిందీ చిత్రాలకంటే ఒక మెట్టు పైనే ఉన్నామని చెప్పాలి. సినిమాలో కంటెంట్ ఉంటే ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా సినిమా నిలబడుతుంది అనే దానికి దేవర సినిమానే మంచి ఉదాహరణ. సినిమా రివ్యూస్, సోషల్ మీడియా పోస్ట్లు దేవర విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. మౌత్ టాక్ ఈ చిత్రం ఊపందుకుంది. దీనికి దసరా సెలవులు కూడా కలసి రావడంతో దేవర థియేటర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ తో కళకళలాడాయి. దేవర తో పాటు విడుదల అయిన ఏ చిత్రమూ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో దేవర బాక్స్ ఆఫీస్ ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, మిగతా భాషల్లోనూ డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకెళ్ళింది. కేవలం 10 రోజుల్లోనే 466 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

మ్యాజిక్ చేసిన అనిరుద్ మ్యూజిక్..

దేవర చిత్రానికి ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కి ఒక డిఫరెంట్ సౌండింగ్ కావాలని మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ని తీసుకున్నామని దేవర రిలీజ్ కి ముందు దర్శకుడు కొరటాల శివ పలు సందర్భాల్లో చెప్పారు. ఎర్ర సముద్రం దాని సమీపంలో కొండలపై మూడు గ్రామాలు. ఆ గ్రామాల్లో కట్టుబాట్లు, ఆచారాలతో ఒక కొత్త బ్యాక్ డ్రాప్ ని దేవర చిత్రం కోసం డిజైన్ చేసారు. సినిమాలో నడిచే సీన్స్ మూడ్ కి తగ్గట్టు డిఫరెంట్ బీజియం తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ దేవర చిత్రం కోసం ప్రాణం పెట్టాడని చెప్పాలి. ఒక సాధారణ సన్నివేశాన్ని కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ అయ్యేలా చేసాడు. ఇక ఏక్షన్ సీన్స్, ఎన్టీఆర్ ఇంట్రో సీన్స్, సినిమా ప్రారంభంలో వచ్చే సముద్రం లోని దొంగతనం సీన్స్ కి అనిరుద్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక న్యూ సౌండింగ్ ఎక్స్పీరియన్స్ ని మూవీ లవర్స్ కి అందించారు. ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ తర్వాత దేవర చిత్రంలో ఆకట్టుకున్న అంశమంటే అనిరుద్ మ్యూజికల్ మ్యాజిక్ అని చెప్పొచ్చు. 

Pushpa 2: The Rule Will Allu Arjun Sukumar Devi Sri Prasad Create A Musical Sensation Once Again?
Pushpa 2: The Rule Will Allu Arjun Sukumar Devi Sri Prasad Create A Musical Sensation Once Again?
తొలి ప్రయత్నం లోనే నిరాశ పరచిన జాన్వి కపూర్..

అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ దేవర చిత్రం తో తొలిసారి తెలుగు తెరపై కనిపించింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తొలిసారి జోడి కట్టడంతో దేవర చిత్రంపై అందరి దృష్టి పడింది. రెండు భాగాలుగా తెరకెక్కిన దేవర చిత్రంలో ఈ మొదటి పార్ట్ కి సంబంధించి జాన్వీ కపూర్ కి పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కలేదు. సినిమా ద్వితీయార్ధంలో వచ్చిన కథనాయిక పాత్ర అంతగా ప్రాముఖ్యత లేకుండా ఎదో ఉంది అంటే ఉంది అన్నట్టుగా తయారయ్యింది. జాన్వీ ఎంత గ్లామర్ ఒలకపోసిన ఈ పాత్ర అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. సాంగ్స్ పరంగా కూడా చుట్టమల్లె సాంగ్ ఆకట్టుకున్నా, దావూది సాంగ్ సినమాలో ఎక్కడ పెట్టాలో తెలియక వదిలేయడం వల్ల ఎన్టీఆర్ నుండి మంచి డాన్స్ నెంబర్ ని ఊహించుకున్న ఫ్యాన్స్ కి నిరాశే ఎదురయ్యింది. అయితే ఈ పాటను రెండో వారం నుండి జత చేసి వదిలారు. దీనివలన ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మరోసారి దేవర థియేటర్స్ వైపు కదిలారు. దేవర మొదటి భాగంలో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించిన జాన్వీ కపూర్ రెండో భాగంలో ఎంతవరకూ ఉంటుందో చిత్ర యూనిట్ కే తెలియాలి.

లాభాలు తెచ్చిన దేవర.. 

మొత్తానికి నెగిటివ్ టాక్ తో మొదలైన దేవర ప్రయాణం సూపర్ హిట్ చిత్రం గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. టోటల్ కలెక్షన్స్ విషయంలో అంతగా క్లారిటీ లేకపోయినా విడుదలైన ప్రతీ చోటస రెండు వారాల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ కి లాభాల పంట పండించింది. ఎన్టీఆర్ చిత్రాల్లోనే హయ్యెస్ట్ గ్రాస్ సాధించి పాన్ ఇండియా రికార్డు చిత్రాల్లో స్థానం సంపాదించింది. ఎన్టీఆర్ అభిమానులనే కాక, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇక దేవర పార్ట్ 1 లో ఇచ్చిన క్లైమాక్స్ ట్విస్ట్ తో దేవర పార్ట్ 2 ఎప్పడు వస్తుందో అనే ఆసక్తి ప్రేక్షకాభిమనుల్లో పెరిగిపోయింది.

Leave a Comment